వినోదాల వెక్కిరింత!
కాకర్ల నాని (శ్రీధర్), వినీత్, ప్రేయసి నాయక్, మౌనికా రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వెక్కిరింత’. కాకర్ల రాహుల్, శ్వేత సమర్పణలో జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మించారు. చంద్రలేఖ, భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సాయి వెంకట్ విడుదల చేసి ఘంటాడి కృష్ణకు అందించారు.
దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలోని ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయి. వినోద ప్రధానంగా సాగే చిత్రం. ప్రేక్షకులు బోర్ ఫీలవరు. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.శ్రీధర్, టి.పద్మలత, నల్లా వరుణ్ తేజ్.