Vineeth
-
డ్రగ్స్ దందాలో రాజస్తాన్ వ్యాపారులు
గచ్చిబౌలి: నగరంలో స్థిరపడిన రాజస్తాన్‌కు చెందిన కొందరు వ్యాపారుల ద్వారా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినీత్ ఆ కేసు వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్కు చెందిన దినేశ్‌చౌదరి, మంగళారంచౌదరి హెరాయిన్ పేస్ట్ కోసం రాజస్తాన్‌కు చెందిన సవర్‌ఝట్‌కు రూ.48 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు.ఈ నెల 7వ తేదీన రాజస్తాన్ నుంచి ఓ కారులో సైనిక్‌పురికి హెరాయిన్ పేస్ట్ తీసుకొచ్చారు. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డులోని ఓ హోటల్లో మంగరామ్, దినేశ్, గణేశ్‌లు రమేశ్‌చంద్, సురేశ్‌చంద్‌లను కలిశారు. హెరాయిన్ ఎలా విక్రయించాలో వివరించారు. ఆ తర్వాత మరో కారులో గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ప్రకాశ్ లైట్‌హౌస్‌లో హెరాయిన్ పేస్ట్‌ను దాచేందుకు తీసుకొచ్చారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంలో ఎస్ఓటీ మాదాపూర్, రాయదుర్గం పోలీసులు 14న రాత్రి 11 గంటల సమయంలో లైట్‌హౌస్‌పై దాడి చేశారు.హెరాయిన్ పేస్ట్‌తోపాటు పెడ్లర్స్ మంగళారంచౌదరి, దినేశ్ చౌదరి, గణేశ్ చౌదరిలతోపాటు వినియోగదారులు నితిన్‌గుర్జార్, ప్రకాశ్ లైట్‌హౌస్ యజమాని ప్రకాశ్ చౌదరితోపాటు అమీన్‌పూర్‌కు చెందిన జైవత్రం వసనారం దేవసి, సైనిక్‌పురికి చెందిన ప్రకాశ్æచౌదరి, భువనగిరికి చెందిన బానారాం చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సవర్‌ఝట్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.4.34 కోట్ల విలువైన హెరాయిన్ పేస్ట్, రెండు కార్లు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించగా అందరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.ప్రకాశ్ లైట్‌హౌస్ యజమాని మధ్యప్రదేశ్‌లోని ఓ పీఎస్‌లో ఎన్డీపీఎస్ చట్టం కింద ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. రాజస్తాన్‌కు చెందిన ప్రధాన పెడ్లర్ సవర్‌ఝట్ ఎక్కడి నుంచి హెరాయిన్ తీసుకొస్తున్నారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామని డీసీపీ తెలిపారు. నగరంలో స్థిరపడిన రాజస్తాన్‌కు చెందిన వ్యాపారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్ సరఫరా చేసినా, కొనుగోలు చేసినా, వాడుతున్నట్టు తెలిసినా డయల్ 100, 9490617444 ఫోన్నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీలు జయరాం, శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ విక్రయించే రాజస్తానీ అరెస్ట్8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం స్వాధీనంపటాన్చెరు టౌన్: మాదకద్రవ్యాలు విక్రయించే ఓ రాజస్తానీ వ్యక్తిని అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ సంజీవరావు ఆ వివరాలు వెల్లడించారు. పటాన్ చెరు మండల పరిధిలోని చిట్కుల్ రాధమ్మ కాలనీలో మాదకద్రవ్యాలు నిల్వ ఉన్నాయనే సమాచారం మేరకు టీనాబ్, ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడులు చేశారు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజస్తాన్‌కు చెందిన రెయిలింగ్ పనులు పనిచేసే బుధారామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీడీఎల్‌లో ఉంటున్న చిన్నాన్న కొడుకు కోశాలరామ్ డ్రగ్స్ తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవాడని, తొలుత తమకు అలవాటు అయ్యిందని, ఆ తర్వాత వ్యాపారంగా మార్చుకున్నట్టు నిందితుడు తెలిపాడు. అతని నుంచి 8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
బీజేపీ నేత కొడుకు పేర్లు బయటపెట్టిన మాదాపూర్ డీసీపీ
-
Actor Vineeth Unseen Photos: ప్రేమదేశం హీరో వినీత్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
పీవీఎల్ చాంప్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–0 (15–13, 15–10, 15–12)తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టును ఓడించింది. కోల్‌కతా ఆటగాడు వినీత్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవా ర్డును దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కీలకదశలో కోల్‌కతా ఆటగాళ్లు పాయింట్లు గెలిచి వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నారు. వినీత్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ గా... ఎస్వీ గురుప్రశాంత్ (హైదరాబాద్ బ్లాక్‌హాక్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా... అంగముత్తు (అహ్మదాబాద్ డిఫెండర్స్) ‘బెస్ట్ స్పైకర్ ఆఫ్ ద సీజన్’గా... జాన్ జోసెఫ్ (హైదరాబాద్ బ్లాక్ హాక్స్) ‘బెస్ట్ బ్లాకర్ ఆఫ్ ద సీజన్’గా... షాన్ జాన్ (అహ్మదాబాద్ డిఫెండర్స్) ‘ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్’గా అవార్డులు గెల్చుకున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు. -
‘ప్రేమ దేశం’ వినీత్ టాలీవుడ్‌కి ఎందుకు దూరమయ్యాడంటే..
తెలుగు వెండితెరపై చాలా మంది హీరోలు ఇలా వచ్చి అలా వెళ్లారు. వరుస సినిమాలు ప్లాపులు రావడంతో హీరోగా నిలదొక్కుకోలేనివాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ఎంట్రీతోనే హిట్ కొట్టి, తక్కువ సమయంలోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని, అంతే తొందరగా కనుమరుగై పోతున్నారు. ఆ కోవకు చెందిన వారే హీరో వినీత్. ‘ప్రేమ దేశం’సినిమాతో తెలుగులో ఒక్కసారి ఉప్పెనలా లేచిన హీరో వినీత్. సరిగమలు అనే మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ప్రేమదేశం(1996)తో ఆయనకు స్టార్డమ్ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ఈ సినిమా చూసిన తర్వాత అప్పటి యువకులు హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు చాలా విషయాలను ఫాలో అయ్యారు. ఈ సినిమాతో హీరో వినీత్ తెలుగింటివాడైపోయాడు. ఆ క్రేజ్‌తోనే తెలుగులో కొన్ని మంచి సినిమాలు చేశాడు వినీత్. కానీ హీరోగా ఎక్కువకాలం నిలబడలేకపోయాడు. సినీ బ్యాగ్రౌండ్(నటి శోభన కజిన్ ) ఉన్నప్పటికీ ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో హీరోగా అవకాశాలు పొందలేకపోయాడు. దానికి కారణం..వినీత్‌కు తెలుగు భాషపై పట్టులేకపోవడం. స్వతహాగా మలయాళి అయిన వినీత్‌కు తెలుగు భాష పై పెద్దగా పట్టు లేదు. రాజశేఖర్, భానుచందర్, సుమన్ మాదిరిగా డబ్బింగ్ చెప్పుకోవడానికి వీలునప్పటికీ.. క్లాస్ పాత్రలు తప్ప మాస్ పాత్రలకు సరిపోలేదు. క్లాసికల్ డ్యాన్సర్ అయిన వినీత్ కి లవర్ బాయ్, డాన్సర్ కథలు మాత్రమే ఎక్కువగా వచ్చేవి. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో వినీత్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రేమ పల్లకి, ఆరో ప్రాణం, రుక్మిణి, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, పాడుతా తీయగా, ఇలా వరుస సినిమాలు చేసినా పెద్దగా హిట్స్ అందుకోలేకపోయాడు. దీంతో చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి లాహిరి లాహిరి లాహిరిలో, బాపు బొమ్మకు పెళ్ళంట వంటి మూవీస్ లో నటించాడు. అదే సమయంలో మలయాళంలో హిట్స్ రావటంతో తెలుగులో ఆఫర్ తగ్గిపోయాయి. మలయాళంలో వరుస అవకాశాలు రావడంతో టాలీవుడ్ వైపు చూడలేదు వినీత్. 2006 థాంక్స్ సినిమా తరువాత ఎక్కువగా కనిపించలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇటీవల నితిన్ హీరోగా నటించిన రంగ్ దే(2021) మూవీలో కనిపించాడు. మంచి పాత్రలు వస్తే తప్ప తెలుగులో నటించనని వినీత్ భావిస్తున్నారట. చూద్దాం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా వినీత్‌కి తెలుగులో మంచి గుర్తింపు రావాలని ఆశిద్దాం. చదవండి: నటుడు వేణు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా! హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసా! -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సాక్షి, విజయవాడ : అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలపై నిఘా పెడుతున్నామని, డ్రగ్ లైసెన్స్ లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజలాల్ తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్, జీడిమెట్ల ప్రాంతాలలో కొందరు కల్తీ శానిటైజర్ యూనిట్లు నడుపుతున్నట్టు గుర్తించామని, జీడిమెట్ల నుంచి నకిలీ శానిటైజర్లు సప్లై జరుగుతోందని తెలిపారు. నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేటితో ఎస్ఈబీ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల అక్రమ మద్యం కేసులు నమోదు చేశాం. 46,500 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించాం. ఇతర రాష్ట్రాల మద్యంతో పాటు నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నాం. 2 లక్షల యాభై వేల లీటర్ల నాటుసారాను ఐడీ పార్టీ స్వాధీనం చేసుకుంది. ( ఎస్ఈబీ సత్తా చాటుతోంది ) ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న 2,75,000 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశాం. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా జరుగుతున్నట్టు గుర్తించాం. తమిళనాడు, ఒరిస్సా నుంచి తక్కువ స్థాయిలో అక్రమ స్మగ్లింగ్ జరుగుతోంది. ఎక్సైజ్ యాక్ట్ 46 ప్రకారం అక్రమ మద్యాన్ని ధ్వంసం చేస్తున్నాం. లాక్ డౌన్ తర్వాత అక్రమ మద్యం తరలింపు ఎక్కువైoది. పట్టుపడ్డ వారికి 8 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మద్యం రవాణాలో 139 మంది ప్రభుత్వ సిబ్బందిని రిమాండ్‌కి తరలించాం. పట్టుబడ్డ వారిలో 6 గురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, 48 మంది లోకల్ పోలీసులు, సెంట్రల్ పారామిలటరీ సిబ్బంది ఉన్నారు. కల్తీ శానిటైజర్లపై ఎస్ఈబీ, డ్రగ్ కంట్రోల్, పోలీసు శాఖ సంయుక్త దాడులు చేస్తున్నాయ’’న్నారు. పొట్ట చుట్టూ మద్యం సీసాలు టేపు చేసుకుని.. కృష్ణ : అక్రమంగా మద్యాన్ని చేరవేసేందుకు ఓ ఇద్దరు వ్యక్తులు వేసుకున్న ప్లాన్ బెడిసి కొట్టి పోలీసులకు చిక్కారు. మంగళవారం చాట్రాయి మండలం పోలవరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. టేపుతో పొట్ట చుట్టు సీల్ చేసుకున్న దాదాపు 105 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దైవ రహస్యం
వినీత్, దేవయానీ శర్మ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘తూనీగ.. ఒక దైవ రహస్యం’. ప్రేమ్ సుప్రీం దర్శకత్వం వహించారు. పద్మ దేవీప్రభ సమర్పణలో ప్రేమ్ పెయింటింగ్స్‌పై క్రౌడ్ ఫండింగ్‌తో నిర్మించిన ఈ సినిమా పోస్టర్‌ను రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘దైవ రహస్యం వెల్లడించే క్రమంలో ఉత్కంఠ పెంపొందించే కథను తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది. తాత్విక చింతన నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. ఈ చిత్రం కొత్త ఆలోచనలకు చిరునామాగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నా స్వస్థలం శ్రీకాకుళం. మా జిల్లాకు చెందిన పలువురు ఈ సినిమాకి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరుతో పాటు శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మన్యం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఆగస్టు మొదటివారంలో పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు ప్రేమ్ సుప్రీం. -
అతి వేగం...దానికి తోడు మూల మలుపు..
సాక్షి, యాదాద్రి : బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి గ్రామ శివారులో గత రాత్రి జరిగిన ఘోర ప్రమాదానికి అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. దానికి తోడు మూల మలుపు. దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మలుపు వద్ద బోల్తా పడినట్టు ఘటనా స్థలంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాదంలో కారు తుక్కుతుక్కయింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి విషమంగా వుంది. వారంతా ఇబ్రహీంపట్నం శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా భావిస్తున్నారు. చదవండి...(రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల దుర్మరణం) బొమ్మలరామారంలోని ఓ పెట్రోల్ బంక్ ఆవరణలో వున్న ఓ ప్రైవేటు గెస్ట్‌హౌజ్‌లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. అనంతరం అందరూ కలిసి హోండా కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రాత్రి 10.30-10.45 గంటల మధ్య నాగినేనిపల్లి వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ఘోరం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నల్లగొండకు చెందిన స్ఫూర్తి, చాదర్‌ఘాట్‌కు చెందిన ప్రణీత, చంపాపేట ప్రగతినగర్‌కు చెందిన చైతన్యలు అక్కడికక్కడే చనిపోయారు. ఇదే ఘటనలో కుంట్లూరుకు చెందిన మనీష్ రెడ్డి, చంపాపేట్‌కు చెందిన వినీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా వినీత్ రెడ్డి తుది శ్వాస విడవగా మనీష్ రెడ్డి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఇక మృతి చెందినవారిలో ప్రణీత వాళ్ళ అమ్మ, నాన్న అమెరికాలో ఉంటున్నట్లు తెలిసింది. చాదర్‌ఘాట్‌లోని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది. స్ఫూర్తిరెడ్డి స్వస్థలం నల్గొండ. చైతన్య స్వస్థలం అవంగపట్నం, నారాయణ పేట్ మండలం, మహబూబ్ నగర్, ప్రస్తుతం వీరు హైదరాబాద్ జిల్లలగూడా గాయత్రి నగర్లో ఉంటున్నారు. వినీత్ రెడ్డి స్వస్థలం కోహెడ, అబ్దుల్లా పూర్ మెట్. ఈ ఘటనలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనీష్ రెడ్డి స్వస్థలం హయత్ నగర్, కుంట్లూరు. మృతి చెందిన చైతన్య, స్ఫూర్తి, వినీత్, ప్రణీత మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఉదయం భువనగిరి ఏరియా ఆస్పత్రికిని విద్యార్థుల మృతదేహాలను సందర్శించి, సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. -
కమల్, కమల్, కమల్, కమాల్ హోగయా!
సాక్షి, న్యూఢిల్లీ : మీరట్ బీజేపీ నాయకుడు వినీత్ శారద ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ పార్టీ గుర్తు కమలంకు ఓటేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఈ సందర్భంగా ‘కమల్, కమల్, కమల్, కమాల్’ అంటూ ర్యాప్ శైలిలో నినదించిన 32 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన వీడియోకు సోషల్ మీడియా యూజర్లు తమ చమత్కారాన్ని జోడించి మరింత వైరల్‌కు కారణం అవుతున్నారు. మీరట్ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న రాజేంద్ర అగ్రవాల్ ఏప్రిల్ రెండవ తేదీన ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో స్థానిక బీజేపీ నాయకుడు వినీత్ శారద మాట్లాడుతూ ‘ఆప్ కో సోచనా హోగా, కమల్ ఛాయిహే యా క్యా ఛాయిహే’ కమల్, కమల్, కమల్, కమల్ అంటూ పాటందుకొని పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయారు. దాన్ని చూసిన ఓ సోషల్ మీడియా యూజర్ ఆ వీడియోలోని వినీత్ శారద ఆడియోను కట్‌చేసి ‘నాజీలను ఉద్దేశించి హిట్లర్ ఆవేశంగా ఉపన్యసిస్తున్న వీడియో’కు జత చేశారు. అలాగే మరో సోషల్ యూజర్ ఆ ఆడియో భాగాన్ని తీసుకెళ్లి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ శ్రీశ్రీ రవిశంకర్’ పూనకంతో ఊగిపోతున్న వీడియోకు జత చేశారు. దాంతో కమల్ కాస్త చివరకు గోల్మాల్ అయింది. ఏ మాల్ అయితే ప్రచారమే ‘గోల్’ అయినప్పుడు. -
దాబా వద్ద యాక్షన్ సినిమా
సాక్షి, సిటీబ్యూరో: ఓ వ్యాపారవేత్త కూతురి నగ్న చిత్రాలు తన ఉన్నాయని, అవి బయటపెట్టకుండా ఉండాలంటే రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ఈవెంట్ మేనేజర్ వినీత్.. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టాడు. గతంలో ఎలాంటి కేసులు లేకున్నా అతడు నేరం చేసిన తీరు పోలీసులనే ఆశ్చర్య పరుస్తోంది. ఓ ఛానల్లో వచ్చే ‘క్రైమ్ పెట్రోల్’ కథనాలు క్రమం తప్పకుండా చూస్తానని, అవిచ్చిన స్ఫూర్తితోనే బెదిరింపు దందాకు దిగి, పథకాన్ని అమలు చేశానని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితుల అరెస్టు క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా సాగింది. వీరిని పట్టుకోవడంలో సైబర్ క్రైమ్ ఎస్సై యు.మదన్ కీలకపాత్ర పోషించారు. జల్సాల కోసం అప్పులు చేసి.. కామారెడ్డి ప్రాంతానికి చెందిన వినీత్ బంజారాహిల్స్‌లోని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ శిక్షణ సంస్థలో శిక్షణ పొందాడు. ఆపై జూబ్లీహిల్స్‌లో ఎం3 ఈవెంట్స్ పేరుతో సొంతంగా సంస్థను ఏర్పాటు చేశాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో నివసించే ఇతగాడికి స్నేహితులు చాలా మందే ఉన్నారు. గొప్పలకు పోయిన వినీత్ నిత్యం వారితో కలిసి జల్సాలు, విందు వినోదాలకు భారీగా ఖర్చు చేసేవాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా వచ్చే మొత్తం ఈ ఖర్చులకు చాలకపోవడంతో దాదాపు రూ.25 లక్షల వరకు అప్పులు చేశాడు. ఓపక్క వ్యాపారం తగ్గడంతో పాటు మరోపక్క అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో వీటి నుంచి బయటపడటానికి మార్గాలు అన్వేషించాడు. ‘కిడ్నాప్ కథనాలు’ చూసి ప్లాన్.. నిందితుడు వినీత్ ఓ జాతీయ ఛానల్లో వచ్చే క్రైమ్ పెట్రోల్‌ను క్రమం తప్పకుండా చూస్తుంటాడు. పోలీసులకు చిక్కకుండా బాధితుల నుంచి డబ్బు తీసుకోవడం కోసం దీన్ని ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ధనవంతురాలైన తన స్నేహితురాలి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. నగ్న చిత్రాలు ఉన్నాయంటూ వాట్సప్‌లో పంపాడు. అవి బయటపకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఆమె తండ్రిని బెదిరించాడు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని ట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. బాధితురాలి తండ్రితో రూ.20 లక్షలకు బేరం సెట్ చేయించి డబ్బు ఎక్కడకు తీసుకురావాలని అడిగించారు. దీంతో శుక్రవారం çకొంపల్లి ప్రాంతానికి రమ్మని చెప్పిన అతగాడు.. డబ్బు తీసుకోవడం కోసం తన స్నేహితులైన గణేష్, మహేష్‌ను రంగంలోకి దింపాడు. సుచిత్ర వద్ద చిక్కిన ఇద్దరు.. సీరియల్లో కిడ్నాపర్లు బాధితుని తరఫు వారి నుంచి డబ్బు తీసుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో గమనించాడు. తన స్నేహితులు ఇద్దరినీ ఓ బైక్‌పై ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉంచిన ఇతగాడు మాత్రం తూప్రాన్‌లో తిష్టవేశాడు. క్షణక్షణం ఫోన్ చేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ వచ్చాడు. డబ్బు బ్యాగ్ తీసుకుని వెళ్తున్న బాధితురాలి తండ్రి కారు డిక్కీలో దాక్కున్న ఎస్సై యు.మదన్ కొంపల్లిలో వారిని పట్టుకోవాలని భావించారు. అయితే నేరుగా రాని ఆ ఇద్దరూ కారును వివిధ ప్రాంతాల్లో తిప్పి సుచిత్ర వద్ద హైవే మీదికి ఎక్కించారు. దీంతో చాకచక్యంగా కారు దిగిన మదన్.. డబ్బు తీసుకోవడానికి వచ్చిన గణేష్, మహేష్‌ను పట్టుకున్నారు. ‘స్పాట్ ఇంటరాగేషన్’ ఫలితంగా తమ వెనుక వినీత్ ఉన్నాడంటూ బయటపెట్టారు. చిన్న మాటనూ పక్కాగా పట్టేసి.. వీరితోనే ఫోన్ చేయించి వినీత్‌ను రప్పించడం ద్వారా పట్టుకోవాలని భావించారు. ఈలోపు వినీత్ నుంచే గణేష్‌కు ఫోన్ కావడంతో మాట్లాడించారు. అతడి ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రతిసారీ ‘మచ్చ’ అంటూ సంబోధించే గణేష్.. కంగారులో ‘అన్న’ అంటూ విషయం చెప్పాడు. ఈ మాటను పట్టేసిన వినీత్ అలా ఎందుకు పిలిచావని, పోలీసులకు చిక్కావా? అంటూ ప్రశ్నించాడు. అలాంటిదేమీ లేదంటూ పోలీసులు చెప్పించినప్పటికీ నమ్మని వినీత్.. డబ్బు తీసుకుని రామాయంపేట వైపు రమ్మన్నాడు. దీంతో అతడితో కలిసి ఎస్సై మదన్ ద్విచక్ర వాహనంపై అతడు చెప్పిన ప్రాంతాలకు వెళ్తూనే ఉన్నాడు. ఫోన్‌కాల్స్‌లోని అంశాలనూ నిశితంగా పరిశీలించిన వినీత్ ఓ సందర్భంలో వాహనంపై ప్రయాణిస్తుంటే గాలి శబ్ధం ఎందుకు రావట్లేదంటూ ప్రశ్నించాడు. ఆపై గణేష్‌తో ప్రతి కాల్‌నూ వాహనంపై వెళ్తూనే పోలీసులు మాట్లాడించారు. ఇలా 70 కి.మీ ప్రయాణం సాగింది. దాబా వద్ద యాక్షన్ సినిమా గణేష్, మహేష్‌ను డబ్బు తీసుకుని రామాయంపేట చౌరస్తాలో ఉన్న దాబా వద్దకు రమ్మని వినీత్ చెప్పాడు. నిందితులతో అక్కడి వెళ్లిన పోలీసులు.. దాబాలో భోజనం చేస్తున్నామని ప్రధాన నిందితుడికి చెప్పించారు. వినీత్ తెలివితేటల్ని అంచనా వేసిన ఎస్సై మదన్ నిందితులను ఓ చోట కూర్చోబెట్టి, తన టీమ్‌తో మరోచోట కూర్చున్నారు. రోడ్డు అవతలి వైపు ఉన్న పొదల్లో నక్కిన వినీత్.. దాబా వద్ద సీన్‌ను గమనించాడు. ఆపై గణేష్ ఒక్కడినే బయటకు రమ్మని అతడి వద్దనున్న డబ్బు ప్యాకెట్ తీసుకుని పారియాడు. ఈలోపు స్థానికుడైన ఓ యువకుడి సహాయం తీసుకున్న ఎస్సై మదన్ అతడి బైక్‌పై వినీత్‌ను వెంబడించి పట్టుకున్నారు. ఇతడి వ్యవహారశైలిని చూసి గతంలోనూ ఎన్నో నేరాలు చేసిన ఘరానా నేరగాడిగా సైబర్ క్రైమ్ పోలీసుల అనుమానించినా.. విచారణలో ‘క్రైమ్ పెట్రోల్’ విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. -
ఎన్నారై యువకులు సాయం చేయబోయి...
ఏదో సమస్య వచ్చి ఆగిపోయిన కారు యజమానికి సాయం చేద్దామని కిందకు దిగిన ఇద్దరు ఎన్నారై యువకులలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేటకు చెందిన వినీత్ రెడ్డి, తరుణ్ అనే ఇద్దరు యువకులు అమెరికాలో ఉంటున్నారు. అక్కడే ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్లిద్దరూ కారులో ప్రయాణం చేస్తుండగా.. దారిలో వేరే కారు ఆగిపోయి కనపడింది. అత్యవసరంగా ఏవైనా మరమ్మతులు వచ్చినప్పుడు వాహనాలను నిలుపుకొనేందుకు ఉద్దేశించిన 'షోల్డర్' ప్రాంతంలో ఆ కారు ఆగి ఉంది. దాంతో ఆ కారు యజమానికి సాయం చేద్దామని వినీత్, తరుణ్ తమ కారు లోంచి కిందకు దిగారు. ఆగిన కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన ఓ భారీ ట్రక్కు వీరిద్దరినీ ఢీకొట్టింది. దాంతో వినీత్ అక్కడికక్కడే మరణించాడు. తరుణ్ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. -
వినోదాల వెక్కిరింత!
కాకర్ల నాని (శ్రీధర్), వినీత్, ప్రేయసి నాయక్, మౌనికా రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వెక్కిరింత’. కాకర్ల రాహుల్, శ్వేత సమర్పణలో జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మించారు. చంద్రలేఖ, భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సాయి వెంకట్ విడుదల చేసి ఘంటాడి కృష్ణకు అందించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలోని ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయి. వినోద ప్రధానంగా సాగే చిత్రం. ప్రేక్షకులు బోర్ ఫీలవరు. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.శ్రీధర్, టి.పద్మలత, నల్లా వరుణ్ తేజ్.