దైవ రహస్యం | tanikella bharani talks about thuniga oka daiva rahasyam | Sakshi
Sakshi News home page

దైవ రహస్యం

Published Sun, Jul 28 2019 3:44 AM | Last Updated on Sun, Jul 28 2019 3:44 AM

tanikella bharani talks about thuniga oka daiva rahasyam - Sakshi

తనికెళ్ల భరణి, ప్రేమ్‌ సుప్రీం

వినీత్, దేవయానీ శర్మ హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘తూనీగ.. ఒక దైవ రహస్యం’. ప్రేమ్‌ సుప్రీం దర్శకత్వం వహించారు. పద్మ దేవీప్రభ సమర్పణలో ప్రేమ్‌ పెయింటింగ్స్‌పై క్రౌడ్‌ ఫండింగ్‌తో నిర్మించిన ఈ సినిమా పోస్టర్‌ను రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ల భరణి ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘దైవ రహస్యం వెల్లడించే క్రమంలో ఉత్కంఠ పెంపొందించే కథను తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది.

తాత్విక చింతన నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. ఈ చిత్రం కొత్త ఆలోచనలకు చిరునామాగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నా స్వస్థలం శ్రీకాకుళం. మా జిల్లాకు చెందిన పలువురు ఈ సినిమాకి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరుతో పాటు శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట మన్యం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. ఆగస్టు మొదటివారంలో పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు ప్రేమ్‌ సుప్రీం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement