
వెంకటేష్ బ్రదర్ లాంటివాడు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: హీరో వెంకటేష్ తనకు సోదరుడు లాంటి వాడని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన గోపాల గోపాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకటేష్, పవన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.... తాను వ్యక్తిగతంగా కలుసుకునే వ్యక్తుల్లో వెంకటేష్ ఒకరని చెప్పారు. సినిమాల గురించి తాము చాలా తక్కువగా మాట్లాడుకుంటామన్నారు. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయన్నారు. ఈ టాపిక్కే తామీ సినిమా చేయడానికి కారణమన్నారు.
వెంకటేష్ తో కలిసి చాలాసార్లు సినిమా చేయాలనుకున్నా ఇప్పటికి కుదిరిందన్నారు. చాలా భయంతో భగవంతుడి పాత్ర చేశానని అన్నారు. ఏమైనా పొరపాట్లు చేసివుంటే క్షమించాలని పవన్ కళ్యాణ్ కోరారు.