తెలుగు మీడియమ్‌లో చేరతారా? | Venkatesh in Telugu remake of Hindi Medium | Sakshi
Sakshi News home page

తెలుగు మీడియమ్‌లో చేరతారా?

Published Fri, Oct 6 2017 1:01 AM | Last Updated on Fri, Oct 6 2017 1:01 AM

Venkatesh in Telugu remake of Hindi Medium

... ఇప్పుడు చేరడం ఏంటి? వెంకీ స్కూల్, కాలేజ్‌ లైఫ్‌ని ఎప్పుడో దాటేశారుగా అనుకుంటున్నారా? ఈ విక్టరీ హీరో రియల్‌ లైఫ్‌లో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదువుకున్నారు. కానీ, రీల్‌ లైఫ్‌ కోసం తెలుగు మీడియమ్‌లో చేరనున్నారని టాక్‌. ఇర్ఫాన్‌ ఖాన్‌ హీరోగా సాకేత్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘హిందీ మీడియమ్‌’ తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌ నటించనున్నారట.

సినిమాలో ఇర్ఫాన్, ఆయన భార్య పాత్రధారి సబా క్వామర్‌ హిందీ మీడియమ్‌లో చదువుకుంటారు. కూతుర్ని ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చేర్చాలన్నది ఈ దంపతుల కల. కానీ, హిందీ మీడియమ్‌ చదువుకున్న తల్లిదండ్రుల బిడ్డను చేర్చుకోవడానికి ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూల్‌ యాజమాన్యం అంగీకరించదు. దాంతో ఆ భార్యాభర్త తమ కల నెరవేర్చుకోవడానికి ఎలాంటి పాట్లు పడ్డారనే కథాంశంతో సినిమా టచింగ్‌గా ఉంటుంది. ఆ సినిమా ఆధారంగా దర్శకురాలు

నందినీ రెడ్డి తెలుగు సినిమా తీయాలనుకుంటున్నారట. ఇందులో వెంకీ హీరోగా నటిస్తారని భోగట్టా. ఇలాంటి కథ, పాత్రలో ఆయన సులువుగా ఇమిడిపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవేళ ఈ సినిమా ఒప్పుకుంటే మూడో లేడీ డైరెక్టర్‌తో వెంకీ సినిమా చేస్తున్నట్లవుతుంది. శ్రీప్రియ దర్శకత్వంలో ‘దృశ్యం’, సుధ కొంగర’ డైరెక్షన్‌లో ‘గురు’ చేసిన విషయం తెలిసిందే. అన్నట్లు.. హిందీ సినిమా కాబట్టి హిందీ మీడియమ్‌. తెలుగులో రీమేక్‌ చేస్తే తెలుగు మీడియమ్‌ అని మార్చుతారు కదా! దాదాపు 12 కోట్లతో తీసిన ‘హిందీ మీడియమ్‌’ సుమారు 100 కోట్లు వసూలు చేసింది. కథలో అంత దమ్ము ఉంది. ఒకవేళ ఈ కథ వెంకీ దగ్గరకు వెళితే కాదనరని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement