హైదరాబాద్‌లోనే ఆడియో వేడుక..! | Venue Confirmed For Bharat Ane Nenu Audio Launch | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 10:52 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Venue Confirmed For Bharat Ane Nenu Audio Launch - Sakshi

భరత్‌ అనే నేను సినిమాలో మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్‌ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమా రిలీజ్‌కు ముందు భారీ ప్రీ రిలీజ్‌, ఆడియో ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది.

ముందుగా ఈ వేడుకను వైజాగ్‌ లో నిర్వహించాలని భావించారు. తరువాత వేదికను విజయవాడకు మార్చినట్టుగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే నిర‍్వహించాలని ఫిక్స్‌ చేశారట. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యేందుకు వీలుగా ఎల్బీ స్టేడియంలో ఈవెంట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 7న వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement