పాటల ‘వేట’ | Veta Movie Audio Launched | Sakshi
Sakshi News home page

పాటల ‘వేట’

Published Fri, Jan 10 2014 12:14 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

పాటల ‘వేట’ - Sakshi

పాటల ‘వేట’

 శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్‌లో అశోక్ అల్లె దర్శకత్వంలో సి.కల్యాణ్ సమర్పణలో సీవీరావు, శ్వేతలానా, వరుణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. ఈ సినిమా పాటల సీడీని హైదరాబాద్‌లో వెంకటేష్ ఆవిష్కరించి, తొలి ప్రతిని వీవీ వినాయక్‌కి అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఈ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘నాకు, తరుణ్‌కి ఈ సినిమా పెద్ద పేరు తేవాలి’’ అన్నారు. శ్రీకాంత్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తరుణ్ పేర్కొన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని డి.రామానాయుడు ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఎన్.శంకర్, చక్రి, పోకూరి బాబూరావు, తారకరత్న, తనీష్, సురేష్ కొండేటి, శివాజీరాజా తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement