ప్రముఖ దర్శకుడు మృతి | Veteran Director Yerneni Ranga Rao Passed Away | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడు మృతి

Published Tue, Aug 20 2019 9:27 PM | Last Updated on Tue, Aug 20 2019 9:27 PM

Veteran Director Yerneni Ranga Rao Passed Away - Sakshi

సాక్షి, కృష్ణా: ప్రముఖ సినీ దర్శకుడు యెర్నేని రంగారావు మృతిచెందారు. ఈయన ఆదివారం (ఆగస్టు 18)న స్వర్గస్తులైనారు. వాహిని స్టూడియోలో పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ప్రముఖ దర్శకుడు కెవి రెడ్డి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తరువాత ఆయన మాయావి, అర్చణ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. యెర్నేని రంగారావు కృష్ణా జిల్లాకు గుడివాడ దగ్గర్లోని గురజకు చెందినవారు. ఈయన సతీమణి రఘుమాదేవి 2014లో మరణించారు. రంగారావు అంతిమయాత్ర 21-08-2019 న ఉదయం 9గంటలకు గురజలో జరుగుతుందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement