సుప్రసిద్ధ సినీ, నవలా రచయిత, నటుడు చింతపెంట సత్యనారాయణ రావు (85) మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, జాతీయ అవార్డు చిత్రం ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి ఎన్నో సినిమాలకు కథలు అందించారు. అలాగే ఎన్టీఆర్ నటించిన సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సొమ్మొకడిది సోకొకడిది వంటి చిత్రాల్లో నటించారు. నాటక రంగానికి విశేషమైన సేవ చేసి ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. ఎందరో నటీనటులకి ఆచార్యులుగా కూడా వ్యవహరించారు. (10,505 మందికి కరోనా పరీక్షలు పూర్తి )
సీఎస్ రావు ప్రస్తుతం చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సింగపూరులో ఉండడం వల్ల రాలేని పరిస్థితి నెలకొంది. లాకౌట్ నియమాలను గౌరవించి ఎవ్వరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయవద్దని కుటుంబ సభ్యులు సినీపరిశ్రమ మిత్రులని, శ్రేయోభిలాషులని కోరారు. బుధవారం హైదరాబాదులోనే సీఎస్ రావు అంత్యక్రియలు జరగనున్నాయి. (వైరల్: సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!)
Comments
Please login to add a commentAdd a comment