యామీ గౌతమ్
కళాకారులకు అభినందనలు, పురస్కారాలే నిజమైన బహుమతులు. అలాంటి బహుమతి లభించినందుకు తెగ ఆనందపడిపోతున్నారు నటి యామీ గౌతమ్. ఆదిత్యా థార్ దర్శకునిగా పరిచయం అయిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్’ సినిమాలో పల్లవి శర్మ అలియాస్ జాస్మిన్ అనే ఓ ప్రధాన పాత్ర చేశారు యామీ గౌతమ్. విక్కీ కౌశల్ హీరోగా నటించారు. 2016లో జరగిన ఉరి దాడి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం దాదాపు 300కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బెంగళూరులో జరిగిన ఓ యూత్ సమ్మిట్లో పాల్గొన్న యామి ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
‘‘సైనికుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది. ఓ టీనేజ్ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ‘సినిమాలో రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా బాగా నటించారు. మన ఆర్మీ బలగాలపై నాకు మరింత గౌరవం పెరిగింది. భవిష్యత్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయి, దేశానికి సేవ చేస్తాను’ అంది. అప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. సినిమాలో నేను చేసిన పాత్ర ఆ అమ్మాయికి స్ఫూర్తిగా నిలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ అమ్మాయి మాటలే నాకు దక్కిన నిజమైన బహుమతిగా భావిస్తున్నాను’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment