నన్ను గుర్తుపట్టారా? | vidya balan acting in gutti character | Sakshi
Sakshi News home page

నన్ను గుర్తుపట్టారా?

Published Thu, Jul 3 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

నన్ను  గుర్తుపట్టారా?

నన్ను గుర్తుపట్టారా?

‘‘హలో... నన్ను గుర్తు పట్టారా? గుర్తు పట్టకపోతే నిజంగా నేను సక్సెస్ అయినట్టే’’ అందా లావుపాటి ఆంటీ. ఎవరబ్బా అని అంతా తమ బుర్రకు పదునుపెట్టి మరీ ఆలోచించారు. ఎవ్వరికీ చిక్కలేదు. ఫైనల్‌గా తెలిసిందేమిటంటే తను... విద్యాబాలన్! ‘బాబీ జాసూస్’. అనే సినిమాలో కథానుసారం పన్నెండు రకాల అవతారాల్లో కనిపిస్తారు విద్యా. అందులో యాచకురాలి పాత్ర ఒకటి. సినిమా కోసం ఈ వేషం ధరించడమే కాదు.. చివరికి ఇదే గెటప్‌లో ఇటీవల ప్రచారం చేశారు విద్యా. ఇప్పుడు ‘గుత్తి’ అవతారంలోకి మారారు.

‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ అనే బుల్లితెర షో ద్వారా ఈ గుత్తి కారెక్టర్ చాలా పాపులర్. అచ్చంగా గుత్తిలానే మారిపోయి, ‘జలక్ దిఖ్‌లా జ’ అనే డాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు విద్యాబాలన్. ఆమెను ఆ అవతారంలో చూసి, ముందుగా ఎవరూ గుర్తుపట్టలేదట. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని, ‘శభాష్ విద్యా’ అని ప్రశంసించారట. నిజంగానే అభినందించదగ్గ విషయమే. విద్యాబాలన్ తన వృత్తిపట్ల ఎంత అంకితభావంతో ఉంటారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ గురువారం ‘బాబీ జాసూస్’ విడుదల కానుంది. మరి.. విద్యా పడిన కష్టానికి ఎలాంటిప్రతిఫలం లభిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement