రచయిత్రి పాత్ర | Vidya Balan to play writer Kamala Das in a Malayalam | Sakshi
Sakshi News home page

రచయిత్రి పాత్ర

Published Mon, Feb 22 2016 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

రచయిత్రి పాత్ర

రచయిత్రి పాత్ర

హిందీలో తిరుగులేని తారగా నిలదొక్కుకుని హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచిన కథానాయిక విద్యాబాలన్. ఈ మలయాళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ తన మాతృభాషలో ఓ సినిమా చేయనున్నారు. ‘డర్టీ పిక్చర్’లో సిల్క్‌స్మిత పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన ఆమె తాజాగా ఈ మలయాళ చిత్రంలో ఓ రచయిత్రి పాత్రలో ఒదిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఆంగ్ల, మలయాళ  రచయిత్రి కమలా సురయ్యా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. కమల్ అనే సీనియర్ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ పాత్ర మూడు విభిన్న కోణాల్లో సాగుతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement