సాక్షి, చెన్నై: అన్నాదురై చిత్రానికి ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని హీరో విజయ్ ఆంటోని తెలిపారు. డయానా చంపికా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని నటి రాధిక శరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మించారు. దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ ఆంటోనీ చిత్రాలలో అత్యధిక థియేటర్లతో విడుదలైన చిత్రం ఇదే అవుతుందని గురువారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో పేర్కొంది.
ఈ చిత్రంపై హీరో విజయ్‌ఆంటోని మాట్లాడుతూ.. రాధిక నిర్మాతగా తాను నటుడిగా చిత్రం చేస్తామని ఊహించలేదన్నారు. ఇందులో తన పాత్రకు న్యాయం చేశానని.. తనకు రాని విషయాల గురించి ప్రయత్నించనని చెప్పారు. ఒక మంచి కథా చిత్రానికి పాటలు అవసరం లేదని అన్నారు. అదే విధంగా గతంలో మాదిరి ఇప్పుడు ఆడియోకు ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు. అందుకు ఈ చిత్ర పాటనలు తన వెబ్‌సైట్ ద్వారా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోనేలా అవకాశం కల్పించానని తెలిపారు.
అన్న పాత్ర పేరు అన్నాదురై, తమ్ముడి పాత్రపేరు తంబిదురై అని తెలిపారు. మొదట ఈ చిత్రానికి కులసామి అని పేరు అనుకున్నమని.. అయితే పిచ్చైక్కారన్ చిత్రంలో అరుళ్ పాత్ర మాదిరిగానే అన్నాదురై పాత్ర చాలా మంచిగా ఉండటంతో ఆ పేరును నిర్ణయించామని తెలిపారు. అయితే సెన్సార్ సభ్యులు ఈ పేరు గురించి అడిగారని, అందుకు తగిన వివరణ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ వారు ఈ టైటిల్‌కు అభ్యంతరం తెలపలేదని విజయ్ ఆంటోని తెలిపారు. ఇదే చిత్రం తెలుగులో ఇంద్రసేన పేరుతో విడుదలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment