
టాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే నోటా సినిమాతో తమిళనాట అడుగుపెట్టిన విజయ్ ఇప్పుడు మరిన్ని భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాను తెలుగులో పాటు తమిళ, మళయాల, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నెల 17న నాలుగు భాషలకు సంబంధించిన టీజర్‌లను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా మరోసారి రష్మిక మందన్న అలరించనుంది. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లోనూ నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.
Telugu
— Vijay Deverakonda (@TheDeverakonda) 7 March 2019
Tamil
Malayalam
Kannada Comrades -
are we ready?
The 17th of March. pic.twitter.com/dEllWg6ecp
Comments
Please login to add a commentAdd a comment