
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, కీరవాణి
‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి’ చిత్రాల ఫేమ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఛలో’ ఫేమ్ రష్మిక మండన్న ఈ చిత్రంలో కథానాయిక. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్. రంగినేని నిర్మాతలు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
తొలి సన్నివేశానికి డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. దర్శకులు సుకుమార్, కొరటాల శివ చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించారు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెరకెక్కించనున్నట్లు ఈ సందర్భంగా చిత్రబృందం పేర్కొంది. తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ çస్వరాలు అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: ప్రవీణ్ మర్పురి.