
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్కెట్ పరిదిని మరింత విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలను బహుభాషా చిత్రాలుగా ప్లాన్ చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన విజయ్, మరో సినిమాను కూడా మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment