కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్‌ | Vijay Devarakonda Open Up About His Marriage | Sakshi
Sakshi News home page

కాబోయే భార్య అలా ఉండాలి : విజయ్‌

Published Sun, May 3 2020 2:46 PM | Last Updated on Sun, May 3 2020 2:46 PM

Vijay Devarakonda Open Up About His Marriage - Sakshi

హీరో విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్‌ రెడ్డి సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌.. రౌడీగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు సేవ కార్యక్రమాల ద్వారా మంచి మనసును చాటుకుంటున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు  ‘ది దేవర ఫౌండేషన్’‌ పేరిట  తనకు వీలైనంత మేర సాయం అందించడానికి ముందుకొచ్చారు.

మరోవైపు విజయ్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లి గురించి ఎదురైన ఓ ప్రశ్నపై విజయ్‌ స్పందిస్తూ.. ఫ్యామిలీ లైఫ్‌ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఇంట్లో తనను ఇంకా చిన్న పిల్లాడిలానే చూస్తున్నారని.. ప్రస్తుతం తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందన్నారు. పెళ్లికి ఇంకా సమయం ఉందని.. తను మానసికంగా ఇంకా పరిణితి చెందాల్సిన ఉందని అభిప్రాయపడ్డారు. ఇంట్లో కూడా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోమాని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. 

ఇంకా తనకు కాబోయే బార్య ఎలా ఉండాలో కూడా విజయ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెన్సార్‌ హ్యూమర్‌తోపాటు, దయ గుణం కలిగిన అమ్మాయి అంటే తనకు ఇష్టమని చెప్పారు. తనతో ప్రయాణం బోర్‌ కలిగించకూడదని అన్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్‌.. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.  అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైటర్‌ అనే పేరును పరిశీలిస్తున్నారు.

చదవండి : కొత్త వినతులకు బ్రేక్‌ : విజయ్‌ ఫౌండేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement