సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ | Vijay Devarakonda Supports 'Save Nallamala' Campaign | Sakshi
Sakshi News home page

గాలి, నీళ్లు లేనప్పుడు కరెంటెందుకు : విజయ్‌ దేవరకొండ

Published Thu, Sep 12 2019 12:31 PM | Last Updated on Thu, Sep 12 2019 3:11 PM

Vijay Devarakonda Supports 'Save Nallamala' Campaign - Sakshi

యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అడవుల్లో చేపట్టనున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యామాలు జరుగుతున్నాయి. పర్యావరణ వేత్తలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పరిణామాలపై తమ గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు శేఖర్‌ కమ్ముల సేవ్‌ నల్లమల క్యాంపెయిన్‌కు తన మద్దతు తెలపగా తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్‌లో చేరాడు.

‘20000 వేల ఎకరాల నల్లమల అడువులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే చెరువులను నాశనం చేశాం, కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయి. నిత్యావసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా నాశనం చేస్తున్నాం. అదే వరుస దట్టమైన నల్లమల అడవులను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నాం. 

మీకు పునరుత్పాదక వనరు కానీ యురేనియం కావాలంటే కొనండి. యురేనియం కొనొచ్చు..? కానీ నల్లమల అడవులను కొనొచ్చా?ఒకవేల మన కొనలేకపోతే, సోలార్‌ ఎనర్జిలాంటి వాటిని ప్రోత్సహించండి. ప్రతీ మేడ మీద సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటును తప్పనిసరి చేయండి. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం, కరెంట్‌ ఏం చేసుకుంటాం’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్‌ దేవరకొండ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement