సూర్య చిత్రంలో విజయ్‌సేతుపతి | Vijay Sethupathi in Surya movie | Sakshi
Sakshi News home page

సూర్య చిత్రంలో విజయ్‌సేతుపతి

Published Wed, Jan 4 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

సూర్య చిత్రంలో విజయ్‌సేతుపతి

సూర్య చిత్రంలో విజయ్‌సేతుపతి

స్టార్‌ హీరో సూర్య తాను నటించే చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన భారీ అంచనాలను సంతరించుకున్న తాజా చిత్రం ఎస్‌–3 ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విఘ్నేష్‌ శివ దర్శకుత్వంలో తానా సేర్నద కూటం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆయన 2డీ ఎంటర్‌టెయిన్ మెంట్‌ సంస్థలో తయారవుతోంది. ఈ సంస్థలో ఇప్పటి వరకూ సూర్య, ఆయన అర్ధాంగి జ్యోతిక నటించిన చిత్రాలే రూపొందాయన్నది గమనార్హం. ఇప్పుడు తొలిసారిగా బయటి నటుడు హీరోగా ఒక చిత్రాన్ని నిర్మిం చడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఆ హీరో ఎవరో కాదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌సేతుపతినే అని తెలిసింది.

నటుడు సూర్య నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. నటుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ పతాకంపై ఇతర హీరోలతో చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సంస్థలో ఇప్పటికే నటుడు శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి వంటి యువ హీరోలు నటించి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు సూర్య కూడా ధనుష్‌ పంథాలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌సేతుపతి నటించిన పురియాద పుదీర్‌ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న తెరపైకి రానుంది. ఆయన టి.రాజేందర్‌తో కలిసి కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటిస్తున్న కవన్ చిత్రం మార్చిలో విడుదలకు రెడీ కానుందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement