![Vijay Sethupathy Sanga Tamizhan to release in Telugu - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/12/Vijaysethupathi.jpg.webp?itok=uoPuGLM4)
విజయ్ సేతుపతి’ ప్రీ–రిలీజ్ వేడుకలో చిత్రబృందం
‘‘విజయ్ సేతుపతిలో ఎనర్జీ లెవల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ‘విజయ్ సేతుపతి’ సినిమాతో తెలుగులో తనకు స్టార్‌డమ్ వస్తుందని నమ్ముతున్నాను’’ అని దర్శకుడు వి. సముద్ర అన్నారు. విజయ్ సేతుపతి, రాశీఖన్నా జంటగా విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సంగ తమిళ్’. విజయా ప్రొడక్షన్స్‌పై భారతీరెడ్డి నిర్మించిన ఈ సినిమాని హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి. శ్రీనివాస్ ‘విజయ్ సేతుపతి’గా తెలుగులో విడుదల చేస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఏయమ్ రత్నంగారు పవన్ కళ్యాణ్‌గారి కాంబినేషన్‌లో సినిమా అనే వార్తలు వస్తున్నప్పుడు పవన్‌గారి కోసం ఈ కథ రాశా. ఆయన రాజకీయాల్లో ఉండటంతో కుదరలేదు. విజయ్ సేతుపతి కథ వినగానే మెచ్చుకున్నారు’’ అన్నారు విజయ్ చందర్ .
Comments
Please login to add a commentAdd a comment