ఒట్టు తీసి గట్టు మీద పెట్టి..! | Vijay, Vikram, AR Rahman to Attend 'Kappal' | Sakshi
Sakshi News home page

ఒట్టు తీసి గట్టు మీద పెట్టి..!

Jun 22 2015 11:32 PM | Updated on Sep 3 2017 4:11 AM

ఒట్టు తీసి గట్టు మీద పెట్టి..!

ఒట్టు తీసి గట్టు మీద పెట్టి..!

పెళ్లి చేసుకుంటే తమ మధ్య ఉన్న స్నేహం చెడిపోతుందన్న ఉద్దేశంతో అయిదుగురు స్నేహితులు పెళ్లి జోలికి వెళ్లకూడదని ఒట్టు వేసుకుంటారు.

పెళ్లి చేసుకుంటే తమ మధ్య ఉన్న స్నేహం చెడిపోతుందన్న ఉద్దేశంతో అయిదుగురు స్నేహితులు పెళ్లి జోలికి వెళ్లకూడదని ఒట్టు వేసుకుంటారు. వాళ్లల్లో ఓ యువకుడు ఒట్టు తీసి గట్టు మీద పెడతాడు. ఆ తర్వాత ఏమవుతుందన్న కథాంశంతో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘కప్పల్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో వైభవ్, సోనమ్‌బజ్వా జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో దర్శకుడు మారుతి తెలుగులో విడుదల చేయనున్నారు.

నటరాజన్ శంకరన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హీరో నాని ఆవిష్కరించి, సీడిని సీని యర్ దర్శకుడు కోదండరామిరెడ్డికి అంద జేశారు. ‘అల్లరి’ నరేశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజేశ్ పులి, సహనిర్మాతలు కృష్ణ సతీశ్, నల్లిపూడి రాంజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement