ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు' | Vishal movie Release advanced to december | Sakshi
Sakshi News home page

ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు'

Published Thu, Dec 15 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు'

ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు'

కోలీవుడ్లో వరుస హిట్స్తో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో విశాల్. ప్రస్తుతం సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కొడచ్చాడు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న విశాల్.. ఆ సినిమాను అనుకున్న సమయం కన్నా ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేశాడు విశాల్. అయితే సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో సీనియర్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఆలోచనలో పడ్డాడు.

తాజాగా సింగం 3 వాయిదా పడుతుందన్న వార్తలతో ఊపిరి పీల్చుకున్న విశాల్, ఆ గ్యాప్లో తన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్ 23న రిలీజ్ అవుతుందనుకున్న సింగం 3 మరో వారం వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో డిసెంబర్ 23న తన సినిమా ఒక్కడొచ్చాడును రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. విశాల్ సరసన తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement