Okkadochadu
-
ఒక్కడొచ్చాడుగా వస్తున్న విశాల్
-
ముందే వస్తోన్న 'ఒక్కడొచ్చాడు'
కోలీవుడ్‌లో వరుస హిట్స్‌తో మంచి ఊపు మీదున్న యంగ్ హీరో విశాల్. ప్రస్తుతం సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కొడచ్చాడు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న విశాల్.. ఆ సినిమాను అనుకున్న సమయం కన్నా ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేశాడు విశాల్. అయితే సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో సీనియర్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఆలోచనలో పడ్డాడు. తాజాగా సింగం 3 వాయిదా పడుతుందన్న వార్తలతో ఊపిరి పీల్చుకున్న విశాల్, ఆ గ్యాప్‌లో తన సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్ 23న రిలీజ్ అవుతుందనుకున్న సింగం 3 మరో వారం వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో డిసెంబర్ 23న తన సినిమా ఒక్కడొచ్చాడును రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. విశాల్ సరసన తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడు. -
రిస్క్ చేస్తున్న తమిళ హీరో
తమిళనాట వరుస సినిమాలతో దూసుకుపోతున్న తెలుగబ్బాయి విశాల్. తెలుగులో కూడా మంచి మార్కెట్ సాధించుకున్న విశాల్, తన ప్రతీ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తుంటాడు. విశాల్ హీరోగా ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన సినిమా కత్తి సండై. కోలీవుడ్‌లో అక్టోబర్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమాను నవంబర్ 18న తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించినా.. తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లతో పాటు శతమానంభవతి సినిమాతో శర్వానంద్ కూడా బరిలో దిగుతున్నాడు. ఇంత పోటిలో విశాల్, ఓ డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అన్న టాక్ వినిపిస్తుంది. మరి విశాల్, ఆ రిస్క్ చేయడానికి రెడీ అవుతాడో..? లేక డిసెంబర్లో ఒక్కడొచ్చాడు సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తాడో .? చూడాలి. -
విశాల్ కూడా వాయిదా వేశాడు..?
కరెన్సీ కష్టాలు సినీ రంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా జనం చేతుల్లో సరిపడ్డా డబ్బులు లేకపోవటంతో థియేటర్ల వరకు వస్తారా అన్న అనుమానం వ్యక్తం చేసుకున్నారు సినీ జనాలు. దీంతో పరిస్థితులు చక్కబడే వరకు తమ సినిమాలు వాయిదా వేసుకోవటమే బెటర్ అని భావిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి ఒకటి రెండు సినిమాలు రిస్క్ చేసినా.. అందరు హీరోలు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. తాజాగా విశాల్ కూడా తన సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడట. తమిళ నాట వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న విశాల్, టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అదే జోరులో డిసెంబర్ 2న ఒక్కడొచ్చాడు సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయటం కన్నా వాయిదా వేయటమే బెటర్ అని భావిస్తున్న విశాల్, ఒకటి రెండు వారాల పాటు సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే విశాల్ ఒక్కడొచ్చాడు సినిమా రిలీజ్‌పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
ఒక్కడొచ్చాడు ఆడియో రిలీజ్