విశాల్ కూడా వాయిదా వేశాడు..?
కరెన్సీ కష్టాలు సినీ రంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా జనం చేతుల్లో సరిపడ్డా డబ్బులు లేకపోవటంతో థియేటర్ల వరకు వస్తారా అన్న అనుమానం వ్యక్తం చేసుకున్నారు సినీ జనాలు. దీంతో పరిస్థితులు చక్కబడే వరకు తమ సినిమాలు వాయిదా వేసుకోవటమే బెటర్ అని భావిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి ఒకటి రెండు సినిమాలు రిస్క్ చేసినా.. అందరు హీరోలు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు.
తాజాగా విశాల్ కూడా తన సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడట. తమిళ నాట వరుస హిట్స్తో దూసుకుపోతున్న విశాల్, టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అదే జోరులో డిసెంబర్ 2న ఒక్కడొచ్చాడు సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయటం కన్నా వాయిదా వేయటమే బెటర్ అని భావిస్తున్న విశాల్, ఒకటి రెండు వారాల పాటు సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే విశాల్ ఒక్కడొచ్చాడు సినిమా రిలీజ్పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.