అక్టోబర్‌ 18న ‘పందెంకోడి-2’ | Vishal Pandem Kodi 2 Will Release On 18th October | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 9 2018 9:04 PM | Last Updated on Mon, Jul 9 2018 9:05 PM

Vishal Pandem Kodi 2 Will Release On 18th October - Sakshi

విశాల్‌ పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవలె వరుస విజయాలతో దూకుడు మీదున్నారు విశాల్‌. గతేడాది వచ్చిన డిటెక్టివ్‌, గత నెల వచ్చిన అభిమన్యుడు వరుసగా విజయవంతమయ్యాయి. తాజాగా మరో సినిమాను విడుదలకు సిద్దం చేశారు ఈ హీరో.

దాదాపు పదమూడేళ్ల క్రితం వచ్చిన పందెంకోడి సినిమా విశాల్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించారు. ఈ సినిమాలో విశాల్‌కు జోడిగా కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. ఎన్‌ లింగుస్వామి డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్‌ 18న విడుదల కానున్నట్లు విశాల్‌ తెలిపారు. తెలుగులో ఘన విజయం సాధించిన టెంపర్‌ రీమేక్‌లో విశాల్‌ నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement