భారీ వసూళ్లు సాధిస్తోన్న ‘విశ్వరూపం 2’ | Vishwaroopam 2 Day 2 Box Office Collection | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 12 2018 11:46 AM | Last Updated on Sun, Aug 12 2018 11:46 AM

Vishwaroopam 2 Day 2 Box Office Collection - Sakshi

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ విశ్వరూపం 2. 2013లో రిలీజ్‌ అయిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్‌ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే డివైడ్‌ టాక్‌తో మొదలైన విశ్వరూపం 2 కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది.

తొలి రోజు అన్ని భాషల్లో కలిపి 9 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా ప్రముఖ ట్రేడ్‌ ఎనలిస్ట్‌ గిరీష్ జోహర్‌ వెల్లడించారు. చాలా రోజులు తరువాత కమల్‌ లీడ్‌ రోల్‌ లో సినిమా రిలీజ్‌ కావటంతో చెన్నై అభిమానులతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో టాక్‌తో సంబంధం లేకుండా విశ్వరూపం 2 వసూళ్లు సాధిస్తోంది. రెండు రోజుల్లో 19 కోట్లకు పైగా కలెక్షన్లు సాదించి కోలీవుడ్‌ లో తొలి రెండు రోజేల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డ్‌ సృష్టించింది ఈ సినిమా.

కమల్‌ రా ఏంజెంట్‌ గా నటించిన ఈ సినిమాలో పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, రాహుల్ బోస్‌లు ఇతర కీలక పాత్రలో నటించారు. కమల్‌ ఆస్థాన సంగీత దర్శకుడు గిబ్రాన్ సంగీతమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement