కత్రినా డ్యాన్స్ సీక్రెట్ ఏంటంటే.. | What Katrina Kaif drank before the Kala Chashma song | Sakshi
Sakshi News home page

కత్రినా డ్యాన్స్ సీక్రెట్ ఏంటంటే..

Published Mon, Aug 15 2016 3:27 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

కత్రినా డ్యాన్స్ సీక్రెట్ ఏంటంటే..

కత్రినా డ్యాన్స్ సీక్రెట్ ఏంటంటే..

'బార్ బార్ దేఖో' సినిమాలో కాలా చష్మా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసి కత్రినా కైఫ్ మరోసారి బాలీవుడ్ను తనవైపు తిప్పుకొంది. యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో కలసి పోటాపోటీగా చిందేసిన కత్రినా.. డ్యాన్స్ విషయంలో ఎవరైనా తన తర్వాతే అని నిరూపించింది. ఇప్పటికే ప్రత్యేక గీతాల్లో తనదైన ముద్ర వేసిన క్యాట్.. మరోసారి కాలా చష్మాతో ఫ్యాన్స్ను ఫిదా చేసింది.

అయితే ఆమె డ్యాన్స్ చేసే ముందు ప్రత్యేక డైట్ ఫాలో అవుతుందట. షూటింగ్కు మూడువారాల ముందు నుంచే ఆమె కార్బొహైడ్రేట్స్ ఉండే డైట్ను తీసుకోవడం మానేస్తుంది. కేవలం ద్రవరూపంలో ఉండేవాటినే తీస్కుంటూ ఉంటుందట. పళ్ల రసాలు, సూప్స్, బ్రకోలి వంటి వాటిని అల్పాహారంలోను, మధ్యాహ్న భోజనంలోను తీసుకుంటుంది. ఇక షూటింగ్కు ముందైతే మజ్జిగ మాత్రమే తాగుతుంది. ఆ మజ్జిగ  ఆమెకు చాలా ఎనర్జీని ఇస్తుందట.

మొత్తంగా ఏ మాస్ పాటకు డ్యాన్స్ చేయడానికైనా కత్రినా ఇదే డైట్ ఫాలో అవుతుందట. మెరుపుతీగలా కదులుతూ కుర్రకారును ఉర్రూతలూగించే కత్రినా డ్యాన్స్ వెనుక ఉన్న డైట్ సీక్రెట్ ఇదన్నమాట. 'బార్ బార్ దేఖో' సినిమా సెప్టెంబరు నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement