రణబీర్‌ని పెళ్లాడను కానీ... | Katrina Kaif will dance to at Ranbir Kapoor's wedding | Sakshi
Sakshi News home page

రణబీర్‌ని పెళ్లాడను కానీ...

Published Thu, Dec 12 2013 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

రణబీర్‌ని పెళ్లాడను కానీ...

రణబీర్‌ని పెళ్లాడను కానీ...

కథా నాయికలకు పెళ్లి అంటే వారి అభిమానులకు అది నిజంగా చేదు వార్తే అనాలి. అయితే.. కత్రినాకైఫ్ మాత్రం తన అభిమానులకు ఓ తీయనైన వార్త చెప్పారు. మరో ఇరవై ఏళ్ల దాకా పెళ్లి ప్రస్తావనే తేనని మీడియా సాక్షిగా ప్రతిన పూనారు. రణబీర్ కపూర్‌తో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వస్తున్న వార్తలకు మీడియా వివరణ అడగ్గా కత్రినా పై రీతిలో స్పందించారు.
 
 ఆమె ఇంకా చెబుతూ -‘‘రణబీర్‌తో నాకున్న బంధం స్నేహం మాత్రమే. నాలైఫ్‌లో మా అమ్మానాన్నల్ని తప్ప నేను ఎవర్నీ ప్రేమించలేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలపైనే’’ అని చెప్పారు కత్రినా. మరి రణబీర్‌తో పెళ్లి లేనట్టేనా? అని మీడియా రెట్టించి అడిగితే -‘‘రణబీర్‌ని పెళ్లాడను కానీ... అతని పెళ్లిలో మాత్రం మంచి డాన్స్ చేస్తాను. తను నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి, నా డాన్స్‌ని రణబీర్‌కి పెళ్లి కానుకగా ఇస్తాను’’ అని చెప్పారు కత్రినా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement