ఆరేళ్ళ క్రితమే పెళ్ళి డేట్ ఫిక్స్! | Ranbir Kapoor: My wedding date was fixed six years back | Sakshi
Sakshi News home page

ఆరేళ్ళ క్రితమే పెళ్ళి డేట్ ఫిక్స్!

Published Wed, Apr 29 2015 12:11 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఆరేళ్ళ క్రితమే పెళ్ళి డేట్ ఫిక్స్! - Sakshi

ఆరేళ్ళ క్రితమే పెళ్ళి డేట్ ఫిక్స్!

తారలు రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల మధ్య ప్రేమ బంధం గురించి ఊరందరికీ తెలుసు. అయితే, పెళ్ళి ఊసెత్తితే మాత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనేస్తుంటారు ఇద్దరూ! ఈ విషయం గురించి కత్రినాను గుచ్చి గుచ్చి అడిగినా ఆమె నోరు విప్పడం లేదు. ఇటీవల జరిగిన ఈ పరిణామాలతో విసుగెత్తారో ఏమో, పెళ్ళి వ్యవహారంపై ఊహాగానాలు మానుకొమ్మంటూ రణ్‌బీర్ మీడియాను అభ్యర్థించారు. ‘‘నేను ప్రేమలో ఉన్న మాట నిజమే. కానీ, ఇప్పుడిప్పుడే పెళ్ళి ఆలోచనలు మాత్రం లేవు’’ అని ఆయన అన్నారు. ‘‘సినీ రంగంలో పేరున్న యాక్టర్‌ను కాబట్టి ఎవరికీ చెప్పాపెట్టకుండా పెళ్ళి చేసుకోవడమైతే కుదరదు.
 
 అయినా, నా పెళ్ళి తేదీని ఇప్పుడు కాదు... ఆరేళ్ళ క్రితమే నిశ్చయించుకున్నా. ఆ తేదీ నేనే స్వయంగా ప్రకటిస్తా. ప్రస్తుతానికి మాత్రం పెళ్ళి ఆలోచన లేదు’’ అని రణ్‌బీర్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. పెళ్ళి గురించి ముందుగానే ఇన్ని ఊహాగానాలు చెలరేగితే, అసలు పెళ్ళిలో ఉన్న మజాయే పోతుంది. కాబట్టి, నా పెళ్ళి తేదీ గురించి ఊహాగానాలు చేయవద్దని నా అభ్యర్థన’’ అని రణ్‌బీర్ అన్నారు. గతవారం మాల్దీవుల్లో రణ్‌బీర్‌తో కలసి చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ సందడి చేసిన వీరి పెళ్ళి కబురు కోసం కొంత కాలం ఆగాల్సిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement