సల్మాన్ సోదరి పెళ్లికి కత్రినాదే హడావిడి | Salman Khan's sister Arpita Khan's pre-wedding ceremony: Katrina Kaif performs a special item number! | Sakshi
Sakshi News home page

సల్మాన్ సోదరి పెళ్లికి కత్రినాదే హడావిడి

Published Tue, Nov 18 2014 12:04 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

సల్మాన్ సోదరి పెళ్లికి కత్రినాదే హడావిడి - Sakshi

సల్మాన్ సోదరి పెళ్లికి కత్రినాదే హడావిడి

 సల్మాన్ ఖాన్ అండదండలతో పైకొచ్చిన తారల్లో కత్రినా కైఫ్ ఒకరని చెబితే అతిశయోక్తి కాదు. సినిమాల్లోకొచ్చిన కొత్తలో కత్రినాకి నటన రాదనీ, కేవలం గ్లామర్ డాల్ అని అనేవారు. ఈ కారణంగా అవకాశాలు కూడా పెద్దగా వచ్చేవి కాదు. ఆ సమయంలో ‘నేనున్నాను’ అంటూ సల్మాన్ ఖాన్ ఆమెకు భరోసా ఇవ్వడంతో పాటు, కొంతమంది దర్శక, నిర్మాతలకు కత్రినాను సిఫార్సు కూడా చేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారనీ, విడిపోయారనీ వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలుసు. ఏదేమైనా కత్రినాకు సల్మాన్ అంటే బోల్డంత అభిమానం. ఆ అభిమానాన్ని పలు సందర్భాల్లో చూపించారు.
 
 తాజాగా, సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ పెళ్లి వేడుకల్లో మరోసారి ఆ కుటుంబంపట్ల తనకున్న మమకారాన్ని డాన్స్ రూపంలో వ్యక్తపరిచారు కత్రినా. నేడు అర్పితా వివాహం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ముంబయ్‌లో జరిగిన సంగీత్ కార్యక్రమంలో ‘షీలా కీ జవానీ..’ పాటకు కత్రినా డాన్స్ చేసి, అర్పితను ఖుషీ చేశారు. అది మాత్రమే కాదు.. స్వయంగా తన మేకప్‌మేన్ డానియెల్ బౌర్‌ని అర్పితకు మేకప్ చేయమని సూచించారట కత్రినా. వాస్తవానికి అర్పిత పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేయాలనుకున్నారట.
 
  కానీ, మూడు నెలల ముందే జరుగుతుండటంతో అన్ని పనులూ హడావిడిగా చేసుకోవాల్సి వచ్చిందని, చివరికి మేకప్‌మేన్ విషయంలో డైలమాలో పడ్డారని సమాచారం. దాంతో సల్మానే స్వయంగా కత్రినాకి ఈ విషయం చెప్పి, డానియెల్‌ని ఫిక్స్ చేశారట. ఇవన్నీ పక్కనపెడితే.. సల్మాన్ బద్ధశత్రువుగా భావించబడుతున్న షారుక్ ఖాన్ సంగీత్, మెహందీ వేడుకలకు హాజరు కావడం ఓ పెద్ద విశేషం. అర్పితను సొంత సోదరిలా ఆత్మీయంగా షారుక్ ముద్దాడినప్పుడు, సల్మాన్ కూడా చెల్లెలిని ముద్దాడిన ఫొటో బయటికి రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సో.. అర్పిత పెళ్లి సాక్షిగా.. షారుక్, సల్మాన్‌ల మధ్య వైరానికి ఫుల్‌స్టాప్ పడినట్లేనన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement