జ్యోతిక చిత్రం విడుదల ఎప్పుడో? | when will the release of jyothika's film ? | Sakshi
Sakshi News home page

జ్యోతిక చిత్రం విడుదల ఎప్పుడో?

Published Tue, Jan 3 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

జ్యోతిక చిత్రం విడుదల ఎప్పుడో?

జ్యోతిక చిత్రం విడుదల ఎప్పుడో?

గతంలో టాప్‌ కథానాయకిగా వెలుగొందిన నటి జ్యోతిక. నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడిన తరువాత నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. ఈ బహుభాషా నటి దశాబ్ధం తరువాత మళ్లీ నటిగా రీఎంట్రీ అయ్యి 36 వయదినిలే చిత్రంతో వెండితెరపైకి వచ్చి విజయం సాధించారు. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా చిత్రాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తున్న జ్యోతిక కుట్రం కడిదల్‌ చిత్రం ఫేమ్‌ దర్శకుడు బ్రహ్మ చెప్పిన కథకు ఇంప్రెస్‌ అయ్యి ఆ కథలో నటించడానికి సిద్ధమయ్యారు. మగళీర్‌ మట్టుం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాజర్, లివింగ్‌స్టన్, భానుప్రియ, ఊర్వశి, శరణ్య తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. స్త్రీ ప్రాధాన్యతతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్య 2డీ ఎంటర్‌టెయిన్ మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా చిత్ర షూటింగ్‌ పూర్తి చేసుకున్న మగళీర్‌ మట్టుం చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. చిత్రాన్ని పిబ్రవరి నెలలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా సూర్య నటించిన భారీ చిత్రం ఎస్‌–3 ఈ నెల 26న తెరపైకి రావడానికి ముస్తాబవుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement