'సోషల్ నెట్ వర్క్' పై జుకర్ బర్గ్ అసంతృప్తి!
లాస్ ఏంజెలెస్: 'ది సోషల్ నెట్ వర్క్' అనే చిత్రంపై ఫేస్ బుక్ సహవ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ అంసంతృప్తిని వ్యక్తం చేశారు. జుకర్ బర్గ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని 'ది సోషల్ నెట్ వర్క్' చిత్రాన్ని నిర్మించారు. కథను వాళ్లకు అనుగుణంగా మార్చుకోవడం ఇబ్బందిగా ఉంది అని జుకర్ బర్గ్ అన్నారు. ఇటీవల నిర్వహించిన ఫేస్ బుక్ పై నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో డేవిడ్ ఫిచర్ రూపొందించిన చిత్రంపై జుకర్ బర్గ్ స్పందించారు.
సోషల్ మీడియా నెట్ వర్క్ 'ఫేస్ బుక్'ను ఎందుకు, ఎలా క్రియేట్ చేశాననే అంశంపై స్వంత అభిప్రాయాలను కథగా మలిచారని ఆయన అన్నారు. ఓ ప్రోడక్ట్ కోసం కోడ్ ను రాయడం, ఓ కంపెనీ నిర్మించడం గ్లామరస్ అంశం కిందకు రాదన్నారు. అమ్మాయిలను ఆకర్షించడానికే ఫేస్ బుక్ రూపొందించారా అనే ప్రశ్నకు సమాధానమివ్వడానికి తడబడ్డారు.