‘బొగ్గు గని’లో విజయ్‌, కేథరీన్‌ లవ్‌ సాంగ్‌ | World Famous Lover Movie Boggu Ganilo Song Out | Sakshi
Sakshi News home page

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ రెండో సాంగ్‌ వచ్చేసింది

Published Wed, Jan 29 2020 7:56 PM | Last Updated on Wed, Jan 29 2020 8:20 PM

World Famous Lover Movie Boggu Ganilo Song Out - Sakshi

సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్‌ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన పోస్టర్లుర, టీజర్‌, ‘మై లవ్‌’  లిరికల్‌ సాంగ్‌ ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. 

 ‘బొగ్గు గనిలో రంగు మణిరా.. చమక్కు మందిరా.. చిక్కినాదిరా.. దక్కినాదిరా.. నీకే, కన్నె మోహిని సితారా.. ఏ క్లాసు నక్కతోక తొక్కిందే నీ లక్కు.. నిదరింకా రాదే నీ కళ్లకు.. పక్కా మాసోడికి దొరికే బస్తీ బంపరు సరుకు.. ఇంకేంది యాద్గిరికే మొక్కు.. సై సై సై రాజా సై సై.. చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్’  అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. కేథరీన్‌తో విజయ్‌ వేసే స్టెప్పులు బాగున్నాయి. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. నిరంజ్ సురేష్ చక్కగా ఆలపించారు.  కేయస్‌ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement