Catherine Thresa
-
పుష్ప 2 నుంచి కొత్త అప్డేట్! లేడీ విలన్‌గా ఆ హీరోయిన్?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు ఇలా సినిమాలో ప్రతీ అంశం ట్రెండ్‌గా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే ఆ ఒక్క డైలాగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్ రూపంలో చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా రష్మిక మందన్నా గ్లామర్‌కు తోడు అల్లు అర్జున్ డ్యాన్స్, విలన్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కలెక్షన్స్‌తో షేక్ చేసింది. ఇక ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని చెప్పిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2కు మూవీ షూటింగ్‌ను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికీ ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కానీ దీనికి సంబంధించి రూమర్స్ మాత్రమే బాగానే బయటకు వస్తున్నారు. పార్ట్‌లో పలువురు స్టార్ నటీనటులు నటిస్తున్నారంటూ రోజుకో అప్డేట్ బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మారో అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మరో లేడీ విలన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మొదటి పార్ట్‌లో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో కేథరిన్‌ను తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర మొదట పాజిటివ్‌గా కనిపించి, ఆఖరిలో బన్నీకి షాక్ ఇచ్చేలా ఉంటుందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా ఇదివరకే కేథరిన్ బన్నీ సరసన సరైనోడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె మహిళా ఎమ్మెల్యే పాత్రలో అలరిచింది. చదవండి: బిజినెస్ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? ఇక్కడ నోరు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే చాలా జరిగిపోతాయి: ప్రియదర్శి -
కలెక్టర్‌గా నితిన్ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ
టైటిల్: మాచర్ల నియోజకవర్గం నటీనటులు: నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి దర్శకత్వం: ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల విడుదల తేది: ఆగస్టు 12, 2022 నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘'మాచర్ల నియోజకవర్గం'’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ: సిద్ధార్థ రెడ్డి (నితిన్) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ పొందుతాడు. అక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగవు. అందుకు కారణం రాజప్ప అని తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: ఎప్పుడు ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్, కలెక్టర్ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి. కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో తెరపై 'మాచర్ల నియోజకవర్గం'ను ఆవిష్కరించాడు. అక్కడక్కడ స్క్రీన్‌ప్లే కొద్దిగా స్లో కావడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక నితిన్‌ను కొత్తగా చూపించారు. కలెక్టర్‌గా నితిన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే? గుంటూరు కలెక్టర్ సిద్ధార్థ రెడ్డిగా నితిన్ కొత్తగా కనిపించాడు. స్టైలిష్ లుక్ నుంచి నటన, అభినయం వరకు ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతోపాటు ఫైటింగ్ సీన్లలో మెప్పించాడు. ఇక స్వాతి పాత్రలో హీరోయిన్ కృతీశెట్టి నటన అలరిస్తుంది. కేథరీన్ థ్రేసా తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్ర ఖని విలనిజం, వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. తదితర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలు తగినట్లుగా బీజీఎం ఆకట్టుకుంది. ఇక అంజలి మెరిసిన రారా రెడ్డి ప్రధానాకర్షణగా నిలిచింది. ఫైనల్‌గా రొటీన్ ఫార్ములాతో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ఉంది. -
'బింబిసార' మూవీ రివ్యూ
టైటిల్: బింబిసార నటీనటులు: కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు నిర్మాత : హరికృష్ణ. కె కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: వశిష్ఠ సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు విజువల్ ఎఫెక్ట్స్: అనిల్ పాడురి విడుదల తేది: ఆగస్టు 5, 2022 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. విశ్లేషణ: క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్‌ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు. త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాషా, వేషం అన్ని చక్కగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకటి, రెండు సీన్లలో త్రిగర్తల సామ్రాజ్యపు కోట ఆర్టిఫిషియల్‌గా కనిపించిన మిగతా సీన్లలో మాత్రం కళ్లకు విజువల్ ఫీస్ట్. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కొంచె రొటీన్‌గా అనిపించిన ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా స్టైలిష్‌గా అదిరిపోయాయి. బింబిసారుడిని ఎలివేట్ చేసే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్‌గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది. యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్‌కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్‌ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
Bimbisara Movie: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘సీతారామం’ ట్విటర్ రివ్యూ) ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బింబిసార’ కథేంటి? త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్ రామ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నార.అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #BimbisaraOnAug5th #BIMBISARA #BimbisaraReview 1-Excellent movie 👍 2-this movie will bring back telugu audience to teatres 3-1st half is bit slow, but 2nd half is rampage 🔥 4-Kalyan ram as bimbisara is super 5- overall rating is 🌟 🌟 🌟 1/2 ( 3.5/5) — VINOD KUMAR E 2691 Batch,PES University (@VinodPes) August 5, 2022 తెలుగు ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కి రప్పించే చిత్రమిదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని, సెకండాఫ్ అదిరిపోయిందని చెబుతున్నారు. బింబిసారగా కల్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. వన్ మ్యాన్ షోగా సినిమాను తన భుజానా వేసుకొని నడిపించాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్, విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. Showtime: Kalyan Ram in #Bimbisara. A Vasishta directorial and MM keeravani musical. — Day Dreamer!!! (@bunnywrites) August 5, 2022 Bimbisara first half..👌🔥🔥This is going to be Kalyan ram's career biggest movie..Time travel content..🪐New World..🙏What a story..#Bimbisara @tarak9999 @NANDAMURIKALYAN #BimbisaraReview — SAIKUMAR MANNURU (@im_saichowdary) August 4, 2022 #Bimbisara Movie theater response#BimbisaraOnAug5th Movie good reviews every where 👍👍👍👍 video link 👇👇👇 3/5 👍https://t.co/AaHUH2YDQm — Masthan-Tweets (@sm4582579) August 5, 2022 Good First Half 👌 Interval 🔥🔥@NANDAMURIKALYAN 👌👌 Bgm Excellent 🤙🤙#Bimbisara . https://t.co/TWJFMJKn7J pic.twitter.com/pt3uc0Vhdm — #DADA 🙏 #NTR 💗 (@Dada_NTR) August 5, 2022 మరోవైపు బింబిసార టీమ్‌కు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ తమన్, సాయి తేజ్, సత్యదేవ్ తదితరులు ట్వీట్స్ చేశారు. Wishing this whole team of #Bimbisara @NANDAMURIKALYAN anna #Hari gaaru @NTRArtsOfficial #Vasista and Team of #SitaRamam brother @hanurpudi @dulQuer @mrunal0801 @VyjayanthiFilms Dear @SwapnaDuttCh All the Very Best at the #BoxOffice TOMORROW 🏆🥁🥁🥁🥁🥁🥁 pic.twitter.com/xrD6IQTkMz — thaman S (@MusicThaman) August 4, 2022 \ #Bimbisara Looks Promising to bits. All the best @NANDAMURIKALYAN anna.@DirVassishta I know how much you have waited for this day. Wish your hardwork paysoff ra All the best to the entire team@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani garu @ChirantannBhatt @NTRArtsOfficial pic.twitter.com/UIepiaLrX5 — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2022 Promising right from it's Teaser and a Grandeur of this scale from @DirVassishta is so impressive. Your hardwork and transformation for this @NANDAMURIKALYAN anna 🤗👏 All the best Team #Bimbisara@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial pic.twitter.com/YOfhhUJUqt — Satya Dev (@ActorSatyaDev) August 4, 2022 Wishing @NANDAMURIKALYAN garu and the entire team of #Bimbisara the best for tomorrow. May cinema win and the industry rise! @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — Hanu Raghavapudi (@hanurpudi) August 4, 2022 -
'మాచర్ల నియోజకవర్గం'లో కేథరిన్
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా జాయిన్ అయ్యారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో కేథరిన్ పాల్గొంటున్నారు. కాగా ఈ చిత్రంలో మొదటి హీరోయిన్గా కృతీ శెట్టి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ‘‘ఫుల్ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న చిత్రమిది. ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: జి. హరి. -
‘బొగ్గు గని’లో విజయ్, కేథరీన్ లవ్ సాంగ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లుర, టీజర్, ‘మై లవ్’ లిరికల్ సాంగ్ ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. ‘బొగ్గు గనిలో రంగు మణిరా.. చమక్కు మందిరా.. చిక్కినాదిరా.. దక్కినాదిరా.. నీకే, కన్నె మోహిని సితారా.. ఏ క్లాసు నక్కతోక తొక్కిందే నీ లక్కు.. నిదరింకా రాదే నీ కళ్లకు.. పక్కా మాసోడికి దొరికే బస్తీ బంపరు సరుకు.. ఇంకేంది యాద్గిరికే మొక్కు.. సై సై సై రాజా సై సై.. చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్’ అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. కేథరీన్‌తో విజయ్ వేసే స్టెప్పులు బాగున్నాయి. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. నిరంజ్ సురేష్ చక్కగా ఆలపించారు. కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ వచ్చేశాడు
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’... ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ‘ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కాదు’ అన్న హీరోయిన్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్‌తో కనిపించాడు. మిడిల్ క్లాస్ భర్తగా, లవర్‌గా, బైక్ రైడర్‌గా, పైలట్‌గా, భగ్న ప్రేమికుడిగా విజయ్ను విభిన్నమైన వెరియేషన్స్‌లో చూపిస్తూ టీజర్ సాగింది. ఇందులో రాశీకన్నా, క్యాథరిన్, ఇజాబెల్లా లీటే, ఐశ్వర్యా రాజేశ్‌లతో లవ్, రొమాన్స్‌తోపాటు ఇంటెన్స్ ఎమోషన్స్ చూపించారు. ఇక, విజయ్ ఏ సినిమా తీసినా ‘అర్జున్‌రెడ్డి’తో పోలిక రావడం సహజమే. ఈ సినిమా టీజర్లో భగ్న ప్రేమికుడిగా విజయ్ ఇంటెన్స్ ఎమోషన్స్, యామిని అంటూ చివర్లో చెప్పిన డైలాగులు ‘అర్జున్‌రెడ్డి’ని తలపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి-2’నా అని కామెంట్ చేయడం కనిపిస్తోంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్లు సాధించి టాలీవుడ్లో సెన్సెషన్ అండ్ క్రేజీ స్టార్‌గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. అయితే డియర్ కామ్రెడ్‌తో అభిమానులను ఈ రౌడీ కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. -
బన్నీతో మరోసారి..!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో రూపొందిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా హిలేరియస్ ఎంటర్టైనర్ను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటించనుంది. అయితే మరో కీలక పాత్రలో కేథరిన్ థ్రెస్సా నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో బన్నీతో ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, రుద్రమదేవి సినిమాలో కలిసి నటించింది కేథరిన్. త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్, రాధకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తుండగా తమన్ సంగీతమందిస్తున్నాడు. -
సూపర్ ఫన్
అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ స్నేక్స్ అతని జీవితంలోకి వచ్చాయి. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్ లక్ష్మీ, కేథరిన్ ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న సినిమా ‘నీయా 2’. సురేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. 1979లో వచ్చిన కమల్‌హాసన్ ‘నీయా?’ చిత్రానికి ఇది సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. ‘నీయా 2’లో హీరో జై సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నారని కోలీవుడ్ సమాచారం. కొడైకెనాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా సెట్లోకి లేటెస్ట్గా జాయిన్ అయ్యారు వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం వరలక్ష్మి శరత్‌కుమార్, రాయ్ లక్ష్మీ, జై లపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ‘‘టామ్ బాయ్ వరలక్ష్మి శరత్‌కుమార్ సెట్లో జాయిన్ అయ్యారు (సరదాగా). సూపర్ ఫన్ను ఎంజాయ్ చేస్తున్నాం. ఆమె టాకింగ్ స్పీడ్‌ను జై, నేను అందుకోలేక పోతున్నాం. మాకు మరింత ఎంటర్టైన్మెంట్ కావాలి వరూ. అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్లకు’’ అని రాయ్‌లక్ష్మీ పేర్కొన్నారు. -
మేడమ్ స్మార్ట్!
మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు కోటి రూపాయలకు చెక్ ఇస్తేనే సినిమా చేయడానికి సంతకం పెడతారు. ఇక, ఒకటీ రెండు సినిమాలు చేస్తే స్టార్ లిస్ట్‌లో చేరిపోయే స్టేటస్‌లో ఉన్న ముద్దుగుమ్మల పారితోషికం 30 లక్షల నుంచి అర కోటి వరకూ ఉంటుంది. కానీ, ఒకే ఒక్క పాటకు కూడా కేథరిన్ త్రెసాలాంటి బ్యూటీలు అరకోటి పుచ్చుకుంటారు. ‘సరైనోడు’తో ఈ మేడమ్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ హిట్ పడింది. ఆ టైపు హిట్టొచ్చాక ఛాన్సులకు కొదవ ఉండదు. ఇలాంటి సమయంలో ఐటమ్ సాంగ్ చేయమని ఎవరైనా అడిగితే.. క్రేజ్‌ని క్యాష్ చేసుకోక పోతే అమాయకత్వం అవుతుంది. కేథరిన్ చాలా స్మార్ట్. అందుకే, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో ఐటమ్ సాంగ్‌కి అడగ్గానే... గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, పారితోషికం కూడా చక్కగా మాట్లాడుకున్నారు. ఈ పాట చేయడం కోసం ఆమె దాదాపు 50 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారట. అసలు ఐటమ్ సాంగ్స్ అంటే మేడమ్‌గారికి పెద్దగా ఇష్టం ఉండదట. కానీ, ‘సరైనోడు’లాంటి బ్లాక్‌బస్టర్ మూవీకి ఛాన్స్ ఇచ్చిన బోయపాటి అడిగితే కాదంటారా? స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు దర్శకుడిపట్ల రెస్పెక్ట్ ఓవైపు... ఒక్క పాట చేస్తే వచ్చే పారితోషికం మరోవైపు.. ఒక్క పాటకు రెండు లాభాలన్న మాట!