మేడమ్‌ స్మార్ట్‌! | Catherine Thresa item song | Sakshi
Sakshi News home page

మేడమ్‌ స్మార్ట్‌!

Published Thu, May 18 2017 11:59 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

మేడమ్‌ స్మార్ట్‌! - Sakshi

మేడమ్‌ స్మార్ట్‌!

మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు కోటి రూపాయలకు చెక్‌ ఇస్తేనే సినిమా చేయడానికి సంతకం పెడతారు. ఇక, ఒకటీ రెండు సినిమాలు చేస్తే స్టార్‌ లిస్ట్‌లో చేరిపోయే స్టేటస్‌లో ఉన్న ముద్దుగుమ్మల పారితోషికం 30 లక్షల నుంచి అర కోటి వరకూ ఉంటుంది. కానీ, ఒకే ఒక్క పాటకు కూడా కేథరిన్‌ త్రెసాలాంటి బ్యూటీలు అరకోటి పుచ్చుకుంటారు. ‘సరైనోడు’తో ఈ మేడమ్‌ ఖాతాలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పడింది. ఆ టైపు హిట్టొచ్చాక ఛాన్సులకు కొదవ ఉండదు. ఇలాంటి సమయంలో ఐటమ్‌ సాంగ్‌ చేయమని ఎవరైనా అడిగితే.. క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోక పోతే అమాయకత్వం అవుతుంది. కేథరిన్‌ చాలా స్మార్ట్‌.

అందుకే, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో ఐటమ్‌ సాంగ్‌కి అడగ్గానే... గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు, పారితోషికం కూడా చక్కగా మాట్లాడుకున్నారు. ఈ పాట చేయడం కోసం ఆమె దాదాపు 50 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారట. అసలు ఐటమ్‌ సాంగ్స్‌ అంటే మేడమ్‌గారికి పెద్దగా ఇష్టం ఉండదట. కానీ, ‘సరైనోడు’లాంటి బ్లాక్‌బస్టర్‌ మూవీకి ఛాన్స్‌ ఇచ్చిన బోయపాటి అడిగితే కాదంటారా? స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు దర్శకుడిపట్ల రెస్పెక్ట్‌ ఓవైపు... ఒక్క పాట చేస్తే వచ్చే పారితోషికం మరోవైపు.. ఒక్క పాటకు రెండు లాభాలన్న మాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement