Pushpa 2 Update: Is Catherine Tresa Plays Lady Villain Role In Allu Arjun Pushpa The Rule - Sakshi
Sakshi News home page

Pushpa 2 Update: పుష్ప 2 నుంచి కొత్త అప్‌డేట్‌! లేడీ విలన్‌గా ‘సరైనోడు’ హీరోయిన్‌?

Published Tue, Nov 22 2022 12:55 PM | Last Updated on Tue, Nov 22 2022 1:30 PM

Pushpa 2: Is Catherine Tresa Plays Lady Villain For Allu Arjun - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ మామూలుగా లేదు. పాన్‌ ఇండియా నుంచి పాన్ వరల్డ్‌ స్థాయిలో పుష్పరాజ్‌ వైరల్‌ అయ్యాడు. డైలాగ్స్‌, సాంగ్స్‌, స్టెప్పులు ఇలా సినిమాలో ప్రతీ అంశం ట్రెండ్‌గా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే ఆ ఒక్క డైలాగ్‌ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్‌ రూపంలో చేస్తూ కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు.

ఇంకా రష్మిక మందన్నా గ్లామర్‌కు తోడు అల్లు అర్జున్‌ డ్యాన్స్‌, విలన్ పాత్రలో ఫహాద్‌ ఫాజిల్‌ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కలెక్షన్స్‌తో షేక్ చేసింది. ఇక ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని చెప్పిన సుకుమార్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్‌ 2కు మూవీ షూటింగ్‌ను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికీ ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ దీనికి  సంబంధించి రూమర్స్‌ మాత్రమే బాగానే బయటకు వస్తున్నారు. పార్ట్‌లో పలువురు స్టార్‌ నటీనటులు నటిస్తున్నారంటూ రోజుకో అప్‌డేట్‌ బయటకు వస్తుంది.

ఈ నేపథ్యంలో తాజాగా మారో అప్‌డేట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మరో లేడీ విలన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మొదటి పార్ట్‌లో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో కేథరిన్‌ను తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర మొదట పాజిటివ్‌గా కనిపించి, ఆఖరిలో బన్నీకి షాక్‌ ఇచ్చేలా ఉంటుందని టాక్‌. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా ఇదివరకే కేథరిన్‌ బన్నీ సరసన సరైనోడు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె మహిళా ఎమ్మెల్యే పాత్రలో అలరిచింది. 

చదవండి: 
బిజినెస్‌ విమెన్‌తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?
ఇక్కడ నోరు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే చాలా జరిగిపోతాయి: ప్రియదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement