వర్మ నన్ను లైంగికంగా వేధించారు | Writer Jayakumar Accuses Varma of Sexual harrassment | Sakshi
Sakshi News home page

వర్మ నన్ను లైంగికంగా వేధించారు

Published Sat, Jan 27 2018 4:49 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Writer Jayakumar Accuses Varma of Sexual harrassment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనను లైంగికంగా వేధించారంటూ సినీ రైటర్‌ పీ జయ కుమార్‌ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు పలువురిని వర్మ లైంగికంగా వేధించారని అన్నారు. బాధితులు అందరూ త్వరలో బయటకు వస్తారని చెప్పారు.

గాడ్‌ సెక్స్ అండ్‌ ట్రూత్‌ షార్ట్‌ఫిలిం కథ తనదేనని అన్నారు. వర్మ వద్ద రైటర్‌గా పని చేసిన సమయంలో ఆయనకు జీఎస్టీ కథ వినిపించినట్లు చెప్పారు. ఇప్పుడు వర్మ తన కథను కాపీ కొట్టి జీఎస్టీని తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రచయితలంటే వర్మకు గౌరవం లేదని అన్నారు. జీఎస్టీ విషయంలో తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జయ కుమార్‌ ‘సర్కార్‌-3’ సినిమా స్క్రిప్టు విభాగంలో పని చేశారు.

జయ కుమార్‌ ఆరోపణలను రామ్‌ గోపాల్‌ వర్మ ఖండించారు. కాగా, జీఎస్టీ చిత్రాన్ని వర్మ ప్రత్యేక వెబ్‌సైట్‌లో శనివారం ఉదయం విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా ఈ చిత్రంపై వరుస వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement