
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ తొలిభాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగంలో రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’లో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా కీలక పాత్రలో నటించనున్నారట. ఎన్టీఆర్ వ్యక్తిగత మేకప్‌మేన్‌గా పనిచేసిన పీతాబరం పాత్రలో సాయి మాధవ్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్‌ను తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్యుడిగా మార్చిన కృష్ణుడి మేకప్‌ను వేసింది పీతాంబరమే. అందుకే ఆయన పాత్రుకు సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉందన్న టాక్‌వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment