sai madhav burra
-
సీరియళ్లు చేసుకుంటూ సంపాదించే వాడిని... కానీ ఇప్పుడు సినిమాలు
-
ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే రోజు ఇది
-
అభిప్రాయభేదాలు ఉంటే మంచిదే!
‘‘డైలాగ్ రైటర్‌గా నాకు ప్రతి కొత్త సినిమా ఓ సవాలే. హీరో ప్రాత్ర, సన్నివేశం, హీరో ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ డైలాగ్స్ రాయాలి. కేవలం స్టార్ ఇమేజ్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాయడం అనేది కరెక్ట్ కాదని నా భావన. నేను అలా రాయను’’ అన్నారు రచయిత సాయిమాధవ్ బుర్రా. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా చెప్పిన విశేషాలు. ► బాలకృష్ణగారితో నేను చేసిన నాలుగో సినిమా ‘వీరసింహారెడ్డి’. అలాగే ‘క్రాక్’ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో నేను చేసిన రెండో సినిమా కూడా ఇదే. ఈ సినిమా కథా చర్చల సమయం నుంచే నేను ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయ్యాను. ఈ సినిమాలో ఓ కొత్త ప్రాయింట్ ఉంది. ఒక పక్కా కమర్షియల్ సినిమాకు ఇలాంటి ఓ కొత్త పాయింట్ కలవడం అనేది చాలా అరుదు. ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, బాలకృష్ణగారి నుంచి కోరుకునే అన్ని అంశాలతో ‘వీరసింహారెడ్డి’ రూపొందింది. ► కథా చర్చల్లో భాగంగా అభిప్రాభేదాలు ఉండొచ్చు. అవి ఉన్నప్పుడే పని కరెక్ట్‌గా జరుగుతున్నట్లు అర్థం. అన్నీ కూడా సినిమా అవుట్‌పుట్ బాగా రావడం కోసమే. ఒకసారి కథను ఓకే చేశాక బాలకృష్ణగారు అందులో ఇన్వాల్వ్ అవ్వరు. సందర్భానుసారంగా కొన్ని డైలాగ్స్ ఇంప్రొవైజేషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ సినిమా జర్నీలో భాగం. కన్విన్స్ చేయడం, కన్విన్స్ అవ్వడం.. ఈ రెండు లక్షణాలు ఉన్న గొప్ప దర్శకుడు గోపీచంద్ మలినేనిగారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి నిర్మాతల వల్ల ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ► కొంతమంది రచయితలు ఇండస్ట్రీకి దర్శకులు కావాలని వచ్చి, రైటర్స్‌గా మొదలై, ఫైనల్‌గా దర్శకుడిగా గమ్యస్థానాన్ని చేరుకుంటారు. నేను రచయితను కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. రైటర్‌గా రాణిస్తున్నాను. ప్రస్తుతానికైతే డైరెక్షన్ ఆలోచన లేదు. ► 2017 సంక్రాంతికి చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణగారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకూ నేను పని చేశాను. రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు మళ్లీ చిరంజీవిగారి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణగారి ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’కు నేను చేయక΄ోయినా అదీ నా సినిమాగానే భావిస్తాను. ఎందుకంటే చిరంజీవిగారికి నేనంటే అభిమానం. దర్శకుడు బాబీ నా మిత్రుడు. ఈ రెండు చిత్రాలూ సక్సెస్ అవ్వాలి. ► ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, హీరో రామ్‌చరణ్–దర్శకుడు శంకర్ కాంబినేషన్ సినిమా, అర్జున్ దర్శకత్వంలోని సినిమా, నిర్మాత కేఎస్ రామారావు సినిమాలు చేస్తున్నాను. -
దర్శకుడు శంకర్‌తో ఒక్క ఫొటో దిగాలనుకున్నా
సాక్షి, గుంటూరు(తెనాలి): సాయిమాధవ్ బుర్రా.. తెలుగు సినిమాకు స్టార్ రైటర్. లెజండరీ దర్శకుల చిత్రాలెన్నింటికో తన మాటలతో వన్నెలద్దెన రచయిత. ఆయన రాసిన మాటలు బాక్సాఫీసు వద్ద తూటాల్లా పేలడమే కాదు.. ప్రజల నోళ్లల్లో నిత్యం నానుతున్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విజయానందంలో ఉన్న సాయిమాధవ్ సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ సినిమాతోపాటు నటుడు, దర్శకుడు అర్జున్ తొలిసారిగా తెలుగులో తీస్తున్న సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు. సాయిమాధవ్ స్వస్థలం తెనాలి అన్న విషయం తెలిసిందే. ఏటా ఆయన ఇక్కడ జాతీయస్థాయి సాంఘిక, పద్యనాటక పోటీలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవాలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ►‘జెంటిల్మెన్’ చూశాక దర్శకుడు శంకర్‌ను ఒక్కసారైనా కలిసి ఫొటో దిగితే చాలనుకున్నాను. తెలుగులో తొలిసారిగా ఆయన తీస్తున్న సినిమాకు సంభాషణలు రాస్తానని ఊహించలేదు. జరుగుతోంది. సింపుల్‌గా ఉండే గొప్ప మనిషి శంకర్. అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెలుగులో తీస్తున్న మొదటి సినిమాకు అవకాశం రావటం సంతోషం. ►ప్రసిద్ధ దర్శకులతో విభిన్నమైన సినిమాలకు పనిచేస్తున్నందుకు గర్వపడటం లేదు. వారి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవచ్చని సంతోషిస్తున్నా. క్రిష్, రాజమౌళి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడు శంకర్ దగ్గర మరికొన్ని నేర్చుకున్నా. అర్జున్ సినిమా స్క్రిప్టు అద్భుతం. చదవండి: (విజయ్ దేవరకొండ ఫ్యాన్ గర్ల్.. వీపుపై టాటూ.. వీడియో వైరల్) ►ఏ సినిమాకైనా బడ్జెట్‌ను కథ నిర్ణయిస్తుంది. సంసారం సాగరం సినిమాకు భారీ బడ్జెట్ అవసరముండదు. రాజమౌళి, శంకర్ కథలకు బడ్జెట్ ఎక్కువ. నా వరకు కథ, ప్రొడక్షన్ హౌస్, రెమ్యూనరేషను ముఖ్యం. ఇటీవల ఆకాశవాణి, గమనం సినిమాలకు రాశాను. కథలు నచ్చాయి. చేశాను. కమ ర్షియల్‌గా ఆలోచిస్తే అలాంటి సినిమాలు తీయరు. అలాంటి ప్రొడక్షన్స్‌లో పనిచేయటం నాకు అవసరం. స్వార్థమే. చిన్న సినిమా చేస్తే త్యాగాలు చేసినట్టేమీ కాదు. నేను రాసే కథలూ త్వరలో వెండితెరపై రాబోతున్నాయి. ►చిన్ననాటి నుంచి నాటకరంగంతో అనుబంధముంది. తల్లిదండ్రులు నాటక కళాకారులే. హైస్కూలు రోజుల్లోనే ముఖానికి రంగేసుకున్నా. బుల్లితెరకు రచనలు చేయడం సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. నాటకానికి చేతనైనంత చేయాలనే కళల కాణాచి పేరుతో జాతీయస్థాయి నాటకోత్సవాలను జరుపుతున్నాం. భారీ పారితోషికాలతో వీణా అవార్డులు ఇస్తున్నాం. ►నేను ఎన్టీఆర్ ఆరాధకుణ్ణి. అందుకే తెనాలిలో ఆయన శతజయంతి మహోత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తున్నా. వారంలో ఐదురోజులు ఎన్టీఆర్ సినిమాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. వారాంతాల్లో సదస్సులు, ఎన్టీఆర్ పేరుతో రంగస్థల, సినిమా అవార్డులను బహూకరిస్తున్నాం. ఎన్టీఆర్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. నేను స్వతహాగా కమ్యూనిస్టును. -
'పాత్రల్లో పరకాయప్రవేశం నా స్టైల్'
సాక్షి, తెనాలి(గుంటూరు) : సాయిమాధవ్ బుర్రా.. తెలుగు సినిమాకు ఆయనో స్టార్ రైటర్. ప్రతిష్టాత్మక చిత్రాలకు అవకాశాలు ఆయన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి. బాక్సాఫీసు హిట్లవ్వటమే కాదు.. అందులోని సంభాషణలు ప్రజల నోళ్లలో వర్ధిల్లుతున్నాయి. సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజమౌళి ఆర్ఆర్ఆర్తో సహా పలు సినిమాలతో బిజీ గా ఉన్న సాయిమాధవ్, స్వస్థలమై న తెనాలికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు.తెలుగు సినిమా రంగం ఇప్పుడు చాలా బాగుంది. ఇటీవల రిలీజైన్ చిన్న సినిమాలు ‘బ్రోచేవారెవరురా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ పెద్ద హిట్లు. రెగ్యులర్ సినిమాలను జనం చూడటం లేదు. ఏదొక కాన్సెప్ట్ ఉండాలి. మేకర్స్ కంటే ఆడియన్స్ హైలెవెల్లో ఉంటున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు తీస్తున్న వైవిధ్యమైన సినిమాలకు సంభాషణలు రాసే అవకాశాలు వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఎక్కువగానే కష్టపడుతున్నాను. ఏ సినిమాకు సంభాషణలు రాసేటప్పుడు, అందులోని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాను. నా అభిప్రాయాలు ఆ పాత్రపై రుద్దను. సంభాషణలు రాసేందుకు కలం పట్టుకున్నప్పుడు నేనెప్పుడూ ఆ పాత్రలానే ఆలోచిస్తుంటాను. అందుకే అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో ‘సైరా ఉయ్యాలవాడ’.. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పూర్తయింది. తెనాలి వచ్చేముందే పూర్తి సినిమా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఉయ్యాలవాడ చరిత్రను తెరకెక్కించటమే పెద్ద సాహసం. అద్భుతమైన కథ. తెలుగు సినిమా స్థాయిని హైట్స్‌కు తీసుకెళ్తుందని నమ్ముతున్నా. హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. చిరంజీవి నటవిశ్వరూపం ఇందులో చూడొచ్చు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ.. చరిత్ర అనగానే విమర్శలుంటాయి. క్రిష్, నేను కలసి గౌతమీపుత్ర శాతకర్ణి చేద్దామనుకున్నప్పుడు ఆయనకు చరిత్ర రెండు లైన్లకన్నా లేదన్నారు. దర్శకుడు క్రిష్ పరిశోధించి, తీసిన చిత్రం ఎంత హిట్టయిందో తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విషయంలోనూ అంతే. ఆయన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు అనేందుకు మనదగ్గర బోలెడన్ని ఆధారాలున్నాయి. దర్శకుడు సురేంద్రరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, భూపతిరాజా, సత్యానంద్ అందరూ ఉయ్యాలవాడ స్వస్థలానికి వెళ్లి, కష్టపడి కలసి కథ సిద్ధంచేశారు. నేను సంభాషణలు సమకూర్చా. వాస్తవ పాత్రలతో అల్లిన కల్పిత కథ ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాదీ చారిత్రక నేపథ్యమే. వాస్తవ పాత్రలతో అల్లిన కల్పితగాథ అనుకోవచ్చు. వాస్తవానికి బాహుబలికి నేనే రాయాల్సింది. మిస్సయింది. ఆర్ఆర్ఆర్ అవకాశం ఇచ్చారు. రాజమౌళి కథ విన్నప్పుడే షాకయ్యాను.. ఇలా కూడా ఆలోచించవచ్చా అని..! సైరా గానీ, ఆర్ఆర్ఆర్ గానీ తెలుగు సినిమాకు నెక్టŠస్ లెవెల్‌కు తీసుకెళ్తాయి. రాజుగారి గది–3 నేను రాస్తున్న మరో సినిమా. రాజమౌళి సహాయకుడు అశ్విని దర్శకత్వంలో ‘ఆకాశవాణి’ అనే సినిమాకు చేశాను. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ స్క్రిప్టు సిద్ధమైంది. ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ అనౌన్స్ చేస్తారు. రేణుదేశాయ్‌ను ఒక క్యారెక్టర్‌కు అనుకున్నారు. త్వరలో తెలుస్తుంది. విభిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలకు రాయటం అదృష్టంగా భావిస్తున్నా. -
ఇష్టంతో చేశా.. కష్టమనిపించలేదు
దివంగత నటుడు, రాజకీయ నాయకుడు యన్.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. రెండు భాగాలుగా రూపొందిన ఈ బయోపిక్కు క్రిష్ దర్శకుడు. మొదటి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న రిలీజ్ కానున్న సందర్భంగా చిత్రమాటల రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పిన విశేషాలు. ► నా చిన్నప్పటినుంచీ యన్.టి. రామారావుగారికి వీరాభిమానిని. ఆయన బయోపిక్కు మాటలందిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి రామారావుగారి సినిమాలు చూస్తూ పెరగడమే పెద్ద రీసెర్చ్. ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా రాయడానికి ప్రయత్నించాను. ► బాలకృష్ణగారు రచయితలను బాగా గౌరవిస్తారు. యన్టీఆర్గా కొన్ని సన్నివేశాల్లో ఆయన నటిస్తుంటే ఎమోషనల్ అయ్యాను. రామారావుగారి గురించి అన్ని సంఘటనలనూ రెండు పార్ట్స్‌లో చూపించడం కష్టం. ఆయన జీవితాన్ని చెప్పాలంటే 10–15 సినిమాల్లో చెప్పాలి. అందుకే సినిమాకు ఏది అవసరమో, సమాజానికి ఏది అవసరమో అది మాత్రమే ఉంటుంది. ► కాంట్రవర్శీ అనేది ఇంట్రెస్ట్. కానీ సమాజానికి అవసరమేం కాదు. సినిమా చూశాక ప్రేక్షకుడికి అసంపూర్ణంగా, అసంతృప్తిగా మాత్రం అనిపించదు. ► తేజాగారు దర్శకుడిగా ఉన్నప్పుడు కూడా నేనే డైలాగ్ రైటర్‌ను. క్రిష్‌గారు వచ్చాక స్క్రీన్‌ప్లే స్టైల్ మారిపోయింది. ఈ సినిమాకు సంభాషణలు రాయడం సంతృప్తిని ఇచ్చింది. డైలాగ్స్ కోసం కష్టపడలేదు. ఇష్టంగా చేసిందేదీ కష్టం కాదు. ► ప్రస్తుతం చిరంజీవిగారి ‘సైరా’, రాజమౌళిగారి ‘ఆర్ఆర్ఆర్’కు రాస్తున్నాను. -
మేకప్‌మేన్‌గా స్టార్ రైటర్..!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ తొలిభాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగంలో రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’లో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా కీలక పాత్రలో నటించనున్నారట. ఎన్టీఆర్ వ్యక్తిగత మేకప్‌మేన్‌గా పనిచేసిన పీతాబరం పాత్రలో సాయి మాధవ్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్యుడిగా మార్చిన కృష్ణుడి మేకప్‌ను వేసింది పీతాంబరమే. అందుకే ఆయన పాత్రుకు సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉందన్న టాక్వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్.. తెరపైకి ఇంకో పేరు
సాక్షి, హైదరాబాద్: దర్శకుడు తేజ నిష్క్రమణతో ఎన్టీఆర్ బయోపిక్‌పై సందిగ్ధం నెలకొంది. ఈ చిత్రాన్ని సమర్థవంతంగా తెరకెక్కించగలిగే దర్శకుడి కోసం బాలకృష్ణ మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించగా.. రేసులో తాను లేనని ఆయన స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాత కృష్ణ వంశీ, క్రిష్ ఇలా మరికొందరి పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆయనే మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా. గోపాల గోపాల, కంచె, ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలకు సంభాషణలు రాసిన సాయి మాధవ్.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం మెగా ఫోన్ పట్టనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు బాలయ్యే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందన్నది మరో కథనం. రెగ్యులర్ షూటింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఛాలెంజింగ్ రోల్లో శ్రియ
టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతోనూ నటించిమెప్పించిన సీనియర్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 17 ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రకు ఓకె చెప్పింది ఈ బ్యూటీ. కొత్త దర్శకురాలు సుజన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతమందిస్తున్న ఈసినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
చిరంజీవి ఫోన్‌తో వణుకు
తెనాలి: ఆ సంభాషణలు ప్రాస కోసం పాకులాడవు. పంచ్‌ల పదబంధాల్లోకి వెళ్లవు. సులువుగా అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. సన్నివేశం, సందర్భానికి తగినట్టుగా ప్రేక్షకుల్ని తీసుకెళ్తాయి. యుద్ధ సన్నివేశమైతే తూటాల్లా పేలతాయి. శత్రువుతో మాటల యుద్ధంలో భాస్వరంలా మండి అగ్గిని రగిలిస్తాయి. ప్రేమావిష్కరణలో గిలిగింతలు పెడతాయి. అమ్మ గురించి చెబితే మనసు పొరల్లోంచి ఆర్ద్రత పొంగుకొస్తుంది. జీవన తాత్వికత కొట్టొచ్చినట్టు గోచరిస్తుంది. సూటిగా, అలవోకగా, మనకు తెలిసిన పదాలతోనే మంత్రముగ్ధులను చేస్తున్న సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా. తెలుగు సినీ పరిశ్రమల్లో మాటలతో మెస్మరైజ్ చేసే రచయితలు చాలామంది ఉన్నా, వర్ధమాన సినీరచయితల్లో స్టార్ రైటర్ ఆయన. సంక్రాంతికి విడుదలైన ఖైదీ నెం.150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు ఆయన సంభాషణలే ప్రాణంపోశాయి. తెనాలిలో పుట్టిపెరిగిన సాయిమాధవ్ ’సాక్షి’తో ఆ అనుభూతులను ఫోన్లో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... వణుకొచ్చింది... శాతకర్ణికి క్లైమాక్స్ సీను రాసిన రెండోరోజే చిరంజీవి నుంచి ఫోన్. ఖైదీ నెంబరు 150కి రాయాలన్నారు. క్లైమాక్స్ సీన్లు రాసినా, చిత్రీకరణ పూర్తయేంత వరకూ అక్కడి జాగ్రఫీ ప్రకారం మార్పులు చేర్పులు చేస్తూనే ఉండాలి. అలాంటి సమయంలో చిరంజీవి గారే పిలిచి సినిమా చేయాలనడంతో వణుకొచ్చింది. ‘వినాయక్ కథ చెప్తారు.. ఎన్ని సీన్లు రాయాలంటే అన్ని రాయండి’ అన్నారు చిరంజీవి. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన సినిమాల్లో ఒక డైలాగ్ రాసినా సంతోషమే కదా? ఓకే అనేశాను. ఒకటి చారిత్రాత్మకం, మరొకటి సామాజికాంశంతో ముడిపడిన ఎంటర్టైన్మెంట్ చిత్రం. రెండు సమాంతరంగా చిత్రీకరించారు. ఆ విజయానందం అనన్యం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా. ఈ రెంటికీ నేను రాయడం, అవి అద్భుతమైన విజయాలు సాధించడం ఆనందకరం. సహజంగా ఒకటే ఇండస్ట్రీ హిట్ ఉంటుంది. ఇలా జరిగిందంటే బాబా దయ. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. గాల్లో తేలిపోతున్నట్టుంది. క్రెడిట్ క్రిష్‌దే.. కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా చేసేటప్పుడే తర్వాత శాతకర్ణి చేద్దామని దర్శకుడు క్రిష్ చెప్పారు. శాతకర్ణి గురించి అందరికీ తెలిసిన మేరకే నాకూ తెలుసు. గొప్ప కథ/చరిత్ర ఉన్నా ఎందుకు వెలుగులోకి రాలేదో తెలీదు. హిందూ శకంలో శాలివాహన శకం అంటాం. ఒక కాలానికి కొలమానంగా చెబుతున్నామంటే గొప్ప చరిత్రే కదా! అందుకే క్రిష్ ఆ చరిత్రను అధ్యయనం చేశారు. తన పరిశోధనను ఏమాత్రం ఆపకుండా లండన్ కూడా వెళ్లొచ్చారు. సంతృప్తిగా వచ్చిందనుకోగానే స్క్రీన్ టు స్క్రీన్ నరేషన్ ఇచ్చారు. బాలయ్య లేచి నమస్కరించారు ఖైదీ నెం.150 విడుదల కాగానే చిరంజీవి ఫోన్‌చేసి, ‘మీ వర్క్ చాలా ప్లస్సయింది’ అని చెప్పారు. తర్వాత కలిసినపుడు హగ్ చేసుకుని ‘సినిమాలో మీ సిగ్నేచర్ కనిపిస్తోంది..’ అన్నపుడు ఆనందమేసింది. శాతకర్ణి తర్వాత బాలయ్యబాబు ఎక్కడికెళ్లినా ఆ సినిమా డైలాగులే చెబుతున్నారు. ఒక ఫంక్షన్లో వక్తలు మాట్లాడేటప్పుడు నా ప్రస్తావన రాగానే బాలయ్యబాబు లేచి నిలబడి నమస్కారం చేశారు. నాకు భయమేసింది. వెంటనే నేనూ లేచి నమస్కారం పెట్టాను. తర్వాత కూడా మనం పనిచేద్దాం అన్నారాయన. ఆత్మసంతృప్తే ముఖ్యం స్టార్ రైటర్, మాటల మాంత్రికుడు.. అని నేను అనుకోవట్లేదు. ఎవరైనా అనుకుంటే ఆనందపడతాను. అలాగని పెద్ద సినిమాలకే రాస్తాననే పరిమితులు విధించుకోను. మంచి కథ, ప్రొడక్షన్లో రాసేందుకు అవకాశం ఉందనుకుంటే చిన్న సినిమా అయినా చేస్తాను. రచయితగా ఆత్మసంతృప్తి ముఖ్యం నాకు. నాటి నుంచి నేటి వరకూ.. మాది కళల నిలయం తెనాలి. అమ్మానాన్న ఇద్దరూ రంగస్థల నటులే. చిన్నప్పుడు అమ్మ నన్నూ నాటకాలకు తీసుకెళ్లేది. ఆరేళ్ల వయసులో ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో లోహితాస్యుడు పాత్రకు ఎవరూ లేక నాకు మేకప్ వేశారు. ధూళిపాళ్ల, డీవీ సుబ్బారావు నటించారా నాటకంలో. ఆరో తరగతిలో స్కూల్లో దుర్యోధనుడి ఏకపాత్ర చేశా. చదువుతూనే నాటకాలు చూడటం, వేయడం చేశాను. ‘బ్రోచేవారెవరురా’ నేను రాసిన తొలి నాటకం. ప్రజానాట్యమండలి, అభ్యుదయ కళాసమితి, అభ్యుదయ రచయితల సంఘం నేనూ, నా స్నేహితుడు చెరుకుమల్లి సింగారావు పనిచేశాం. బాధలు, సంతోషాలు కలిసి పంచుకున్నాం. తెనాలిలో లేకపోతే గుంటూరు దాకా వెళ్లి సినిమాలు చూశాం. బొల్లిముంత శివరామకృష్ణ గురువు. సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేసిన నూతలపాటి సత్యనారాయణ స్క్రిప్టు రాయడం నేర్పారు. సినిమాల్లోకని వచ్చి హైదరా‘బాధలు’ ఎన్నో అనుభవించా. అమ్మను కష్టపెట్టకుండా తొందరగా సినిమా అవకాశాలు రావాలని ప్రయత్నాలు చేశాను. నా తొలి టెలిఫిల్మ్ ‘అభినందన’. సీరియల్ ‘పుత్తడిబొమ్మ’. అప్పుడే దర్శకుడు క్రిష్‌తో పరిచయం ఏర్పడింది. భవిష్యత్ ప్రణాళికలు ప్రస్తుతం మహానటి సావిత్రి జీవిత చరిత్రను దర్శకుడు నాగ్అశ్విన్ తీస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ను తీసుకున్నారు. జెమినీగణేశన్ పాత్రధారి కోసం అన్వేషిస్తున్నారు. దీంతోపాటు హీరో కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రానికి రాశాను. ఒకటి రెండు రోజుల్లో భారీ సినిమా ఒకటి ఫైనలేజ్ కానుంది. దర్శకుడు క్రిష్‌తో మరో సినిమాకు పనిచేయనున్నా. సాయిమాధవ్ సంభాషణల్లో కొన్ని.. ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికీ గదికీ మధ్య గోడలుంటాయి. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ, ఎవడో వచ్చి నా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లోనే మీకో శ్మశానం నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండా ఎగరేస్తాం. దొరికినవాళ్లని తురుముదాం.. దొరకనివాళ్లని తరుముదాం.. పట్నాలు పల్లెటూళ్లకు పిల్లలు ఓటమిని పరుగెత్తించు.. అది నిన్ను విజయం దాకా తీసుకెళ్తుంది. మనమే కాదు బాబూ, మనముండే సోటు బతకాలా.. తోటోడూ బతకాలా.. నాయకుడంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు, గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు గర్భగుడిలో వీధికుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు మైలపడడు -
బుర్రా సాయిమాధవ్‌తో సరదాగా కాసేపు
-
కత్తిలాంటోడి మాటలకి మరింత పదును
మెగా అభిమానులను ఊరిస్తున్న చిరంజీవి 150వ సినిమాకు అదనపు ఆకర్షణలను జోడిస్తున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెర వెనుక పనిచేసే వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. వినాయక్ సినిమా అంటే సాధారణంగా ఆకుల శివ రచయితగా వ్యవహరిస్తాడు. కామెడీతో పాటు హీరోయిజాన్ని చూపించే మాస్ సన్నివేశాలకు మాటలు రాయటంలో ఆకుల శివ స్పెషలిస్ట్. కానీ ఇది చిరంజీవి 150వ సినిమా కాబట్టి అభిమానులు చిరంజీవి పోలిటికల్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సందేశాత్మకమైన మాటలను కూడా ఆశిస్తారు. అందుకే ఆలోటు తీర్చేందుకు మరో రైటర్‌ను రంగంలోకి దించారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు మాటల రచయిత సుపరిచితుడైన సాయి మాధవ్ బుర్రా.. గోపాల గోపాల సినిమాతో మెగా కాంపౌడ్‌లోకి అడుగుపెట్టారు. ఆయన మాటల్లో సామాజిక అంశాలతో పాటు, సందేశాలు కూడా వినిపిస్తుండటంతో చిరు పిలిచి మరి అవకాశం ఇచ్చారట. అలా సాయి మాధవ్ రాసిన మాటలు, చిరంజీవి 150 సినిమాలోని కీలక సన్నివేశాల్లో వినిపించనున్నాయన్న టాక్ వినిపిస్తోంది.