
టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతోనూ నటించిమెప్పించిన సీనియర్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 17 ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రకు ఓకె చెప్పింది ఈ బ్యూటీ.
కొత్త దర్శకురాలు సుజన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతమందిస్తున్న ఈసినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment