స్ఫూర్తిని రగిలించే ‘యుగ్మలి’ | yugmali is inspirational movie | Sakshi
Sakshi News home page

స్ఫూర్తిని రగిలించే ‘యుగ్మలి’

Published Tue, Mar 4 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

స్ఫూర్తిని రగిలించే ‘యుగ్మలి’

స్ఫూర్తిని రగిలించే ‘యుగ్మలి’


 మేఘశ్యామ్, కోట శంకర్రావు, అల్లరి సుభాషిణి, అనుశ్రీ, జోగినాయుడు ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘యుగ్మలి’. మేఘశ్యామ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈదర హరిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేఘశ్యామ్ మాట్లాడుతూ -‘‘నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది. ఆ కసితో ఈ సినిమా తీశాను. విడుదలకు ముందే... ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన... అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ అవార్డును సొంతం చేసుకుందీ సినిమా.
 
  సమాజంలో స్ఫూర్తిని రగిలించే ఈ సినిమా తప్పక ప్రేక్షకాదరణ పొందుతుందని నా నమ్మకం’’ అని తెలిపారు. విశ్వేశ్వరశాస్త్రి, అంద్శై రాజేంద్రరెడ్డి, కలివేర వెంకటేశ్వరరావు, గాయని కౌసల్య తదితరులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సమర్పణ: రామభక్త సీతయ్య కళాపరిషత్, నిర్మాణం శిల్పా చలనచిత్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement