
న్యూఢిల్లీ : కార్మిక దినోత్సవమైన మే 1న ప్రారంభించిన శ్రామిక్ రైళ్లలో, ఇప్పటివరకు పది లక్షల మంది కార్మికులను వారి స్వస్థలాలకు చేరవేశామని గురువారం రేల్వే శాఖ ప్రకటించింది. పొట్టకూటి కోసం వలస వెల్లిన కార్మికులు కరోనా మహమ్మారి వ్యాప్తితో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. దీంతో తమ సొంతూర్లకు వెళ్లడానికి కాలిబాట పట్టారు.
ఈ నేపథ్యంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో గత 15 రోజులుగా సుమారు 800 శ్రామిక్ రైళ్లలో 10 లక్షల మంది కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేరవేశామని రైల్వే శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment