సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,502 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. వైరస్ బారినపడి 325 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం దేశంలోని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కి చేరింది. మృతుల సంఖ్య 9,520కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,53,106 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వైరస్ నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1,69,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్ ఉధృతి కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment