శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భారత సైన్యానికి భీకర పోరు జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన 13 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఎదురుకాల్పుల్లో పలువురు భారత జవాన్లు సైతం గాయపడ్డారు. వారికి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న అధికారులు సంబంధిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై సైన్యం తూటాల వర్షం కురిపింది. కాగా దీనిపై సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ.. మార్చి 28 నుంచే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు కుట్రలు పన్నుతున్నారని సమాచారం అందినట్లు తెలిపారు. వాటి ఆధారంగానే పూంచ్ సెక్టార్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదుల తారసపడ్డరని వెల్లడించారు. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసి.. కాల్పులు జరిపామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment