3 ఏళ్ల చిన్నారిని రక్షించిన 14 నెలల పసికందు
3 ఏళ్ల చిన్నారిని రక్షించిన 14 నెలల పసికందు
Published Thu, Sep 7 2017 1:06 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM
ముంబై: నగరంలో మానవత్వం పరిమళించింది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ 14 నెలల బాలుడి తల్లితండ్రులు అవయదానానికి ముందుకు రావడంతో మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. అవయవదానంతో చిన్నారి ప్రాణాలను రక్షించిన ఆ బాలుడు చిరంజీవిగా మిగిలిపోయాడు. ఈ అరుదైన ఘటన ముంబైలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. సూరత్‌కు చెందిన ఆ పసికందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లితండ్రుల ఆ చిన్నారిని న్యూ సూరత్ సివిల్ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ స్థానిక ఎన్‌జీవో కౌన్సెలింగ్‌తో ఆ పసికందు తల్లితండ్రులు అవయదానానికి అంగీకరించారు.
ఆ చిన్నారి అవయవాలను సేకరించిన వైద్యులు కిడ్నీలను అహ్మదాబాద్ కిడ్నీ రిసేర్చ్ సెంటర్‌కు పంపించగా గుండెను ఓ మూడన్నరేళ్ల బాలికకు మార్పిడి చేశారు. నవీ ముంబైకి చెందిన ఈ బాలిక గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దీంతో చిన్నారి గుండెను కమర్షియల్ ఫ్లైట్‌లో తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు. దీంతో ఆచిన్నారి బాలిక ప్రాణాలు నిలబెట్టడమేగాక పశ్చిమ భారత దేశ యంగెస్ట్ డోనార్‌గా గుర్తింపు పొందాడు.
Advertisement
Advertisement