పర్యాటక రంగాభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 1,573.07 కోట్లను జైట్లీ కేటాయించారు.
న్యూఢిల్లీ: పర్యాటక రంగాభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 1,573.07 కోట్లను జైట్లీ కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇది 33 శాతం అధికం. ఇప్పటిదాకా 43 దేశాలకే ఉన్న వీసా ఆన్ అరైవల్ (దేశంలో దిగాక వీసా పొందే) సౌకర్యాన్ని 150 దేశాలకు విస్తరించారు. భారత్‌కు వచ్చే ప్రపంచ పర్యాటకుల సంఖ్య 0.6 శాతమే. తాజా నిర్ణయంతో వారిని బాగా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. గత జనవరిలో వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో 1,903 మంది విదేశీ పర్యాటకులు రాగా, ఈ జనవరిలో 25,023 మంది వచ్చారని మంత్రి తెలిపారు.