General budget-2015
-
పేదల కోసం జనసురక్ష
- తక్కువ ప్రీమియంతో బీమా - ఏడాదికి రూ.12కే రెండు లక్షల ప్రమాద మరణ బీమా - రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో జీవిత బీమా - రూ.వెయ్యి ప్రీమియంతో - అటల్ పెన్షన్ యోజనతక్కువ ప్రీమియంతో బీమా - ఏడాదికి రూ.12కే రెండు లక్షల ప్రమాద మరణ బీమా - రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో జీవిత బీమా - రూ.వెయ్యి ప్రీమియంతో అటల్ పెన్షన్ యోజన న్యూఢిల్లీ: ప్రజలందరికీ బీమా సౌకర్యం ఉండేలా జైట్లీ మూడు పథకాలను బడ్జెట్లో ప్రకటించారు. దామాషా ప్రకారం చూస్తే దేశంలోని ఎక్కువమంది ప్రజలు ఎలాంటి బీమా పథకం లేకుండానే ఉన్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన విజయవంతమైనట్లే.. భారతీయులందరికీ సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రమాద, జీవిత బీమా, పెన్షన్ పథకాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వీటిలో మొదటిది ‘ప్రధానమంత్రి సురక్షా బీమా’. దీని కింద ఏడాదికి కేవలం రూ.12 అంటే నెలకు రూపాయి చొప్పున ప్రీమియం కడితే రూ.2 లక్షల ప్రమాద మరణ బీమా వర్తిస్తుంది. ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు బీమా కింద లభిస్తుంది. జైట్లీ ‘అటల్ పెన్షన్’ పథకాన్నీ ప్రకటించారు. ఏడాదికి కనీసంగా రూ.వెయ్యి చొప్పున ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే, లబ్ధిదారులు చెల్లించే మొత్తానికి ప్రభుత్వం 50% పెన్షన్‌గా చెల్లిస్తుంది. 2015 డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తెరిచిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. జైట్లీ ప్రకటించిన మూడో పథకం జీవిత బీమాకు సంబంధించిన ‘ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన’. ఈ పథకం సహజ, ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు గల వారు ఏడాదికి రూ.330 (అంటే, రోజుకు రూపాయి కంటే తక్కువ) ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ బీమా కింద లబ్ధిదారులకు రూ.2 లక్షలు చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకూ వరాలు దేశంలో 80 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు దాదాపు కోటి మంది వరకు ఉన్నారని జైట్లీ అన్నారు. వీరిలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వీరిలోనూ ఎక్కువమంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారేనన్నారు. ఇలాంటి సీనియర్ సిటిజన్లకు వయసు కారణంగా వచ్చే వివిధ వైకల్యాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామన్నారు. వృద్ధాప్యం లో ఏ ఒక్కరూ బాధ పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఎస్సీలకు రూ. 30,851 కోట్లు, ఎస్టీలకు రూ.19,980 కోట్లు, మహిళలకు రూ. 79,258 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పారసీల నాగరికత, సంస్కృతిలను కాపాడటానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని, 2015-16లో జరిగే ‘ది ఎవర్ లాస్టింగ్ ఫ్లేమ్’ ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలిపారు. -
అడుక్కున్నా.. అంతెత్తునే!
న్యూఢిల్లీ: నెలకు 75 వేల ఆదాయం.. 70 లక్షల ఫ్లాట్.. బోలెడంత బ్యాంక్ బ్యాలెన్స్.. ఇదంతా ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి అనుకుం టున్నారా..? అయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇదంతా భారత్ జైన్ అనే 49 ఏళ్ల యాచకుడి లెవల్.. అతనే కాదు ముంబైలోని చార్నీ రోడ్డులో భిక్షమెత్తుకునే కృష్ణకుమార్ గీతే రోజుకు రూ. 1,500 సంపాదిస్తాడు. అతనికి నల్లసోపారా ప్రాంతంలో దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే ఫ్లాట్ ఉంది. ఇక పట్నాకు చెందిన సరస్వతీ దేవి యాచిస్తూనే ఏడాదికి రూ. 36వేల బీమా చెల్లిస్తోంది. ఆమెకు ఖరీదైన ఇల్లు ఉంది. ముంబైలోని ఖర్ ప్రాంతంలో అడుక్కునే శంభాజీ కాలే కూడా భిక్షమెత్తుకునే.. లక్షల విలువ చేసే ఫ్లాట్లు కొన్నాడు. రెండు ఇళ్లు కూడా కట్టించాడు. -
కుతుబ్‌షాహీ టూంబ్స్కు కొత్త కళ..
న్యూఢిల్లీ: చారిత్రక వారసత్వ సంపద అయిన కుతుబ్‌షాహీ సమాధుల (టూంబ్స్)కు త్వరలోనే పర్యాటక కళ చేకూరనుంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ కట్టడాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ వారసత్వ హోదా పొందిన దాదాపు 25 ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, సుందరీకరణ, పార్కులు, టాయిలెట్లు, భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తెలిపారు. తొలుత హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధులు, కర్ణాటకలోని హంపి, పాత గోవా ప్రాంతంలోని చర్చిలు, రాజస్థాన్‌లోని కుంభాల్‌గఢ్ తదితర కోటలు, గుజరాత్‌లోని రాణీకి వావ్, కశ్మీర్‌లోని లెహ్ ప్యాలెస్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మరిన్ని దేశాలకు ‘వచ్చాకే వీసా’.. విదేశీ పర్యాటకులు మన దేశానికి వచ్చాక విమానాశ్రయాల్లో తాత్కాలిక వీసా తీసుకునే (వీసా ఆన్ అరైవల్) సదుపాయాన్ని 150 దేశాలకు విస్తరిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. ఇంతకు ముందు 43 దేశాలకు సంబంధించి ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఈ చర్యలు ముదావహమని కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ డెరైక్టర్ పీటర్ కెర్కర్, థామస్ కుక్ ఇండియా విభాగం ఎండీ మాధవన్ మీనన్ చెప్పారు. బడ్జెట్లో నిర్ణయాలు పర్యాటకానికి మంచి ఊపునిస్తుందని ‘మేక్ మై ట్రిప్’ వెబ్సైట్ సీఈవో రాజేష్ మాగోవ్ పేర్కొన్నారు. -
సబ్సిడీల్లో 10 శాతం కోత
న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై సబ్సిడీల్లో 10 శాతం కోతవేశారు. ముఖ్యంగా పెట్రోలియంపై సబ్సిడీలను భారీగా కత్తిరించడంతో 2015-16 బడ్జెట్లో సబ్సిడీలు రూ.2.27 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్థిక మంత్రి జైట్లీ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ మూడింటిపై 2,27,387.56 కోట్లను సబ్సిడీల కింద కేటాయించారు. గత బడ్జెట్లో (సవరించిన అంచనాలు) ఈ బిల్లు రూ.2,53,913.12 కోట్లుగా ఉంది. ఆహారానికి గత బడ్జెట్లో రూ.1,22,675.81 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1,24,419 కోట్లను రాయితీల కింద కేటాయించారు.. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు దాదాపు రూ.65 వేల కోట్లు ప్రతిపాదించారు. ఎరువులపై సబ్సిడీ గత బడ్జెట్లో రూ.70,967.31 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.72.968.56 కోట్లు కేటాయించారు. పెట్రోలియంకు గత బడ్జెట్లో రూ.60,270 కోట్ల సబ్సిడీ ఉండగా, ఇప్పుడు రూ.30 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఎల్పీజీ సబ్సిడీకి రూ.22 వేల కోట్లు కాగా మిగతా మొత్తం కిరోసిన్‌కు కేటాయించారు. -
జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల కోత
న్యూఢిల్లీ: బడ్జెట్లో జల వనరుల మంత్రిత్వశాఖకు నిధుల్లో భారీ కోత పడింది. ఈ శాఖకు ప్రస్తుత బడ్జెట్లో రూ.4.232.43 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో సింహభాగం నిధులను మోదీ ప్రభుత్వ మానస ప్రాజెక్టు అయిన ‘గంగా నది ప్రక్షాళన’కు ఇవ్వడం విశేషం. గంగానది ప్రక్షాళన ప్రణాళికకు రూ.2,100 కోట్లు కేటాయించారు. 2014-15కు సంబంధించిన సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.600 కోట్లు అదనం. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోసం రూ.100 కోట్ల నిధులను కేటాయించారు. నదుల అనుసంధానంపై సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పనకు రూ.100 కోట్లు కేటాయించారు. -
శాస్త్ర, సాంకేతికానికి బూస్ట్!
న్యూఢిల్లీ: శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలకు ఊతం లభించేలా ఈసారి బడ్జెట్లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రాధాన్యం పెంచారు. శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం మొత్తం రూ. 7,288 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఇది 1,793 కోట్లు ఎక్కువ. శాస్త్ర, సాంకేతిక శాఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ), బయోటెక్నాలజీ(డీబీటీ) విభాగాలు, శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన కేంద్రం(సీఎస్ఐఆర్) అనే మూడు ఉప విభాగాలున్నాయి. వీటిలో డీఎస్టీకి తాజా బడ్జెట్లో అత్యధికంగా రూ.3,401 కోట్లు, సీఎస్ఐఆర్కు రూ.2,281 కోట్లు, డీబీటీకి రూ.16,06 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులను పెంచడం, లేదా తగ్గించడమూ చేయొచ్చంటున్నారు. అదేవిధంగా తాజా బడ్జెట్లో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ. 1,179 కోట్లు కేటాయించారు. సముద్ర అధ్యయనానికి రూ. 669 కోట్లు, వాతావరణ అధ్యయనానికి రూ. 425 కోట్లు కేటాయించారు. కాగా, 2014-15 బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ. 6,725 కోట్లు కేటాయించారు. అయితే, తర్వాత సమీక్షలో వాటిని రూ. 5,495 కోట్లకు కుదించారు. -
నల్లధనంపై ఉక్కుపాదం
- బడ్జెట్లో కఠిన చట్టాలను ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి జైట్లీ - విదేశీ ఆస్తులపై పన్ను ఎగవేస్తే పదేళ్ల జైలు - 300రెట్లు జరిమానా, ఆస్తుల జప్తు, మార్కెట్ రేటుపై - పన్ను విధింపు.. కొత్త చట్టానికి ఈ సమావేశాల్లోనే బిల్లు - రియల్ ఎస్టేట్‌లో నగదు లావాదేవీలకు పరిమితి.. - డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగానికి ప్రోత్సాహం - బినామీ లావాదేవీల నిషేధిత బిల్లుకు ప్రతిపాదన.. - ఐటీ రిటర్నుల్లో మోసాలకు ఏడేళ్ల వరకు శిక్ష - లక్ష పైబడిన క్రయవిక్రయాలకు ‘పాన్’ తప్పనిసరి - ఐటీ, ఫెమా, పీఎంఎల్ఏ చట్టాలకూ సవరణలు న్యూఢిల్లీ: నల్లధన ప్రవాహ కట్టడికి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు ప్రతిపాదించింది. నల్లధనాన్ని రూపుమాపే వరకు దేశంలో పేదరికం, అసమానతలు తొలగిపోవని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఈ దిశగా కఠిన శిక్షలతో కూడిన సమగ్ర చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. ‘సమాజాన్ని, ఆర్థికరంగాన్ని తొలిచేస్తున్న నల్లధనాన్ని అరికట్టే కొత్త చట్టాన్ని తీసుకురావడం నా పన్ను ప్రతిపాదనల్లో తొలి అడుగు. ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతాం. దీని ప్రకారం విదేశీ ఆదాయం, ఆస్తులను కలిగి ఉండి పన్ను ఎగవేసే వారిపై విచారణ జరిపి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. అంతేకాదు, ఈ కేసులో రాజీకి వీలుండదు. పన్ను ఎగవేతదారులు పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించలేరు. ఇక దేశీయంగా నల్లధనాన్ని అడ్డుకోడానికి కొత్త, సమగ్ర బినామీ లావాదేవీల(నిషేధిత) బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతాం. దీంతో బినామీల పేరుతో ఆస్తులను కూడబెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనాన్ని అరికడతాం’ అని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నేరుగా నగదు లావాదేవీలను నిరుత్సాహపరిచేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నగదు లావాదేవీలకు పరిమితి విధించి, డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. అలాగే స్థిరాస్తి కొనుగోలు సమయంలో రూ. 20 వేలకన్నా ఎక్కువ నగదును అడ్వాన్స్‌గా తీసుకోవడాన్ని నిషేధించేలా ఇన్‌కంటాక్స్ చట్టాన్ని సవరించాలని జైట్లీ ప్రతిపాదించారు. నిబంధలను ఉల్లంఘిస్తే అంతే మొత్తం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇకపై లక్ష రూపాయలకు పైబడిన కొనుగోలు/అమ్మకాల విషయంలో పాన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీ నగదు విక్రయాలు, సీమాంతర లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని థర్డ్ పార్టీ సంస్థలు విధిగా సమర్పించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. పన్ను ఎగవే త దారులపై కఠిన చర్యలు లావాదేవీలను విభజించి చూపి పన్నులు తప్పించుకునే విధానాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించనున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ), ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం(సీబీఈసీ)ల మధ్య సమన్వయం అవసరమని, ఇరు విభాగాల డేటాబేస్లను సంయుక్తంగా వినియోగించుకునేలా టెక్నాలజీని రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విదేశీ ఆస్తులపై పన్ను ఎగవేస్తే ఆ మొత్తానికి 300 రెట్లు జరిమానా విధిస్తామన్నారు. అలాంటి ఆస్తులపై గరిష్ట మార్కెట్ రేటు ప్రకారమే పన్ను విధిస్తామని కూడా చెప్పారు. ‘‘రిటర్న్‌లు దాఖలు చేయకపోయినా, విదేశీ ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలతో రిటర్న్‌లు సమర్పించినా ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. అలాగే విదేశీ ఖాతాను తెరిచిన తేదీని తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌లో పేర్కొనాలి. విదేశీ ఆస్తుల విషయంలో పన్ను ఎగవేతకు పాల్పడితే మనీలాండరింగ్ చట్టం(పీఎంఎల్ఏ) కింద చర్యలు తీసుకుంటాం. ఇతర దర్యాప్తు సంస్థలు కూడా సదరు ఆస్తులను జప్తు చేసి నల్లధనాన్ని కలి గిన వ్యక్తులు/సంస్థలపై దర్యాప్తు చేపడతాయి. విదేశీ నగదు నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనలను కూడా సవ రిస్తున్నాం’’ అని జైట్లీ వివరించారు. సిట్‌కు పెరిగిన కేటాయింపులు నల్లధనం కేసులపై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు తాజా బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. విచారణ వేగవంతంగా సాగడానికి మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన కోసం వీటిని వాడతారు. గతేడాది సిట్‌కు రూ. 41.34 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 45.39 కోట్లు దక్కాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి. షా, వైస్ చైర్మన్ అరిజిత్ పసాయత్ నేతృత్వంలోని సిట్‌లో 11 మంది సభ్యులు ఉన్నారు. భారత్ నుంచి విదేశాలకు తరలిన నల్లధనంపై ఈ బృందం దృష్టిసారించిన సంగతి తెలిసిందే. -
వృద్ధి మేడలకు పునాదులెక్కడ?
- గతంతో పోలిస్తే తగ్గిన ప్రణాళిక వ్యయం.. - మొత్తం వసూళ్లలోనూ దిగువ ముఖమే - సేవలు, స్పెక్యులేషన్లపైనే ఆధారపడ్డ ప్రభుత్వం .. - లోటు తగ్గటంలోనూ అంతర్జాతీయ పరిణామాలే కీలకం - రాష్ట్రాలకు కేటాయింపులు సైతం గతం కన్నా దిగదుడుపే - వాస్తవాలను మరుగున పరిచిన జైట్లీ బడ్జెట్ ఎవ్వరికీ ప్రత్యేక హోదా లేదు... పోలవరానికి పూర్తి నిధులూ లేవు. సాక్షి, బిజినెస్ విభాగం: మొత్తమ్మీద మన రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు. అలాగని ఇతర రాష్ట్రాలకూ ఇచ్చిందేమీ లేదు. పన్నుల వాటా పెంచుతున్నామనే కోటలు దాటిన మాటలు తప్ప నిజంగా నిధులు పెంచిందీ లేదు. పోనీ సామాన్యుడికేమన్నా మేలు జరిగిందా అంటే... హోటలు బిల్లు నుంచి ఫోను బిల్లు దాకా అన్నీ పెరిగేలా సేవల పన్ను పెంచారు తప్ప రాయితీల ఊసే లేదు. పోనీ... ఇన్ని చేసినందుకు దేశాభివృద్ధి ఖాయమేనా? ఏమో డౌటే!! వృద్ధికి కేటాయింపులెక్కడ? వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికాభివృద్ధి 8-8.5 శాతం మధ్య ఉంటుందని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ఊదరగొట్టేశారు. తాము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో తీసుకున్న చర్యలతో మరో నెలలో ముగియనున్న 2014-15లో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరుతుందన్న అంచనాల్ని కూడా ప్రకటించారు. నిజానికి ఇదంతా జీడీపీ గణాంకాల పరిగణనకు తీసుకునే ఆధార సంవత్సరాన్ని (బేస్ ఇయర్) 2004-05 నుంచి 2011-12కు మార్చిన మహిమ. కొత్త బేస్ ఇయర్ ప్రకారం 2013-14లో 6.9 శాతం వున్న వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకాఎకిన 8 శాతాన్ని మించిపోతుందన్నారు జైట్లీ. మరి దానికి కావాల్సిన కేటాయింపులేమైనా ఈ బడ్జెట్లో ఉన్నాయా అంటే లేవు. మరెలా!? వాస్తవానికి ఏ దేశ వృద్ధికైనా పనికొచ్చేది ప్రణాళికా వ్యయమే. అంటే ఆస్తుల్ని సృష్టించే వ్యయమన్న మాట. ప్రణాళికేతర వ్యయమంటే జీతాల వంటి అంశాలపై పెట్టే ఖర్చే తప్ప ఆస్తులేమీ ఉండవు. అలాంటిది 2014-15 బడ్జెట్లో ప్రణాళిక వ్యయం కింద కేటాయించిన మొత్తం ఏకంగా రూ.5.75 లక్షల కోట్లు. మరి 2015-16 బడ్జెట్లో ఈ కేటాయింపులెలా ఉండాలి? వృద్ధి రేటును 8 శాతానికి చే ర్చాలనుకున్నపుడు ఈ కేటాయింపులెంత పెంచాలి? కానీ వాస్తవంగా కేటాయించింది మాత్రం రూ.4.65 లక్షల కోట్లు. మరోవంక 2014-15లో సవరించిన అంచనాల ప్రకారం ప్రణాళిక వ్యయం రూ.4.67 లక్షల కోట్లకు పరిమితమైంది. మరి తాజా అంచనాలను కూడా సవరించాల్సి వస్తే ఏమవుతుంది...? వసూళ్లు కూడా తక్కువే... కేటాయింపుల సంగతి సరే! గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ వసూళ్లు కూడా పెరిగే అవకాశం లేదని జైట్లీ అంచనాలే చెబుతున్నాయి. 2014-15లో రెవెన్యూ, క్యాపిటల్ వసూళ్ల ద్వారా రూ.17.94 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఈ సారి ఎంత ఆదాయం వస్తుందని అంచనా వేశారో తెలుసా? కేవలం రూ.17.77 లక్షల కోట్లు. అంటే గతేడాదికన్నా దాదాపు 17 వేల కోట్లు తక్కువ వస్తాయని అంచనా వేశారన్న మాట. ఎక్కడైనా ఏటికేడాది ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మన ప్రభుత్వ ఆదాయమేమో తగ్గుతోంది. ఒకవైపు ఆదాయమూ లేక మరోవైపు ప్రణాళికా బద్ధమైన ఖర్చూపెట్టక వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? గాల్లోంచా జైట్లీజీ!!! వ్యవసాయం, పరిశ్రమల వృద్ధి శూన్యం జీడీపీ పెరుగుతుందని జైట్లీ చెప్పిన అంచనాలు కూడా భారతదేశ జీవనాధారమైన వ్యవసాయాన్నో, భారీగా ఉపాధి కల్పించే పరిశ్రమలనో ఆధారం చేసుకున్నవి కావు. బలుపు కాదు వాపు అన్న చందాన సేవల రంగాన్ని (సర్వీసు)... రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ రంగాల ద్వారానే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఆయన అంచనా వేసినట్లు బడ్జెట్ ప్రతిపాదనలు చెబుతున్నాయి. నిజంగా రాష్ట్రాలకు నిధులు పెరిగాయా? నిజమైన ఫెడరల్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, అందుకే ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టామని, రాష్ట్రాలకు పన్నుల వాటాను ఏకంగా 32 నుంచి 42 శాతానికి పెంచామని జైట్లీ చెప్పుకొచ్చారు. ఇతరత్రా బదలాయింపులన్నీ కలిసి రాష్ట్రాలకు మొత్తమ్మీద 62 శాతం నిధులు వెళుతున్నాయని, ఇది చరిత్రాత్మకమని చెప్పుకొచ్చారు. తాము ఈ రకంగా రాష్ట్రాలను ఎంత శక్తిమంతం చేస్తున్నదీ కూడా వివరించారు. వినటానికి ఇదంతా బాగానే ఉంది. కానీ అంకెలు చూస్తే అసలు సంగతి బోధపడుతోంది. 14వ ఆర్థిక సంఘం వెలువరించిన నివేదికను చూస్తే గడిచిన ఎనిమిదేళ్లలో (మోదీ ప్రభుత్వం రాకముందు) రాష్ట్రాలకు బదలాయించిన కేంద్ర నిధుల వాటా సరాసరిన 65 శాతం ఉంది. (దిగువ పట్టికలో చూడొచ్చు). కొన్ని సంవత్సరాల్లో ఏకంగా 70 శాతం కూడా దాటింది. కానీ జైట్లీ ప్రతిపాదించిన లెక్కలు చూస్తే ఏ సంవత్సరం కూడా అప్పటి సగటును మించటమే లేదు. మరి రాష్ట్రాలకు ఎక్కువ నిధులిచ్చినట్లా? అటు రాష్ట్రాలకూ ఇవ్వక, ఇటు సామాన్యులకూ రాయితీలివ్వక ఈ బడ్జెట్ నిజంగా మేలు చేస్తున్నదెవరికి? ప్రకటించిన వృద్ధి నిజంగా సాధ్యమేనా? ఏమో... కొన్నాళ్లు వేచి చూడాల్సిందే!!. లోటు తగ్గిందా... ఎవరి గొప్ప? 2014 మార్చి 31 నాటికి కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.7 శాతం. ఇదిప్పుడు 1.3 శాతానికి దిగి వచ్చిందని, అదంతా తమ ఘనతేనని చెబుతున్నారు జైట్లీ. నిజానికి మోదీ ప్రభుత్వ కృషి వల్లే కరెంటు ఖాతా లోటు తగ్గిందని చెప్పటం కంటే... మన చేతుల్లోలేని అంతర్జాతీయ పరిణామాల వల్ల అదృష్టం కలిసొచ్చి అలా జరిగిందని చెప్పక తప్పదు. ఎందుకంటే మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టే సమయానికి అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ ధర 106 డాలర్ల దగ్గరుంది. అలాగే బొగ్గు ధర కూడా టన్ను 102-104 డాలర్ల దగ్గరుంది. మనం దిగుమతి చేసుకునే ఈ రెండూ ఇప్పుడు 60 శాతానికి పైగా పడిపోయాయి. క్రూడ్ ధర 49 డాలర్లకు రాగా... బొగ్గు 55-58 డాలర్ల దగ్గరుంది. వీటి దిగుమతికి మనం వెచ్చించాల్సిన లక్షల కోట్ల రూపాయలు మిగిలి ప్రభుత్వం కరెంటు ఖాతా లోటు పూడ్చుకోవటానికి సహకరించాయి. నిజానికి ఆర్బీఐ లెక్కల ప్రకారం 2013-14 ఆఖరి త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు జీడీపీలో కేవలం 0.2 శాతం. మరిప్పుడు 1.3 శాతానికి తేవటం వెనక మోదీ ప్రభుత్వ కృషి ఏమిటన్నది సామన్యులకు అర్థంకాని రహస్యం!! -
సబ్సిడీలు ‘జామ్’
- జన్-ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇస్తున్న భారీ సబ్సిడీలన్నీ అర్హులను మాత్రమే చేరేందుకు చర్యలు తీసుకుంటున్నామని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం చెబుతున్న తారక మంత్రం... ‘జామ్’. అంటే జన్-ధన్ యోజన... ఆధార్... మొబైల్. ఈ మూడింట్లో మొదటి ఆంగ్ల అక్షరాలు కలిపితే జామ్ అవుతుంది. జన్-ధన్ పేరిట కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచిన ప్రభుత్వం... వాటన్నిటినీ ఆధార్తోను, వారి మొబైల్ నంబర్లతోను అనుసంధానం చేస్తోంది. తద్వారా సబ్సిడీలతో సహా సామాజిక భద్రత పథకాలన్నీ అర్హుల్ని చేరుతాయన్నది జైట్లీ మాట. ఇప్పటికే ఎల్పీజీ సబ్సిడీని బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్‌తో అనుసంధానం చేసిన ప్రభుత్వం... విద్యార్థుల స్కాలర్ షిప్‌లను కూడా రాష్ట్రాల సహకారంతో ఇలా చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. చివరగా పీడీఎస్‌ను కూడా ఈ కోవలోకి తేనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మున్ముందు ప్రకటించే ఏ పథకాన్నైనా... జామ్ ద్వారా అర్హులకు చేర్చాలన్నది సర్కారు ఉద్దేశం. ఈ బడ్జెట్లో మూడు సామాజిక భద్రత పథకాల్ని ప్రకటించిన జైట్లీ... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.3,000 కోట్లు, ఈపీఎఫ్‌లో రూ.6,000 కోట్లు ఎవరికీ చెందనివిగా ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. ‘‘ఈ నిధితో వృద్ధుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రభుత్వ నిధుల్ని కూడా జత చేసి... వృద్ధ పింఛనర్లు, దారిద్య్ర రేఖకు దిగువనున్నవారు, చిన్న-సన్నకారు రైతుల బీమా ప్రీమియాలపై సబ్సిడీ ఇవ్వటానికి వినియోగిస్తాం. వచ్చే నెలలో పూర్తి పథకాన్ని ప్రకటిస్తాం. వృద్ధులు దాదాపు 10.5 కోట్ల మంది ఉన్న మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వృద్ధులకు వారి జీవనానికి అవసరమైన పరికరాలను అందించటానికి కొత్త పథకాన్ని ప్రవేశపెడతాం’’ అని స్పష్టం చేశారు. మొత్తమ్మీద ఈ పథకాలన్నిటినీ ‘జామ్’ ప్లాట్‌ఫామ్‌పైనే అమలు చేస్తామని జైట్లీ ప్రకటించారు. -
‘తయారీ’కి తాయిలం
- కేంద్ర బడ్జెట్లో ‘మేక్ ఇన్ ఇండియా’కు పెద్దపీట - కార్పొరేట్ పన్ను నాలుగేళ్లలో 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గింపు - ముడిసరకులపై కస్టమ్స్ సుంకం రద్దు.. గార్ అమలు రెండేళ్లు వాయిదా - 12.36 శాతంగా ఉన్న సేవా పన్ను, విద్యా సెస్సులు 14 శాతానికి పెంపు - వేతనజీవికి నిరాశ.. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి యథాతథం - నల్లధనంపై త్వరలో కొత్త చట్టం.. విదేశాల్లో ఆస్తులను ‘దాస్తే’ పదేళ్ల జైలు - 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి జీఎస్టీ న్యూఢిల్లీ: దేశంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలంటే ప్రపంచంలో భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మలచాలని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. ‘భారీ వ్యయాల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహించటం - ఉద్యోగాలను సృష్టించటం మధ్య సమన్వయం కోసం ఈ బడ్జెట్లో కసరత్తు చేశాం’ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం మేరకు.. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి విదేశీ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించటం కోసం, పరిశ్రమల స్థాపన, వ్యాపారం సులభతరం చేసేందుకు పలు చర్యలను ప్రకటించారు. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును క్రమంగా 25 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. అదే సమయంలో కార్పొరేట్ పన్నులకు సంబంధించి అమలులో ఉన్న వివిధ రాయితీలు, ప్రయోజనాలను క్రమంగా తగ్గిస్తామన్నారు. వివాదాస్పద ‘గార్’ అమలును మరో రెండేళ్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయ పన్ను రేట్లలో మార్పు లేదు గానీ... ఈ బడ్జెట్లో వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయపన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఏడాదికి గరిష్టంగా రూ.4,44,200 వరకూ పన్ను మినహాయింపు పొందేలా పలు మినహాయింపులను ప్రకటించారు. వస్తువులు, సేవలపై పన్నులు ఇలా... ప్రస్తుతం 12.36 శాతంగా ఉన్న సేవా పన్ను, విద్యా సెస్సులను 14 శాతానికి పెంచారు. సేవా పన్నుల్లో ‘వ్యతిరేక జాబితా’ను తగ్గిస్తున్నట్లు చెప్పారు. పన్ను పరిధిని పెంచటానికి కొన్ని ఇతర మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఫోన్ కాల్స్, విమానప్రయాణం, రెస్టారెంట్లలో భోజనం, బ్యూటీపార్లర్ల సేవలు వంటి వాటి ధరలు పెరగనున్నాయి. ఇదిగాక.. పన్ను పరిధిలోని సేవలపై భవిష్యత్తులో రెండు శాతం ‘స్వచ్ఛ భారత్’ సెస్సు వసూలు చేస్తామన్నారు. పరోక్ష పన్నుల్లో.. ముడి పదార్థాలపై ప్రాధమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. తోలుతో చేసిన పాదరక్షలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. పండ్లు, కూరగాయలకు సంబంధించి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయటానికి ముందు అందించే సేవలపై పన్నును మినహాయంపునిచ్చారు. తోలుతో చేసిన పాదరక్షలు, దేశీయంగా తయారైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ ట్యాబ్లెట్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ప్యాక్ చేసిన ఫలాలు, అంబులెన్స్ సేవలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. గత ఆర్థికమంత్రుల లాగానే.. జైట్లీ కూడా ధూమపాన ప్రియులపై కఠినంగా వ్యవహరించారు. సిగరెట్లు, సిగార్లు, చెరూట్లపై సుంకాన్ని 25 శాతం వరకూ పెంచారు. సిమెంట్ కూడా మరింత ప్రియం కానుంది. ప్రత్యక్ష పన్నులపై చేసిన ప్రతిపాదనల ఫలితంగా రూ. 8,315 కోట్ల ఆదాయం తగ్గిపోతే.. పరోక్ష పన్నులపై చేసిన ప్రతిపాదనల వల్ల రూ. 23,383 కోట్లు ఆదాయం లభిస్తుందని.. మొత్తం ప్రతిపాదనల ద్వారా వచ్చే ఏడాది రూ. 15,068 కోట్ల అదనపు ఆదాయం ఆర్జిస్తామని వివరించారు. మౌలికవసతుల రంగానికి రూ. 70,000 కోట్లు... రైల్వేలు, రహదారులు, సాగునీటి సంస్థలు.. పన్ను రహిత మౌలికవసతుల బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకోవడానికి అవకాశం కల్పించారు. మౌలిక వసతుల రంగానికి రూ. 70,000 కోట్లు కేటాయించారు. పెట్రోలు, డీజిల్‌లపై వసూలు చేసే ఎక్సైజ్ సుంకంలో కొంత రహదారి సుంకంగా మార్చారు. తద్వారా.. రహదారుల నిర్మాణానికి అందుబాటులో ఉండే మూల నిధి మరో రూ. 40,000 పెరుగుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ, జేఏఎం త్రయం.. విప్లవాత్మక సంస్కరణలు భారతదేశంలో రెండు విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించామని.. అందులో ఒకటి జీఎస్టీ అయితే మరొకటి ప్రయోజనాలను నేరుగా బదిలీ చేసే జేఏఎం త్రయం (జనధన యోజన, ఆధార్, మొబైల్) అని జైట్లీ చెప్పారు. జీఎస్టీ ద్వారా 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలో అత్యాధునిక ప్రత్యక్ష పన్ను వ్యవస్థ అమలులోకి వస్తుందన్నారు. జేఏఎం త్రయం ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను లీకేజీ రహితంగా, మరింత లక్ష్యపూరితంగా, నగదు రహితంగా బదిలీ జరుగుతుందని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి సామాజిక రంగ పథకాలకు కేటాయింపులు పెంచారు. పేదలు, అణగారిన వర్గాలకు సంబంధించిన సామాజిక రంగ వ్యయంలో.. విద్యా రంగానికి రూ. 68,968 కోట్లు, వైద్య రంగానికి రూ. 33,152 కోట్లు, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకాలకు కలిపి రూ. 77,526 కోట్లు, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధిలకు రూ. 22,407 కోట్లు కేటాయించారు. నల్లధనంపై కొత్త చట్టం... బంగారం బాండ్లు... నల్లధనాన్ని వెలికితీస్తామన్న హామీలు నెరవేరకపోతుండటంపై సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. విదేశీ ఆస్తులను దాచిపెడితే పదేళ్ల వరకూ జైలు శిక్ష, విదేశాల్లో అప్రకటిత ఆదాయం, ఆస్తులు ఉన్నట్లయితే 300 శాతం వరకూ జరిమానా విధించేలా కొత్తగా ఒక సమగ్ర చట్టాన్ని తీసుకువస్తామని జైట్లీ ప్రకటించారు. బంగారు లోహం కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారు బాండ్లను ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ బాండ్లపై నిర్ణీత వడ్డీ రేటు చెల్లింపులు ఉంటాయని, వాటిని నగదులోకి మార్చుకునేటపుడు అప్పటి బంగారం ముఖ విలువను పొందవచ్చని వివరించారు. అతి త్వరలో రెండంకెల ఆర్థికాభివృద్ధి... ఆర్థిక వ్యవస్థ గత తొమ్మిదేళ్లలో నాటకీయంగా మలుపు తిరిగిందని.. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ను నిలబెడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 8 - 8.5 శాతం వరకూ పెరగవచ్చని భావిస్తున్నామని.. అతి త్వరలో రెండంకెల వృద్ధి సాధ్యంగా కనిపిస్తోందని ఆశాభావం వ్యక్తంచేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించామని.. స్థిరమైన పేదరిక నిర్మూలనకు, ఉద్యోగ సృష్టికి, దృఢమైన రెండంకెల ఆర్థికాభివృద్ధికి అవసరమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో ఐఐటీని, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లలో ఐఐఎంలను ఏర్పాటు చేస్తామన్న జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయ నిధిని అందిస్తామన్నారు. అదే తరహా ప్రత్యేక సహాయాన్ని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకూ ప్రకటించారు. కశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, అస్సాంలలో కొత్తగా ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. బీహార్‌లో ఎయిమ్స్ తరహా సంస్థ ఏర్పాటును ప్రకటించారు. మొత్తంగా.. పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగకల్పన, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలుగా 2015-16 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పార్లమెంటుకు సమర్పించారు. తొమ్మిది నెలల కిందట కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు రూపొందించిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతల మధ్య సంతులనం సాధించేందుకు ప్రయత్నించారు. -
ఖజానాలోని ప్రతి రూపాయిలో 24 పైసలు రుణమే!
న్యూఢిల్లీ: బడ్జెట్‌ను పరిశీలిస్తే- ప్రభుత్వ ఖజానాలోని ప్రతి రూపాయిలో 24 పైసలు రుణమే కావడం విశేషం. 20 పైసలను వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. అధిక వృద్ధి రేటును ఒకపక్క ప్రకటించుకుంటున్నప్పటికీ, మరోవైపు రెవెన్యూ వసూళ్లకు సంబంధించి కఠిన పరిస్థితులను ఇది ప్రతిబింబిస్తోంది. వివరాల్లోకి వెళితే...రానున్న ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి ప్రభుత్వ స్థూల రుణ ప్రణాళిక రూ. 6 లక్షల కోట్లు. గత రుణాల రీపేమెంట్లు, వడ్డీలు పోను నికర రుణ ప్రణాళిక రూ.4.56 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర పరిమాణానికి (రూ.4.53 లక్షల కోట్లు) దాదాపు ఇది సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా స్థూల రుణ ప్రణాళిక రూ. 6 లక్షల కోట్లు అయినప్పటికీ, వాస్తవంగా రూ.5.92 లక్షల కోట్లనే సమీకరిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్ పేర్కొంది. ద్రవ్యలోటును పూడ్చుకోడానికి సంబంధించి టీ-బిల్స్, ఇతర ఇన్‌స్ట్రమెంట్ల ద్వారా ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలను సమీకరిస్తుంది. -
ఈ దేశాల్లో ‘చెత్త’శుద్ధి భేష్!
న్యూఢిల్లీ: భారత్‌లో బహిరంగ విసర్జన చేస్తున్నవారి సంఖ్య... 60 కోట్లు ఇది దేశ జనాభాలో దాదాపు.. 48 శాతం! ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించిన వాస్తవమిది. అంతేనా దేశంలో ఏ రాష్ట్రానికి, ఏ పట్టణానికి వెళ్లినా ఎక్కడ చూసినా చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణం. ఇక బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో టాయిలెట్లకు వెళ్లిన మరుక్షణమే ముక్కు మూసుకొని బయటపడాల్సిందే! ఈ పరిస్థితిని మార్చేందుకు మోదీ సర్కారు చర్యలు చేపడుతోంది. ‘స్వచ్ఛ భారత్’ను ఓ యుద్ధంలా ముం దుకు తీసుకువె ళ్తోంది. తాజా బడ్జెట్లోదీనికి పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పరిశుభ్రమైన దేశాలుగా ఆసియాలోని కొన్ని దేశాలు పేరొందాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది..? ఆ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి..? వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటి..? ఓసారి చూద్దాం సింగపూర్.. శుభ్రత, పరిశుభ్రత! ఆగ్నేయాసియాలో అతిచిన్న దేశమైన సింగపూర్ పరిశుభ్రతకు పెట్టింది పేరు. పారిశుద్ధ్యానికి అక్కడి ప్రభుత్వం ఎప్పట్నుంచో పెద్దపీట వేస్తోంది. 1967లోనే ‘సింగపూర్ క్లీన్ క్యాంపెయిన్’ చేపట్టింది. పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు, నిబంధనలను నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం కనిపించేలా సింగపూర్‌ను ‘గార్డెన్ సిటీ’గా మార్చే దిశగా సాగుతోంది. నగరంలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందిస్తోంది. వాతావరణ పరిరక్షణకు చాలా ఏళ్ల నుంచే మూడు ‘ఆర్’ల(రెడ్యూస్-తగ్గించు, రీయూజ్-పునర్వినియోగం, రీసైకిల్-పునరుత్పాదన) విధానాన్ని అమలు చేస్తోంది. జపాన్.. ప్రజల జీవితాల్లో ఓ భాగం పరిశుభ్రత అనేది ఈ దేశ ప్రజల జీవితాల్లో ఒక భాగం. జీవితాల్లోనే కాదు ఆధ్యాత్మికంగానూ దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ‘షింటోయిజం’లో పరిశుభ్రత ఆవశ్యకతను నొక్కిచెప్పారు. మీజీ చక్రవర్తి పాలన (1868-1912) సమయంలోనే ‘నిర్మల జపాన్’ను ఉద్యమంగా చేపట్టారు. పరిశుభ్రతను జాతీయవాదంతో సమానంగా గౌరవించారు. ఈ దేశంలోని స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు కలసి టాయిలెట్లను క్లీన్ చేసే కార్యక్రమం నిరాటంకంగా సాగుతుంది. ప్రజల దైనందిన జీవితాల్లోనూ ‘క్లీన్ అండ్ గ్రీన్ విడదీయరాని భాగం. జపాన్‌లో చాలా ఇళ్లలో ముఖం కడుక్కునేందుకు, పళ్లు తోముకునేందుకు, స్నానానికి, టాయిలెట్లకు వేర్వేరు గదులు ఉంటాయి. దక్షిణ కొరియా.. ప్రజల భాగస్వామ్యం దేశంలో ప్రజల జీవన నాణ్యతా ప్రమాణాలు గణనీయంగా పెంచేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ఐదేళ్ల ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేసింది. గ్రామీణ ప్రాంతాలను సుసంపన్నం చేసేందుకు చేపట్టిన ‘న్యూ విలేజ్’ ఉద్యమంలో క్లీన్ అండ్ గ్రీన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. లీకేజీలకు తావు లేకుండా మురుగునీటి వ్యవస్థలను పక్కాగా నిర్వహిస్తోంది. ఘన వ్యర్థాల నిర్వహణకు పర్యావరణ శాఖ 2002-2011కు సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో చెత్తాచెదారాన్ని ప్రభుత్వమే సేకరించి రీసైకిల్ చేస్తోంది. -
సేవా పన్నుల మోత
- 14 శాతానికి సర్వీస్ ట్యాక్స్ పెంపు న్యూఢిల్లీ: వేతన జీవులకు ఆదాయ పన్ను పరంగా పెద్ద ఊరటనివ్వని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. సేవా పన్నుల పెంపు ద్వారా అందరిపైనా మరింత భారం మోపారు. ప్రస్తుతం 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్, విద్యా సెస్సును కలిపి మొత్తం రౌండ్ ఫిగరు 14 శాతం చేశారు. దీంతో ఇకపై రెస్టారెంట్లలో తిన్నా, హోటళ్లలో ఉన్నా, విమాన ప్రయాణాలు చేసినా, బ్యూటీ పార్లర్లకెళ్లినా మరింత అధికంగా చెల్లించాల్సి రానుంది. ఇక కేబుల్.. డీటీహెచ్ సేవలు, కొరియర్ సర్వీసులు, క్రెడిట్..డెబిట్ కార్డు సంబంధిత సేవలు, దుస్తుల డ్రై క్లీనింగ్ మొదలైనవి కూడా భారం కానున్నాయి. మరోవైపు, స్టాక్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్మెంట్, బీమా సేవలతో పాటు ఇతరుల నుంచి పొందే చాలా మటుకు సర్వీసులు ప్రియం కానున్నాయి. అయితే, కొన్ని ఉత్పత్తుల ప్రీ కూలింగ్, రిటైల్ ప్యాకింగ్, లేబులింగ్ మొదలైన వాటిని సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించడంతో ప్యాకేజ్డ్ ఫ్రూట్స్, కూరగాయల రేట్లు కొంత తగ్గనున్నాయి. పేషెంట్లకు అందించే అంబులెన్స్ సర్వీసులను సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఇక, మ్యూజియాలు, జూ, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు మొదలైన వాటి సందర్శకులకు కూడా సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, అమ్యూజ్మెంట్ పార్కులు.. థీమ్ పార్కులు లాంటి వాటిని సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి తేవడంతో వీటిని సందర్శించడం మరికాస్త ఖరీదైన వ్యవహారం కానుంది. లాటరీ టికెట్లను సేవా పన్ను పరిధిలోకి చేర్చడంతో ఇకపై వీటి ధరలు పెరగనున్నాయి. ధూమపాన ప్రియులకు వాత..: ఎప్పటిలాగానే ఈ బడ్జెట్లో కూడా పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు వాత తప్పలేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు ఆర్థిక మంత్రి. 65 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవుండే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 25 శాతం మేర, మిగతా వాటిపై 15 శాతం మేర పెంచారు. ఇక ఎక్సైజ్ సుంకాన్ని టన్నుకు రూ. 1,000కి పెంచడంతో సిమెంటు రేట్లు మరింత పెరగనున్నాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్‌లు మొదలైన వాటిపైనా సుంకాన్ని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. అలాగే ఫ్లేవర్డ్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ వాటర్ సైతం మరింత ప్రియం అవుతాయి. ఫోన్ బిల్లులూ భారం..: సర్వీస్ ట్యాక్స్ పెంపు భారాన్ని టెలికం కంపెనీలు వినియోగదారులకు బదలాయించనుండటంతో ఇకపై ఫోన్ బిల్లులూ భారం కానున్నాయి. దీనివల్ల బిల్లులు అరశాతం మేర పెరగవచ్చని జీఎస్ఎం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ తెలిపారు. కొంత ఊరట..: దేశీయంగా తయారు చేసే మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ/ఎల్సీడీ ప్యానెల్స్, ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ ల్యాంప్స్‌పైనా ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ధరలు తగ్గనున్నాయి. వివిధ పరికరాలపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో రిఫ్రిజిరేటర్లు, సోలార్ వాటర్ హీటర్ల ధరలు తగ్గనున్నాయి. అగర్‌బత్తీలపై సుంకాన్ని ఎత్తేయడంతో చవకగా లభించనున్నాయి. -
20 వేల కోట్లతో ముద్ర బ్యాంక్
- ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణసౌకర్యం న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రాథమికంగా రూ. 20 వేలకోట్ల కార్పస్ నిధితో ముద్ర బ్యాంక్ (మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ఈ బడ్జెట్లో ప్రకటించింది. ఇందులో రూ.3వేల కోట్ల మేర కార్పస్ నిధిని క్రెడిట్ గ్యారంటీకింద కేటాయిస్తారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఈ ఆర్థిక సంస్థద్వారా మైక్రోఫైనాన్స్ సంస్థలకు రీఫైనాన్స్ చేస్తారు. వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకు రుణసౌకర్యం కల్పిస్తారు. రుణాల మంజూరులో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు నడిపే ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో 5.77 కోట్ల చిన్నతరహా వ్యాపార యూనిట్లు ఉన్నట్లు గుర్తించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వీటిలో సుమారు 62 శాతం మేర ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల చేతిలోనే ఉన్నాయని, అందులోనూ వ్యక్తిగతంగా నడిపేవే ఎక్కువని తెలిపారు. అయితే వీరు తమ వ్యాపార అవసరాలకోసం డబ్బు కొరత ఎదుర్కొంటున్నారని, ఇతర మార్గాలను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీరిని ఆదుకునేందుకే ముద్ర బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. -
ఉద్యోగుల ఆశలపై నీళ్లు
- ఆదాయ పన్ను బేసిక్ లిమిట్ జోలికెళ్లని ఆర్థిక మంత్రి - ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పెంపు - వృద్ధులు, వికలాంగులకు మరిన్ని పన్ను రాయితీలు - అనాదిగా వస్తున్న సంపద పన్ను రద్దు సాక్షి, బిజినెస్ విభాగం: కోట్ల మంది నెల జీతంపైనే ఆధారపడ్డ మన దేశంలో ప్రతి ఏటా బడ్జెట్‌కు ముందు ప్రధానంగా చర్చకు వచ్చేది ఆదాయపు పన్ను గురించే. ‘‘ఈ సారి బేసిక్ లిమిట్ పెంచుతారా?’’ ప్రతి వ్యక్తీ బడ్జెట్‌కు ముందు అడిగే ప్రశ్న ఇదొక్కటే. ఎందుకంటే బేసిక్ లిమిట్ పెంచితే జీతం డబ్బుల్లో కొంత జేబులో మిగిలే అవకాశముంటుంది. అలా కాకుండా పన్ను మినహాయింపులు పొందేందుకు వీలుగా పొదుపు పరిమితులను పెంచినా, పన్ను లేని బాండ్లు ప్రవేశపెట్టినా... ఇలాంటివెన్ని చేసినా సామాన్యుడి నుంచి ప్రతిస్పందన ఉండదు. ఎందుకంటే అవన్నీ జేబులో డబ్బులుండి అదనంగా ఖర్చు చేయగలిగిన వారికే కనక. కాకుంటే ఈ సారి బడ్జెట్లో బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచవచ్చని ఎందరు అంచనా వేసినా... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఆ జోలికెళ్లలేదు. అయితే నెలకు కోటి రూపాయల ఆదాయం దాటిన వారికి మాత్రం 2 శాతం సర్‌చార్జి వడ్డించారు. ఇప్పటిదాకా 10 శాతంగా ఉన్న సర్‌చార్జీని 12 శాతానికి పెంచారు. మధ్య తరగతి వేతన జీవులకు జైట్లీ ఇచ్చిన ఉపశమనాలు ఒకటిరెండే. వాటిలో మొదటిది జీతంలో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్‌గా చెల్లించే మొత్తంలో పన్ను మినహాయింపు లభించే మొత్తం ఇప్పటిదాకా నెలకు రూ.800గా ఉంది. దీన్ని రెట్టింపు చేశారు. ఇకపై రవాణా భత్యంగా కంపెనీ ఎంత చెల్లించినా గరిష్టం గా నెలకు రూ.1600 వరకు పన్ను మినహాయింపు లభిస్తుందన్న మాట. రెండోది... హెల్త్ ఇన్సూరెన్స్‌లపై కట్టే ప్రీమియానికిచ్చే మినహాయింపు పరిమితిని పెంచారు. దీనివల్ల అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని, దేశంలో అందరికీ ఆరోగ్య భద్రత లభిస్తుందని చెప్పారు. ఆ పెంపు ఏ మేరకు చేశారంటే... - ఆరోగ్య బీమా కోసం ఎంత మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించినా ఇప్పటిదాకా రూ.15,000కు మాత్రమే పన్ను మినహాయింపు వర్తించేది. దీన్నిపుడు రూ.25,000కు పెంచారు. - 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.20,000 నుంచి రూ.30,000కు పెంచారు. - 80 ఏళ్లు దాటిన వృద్ధులు గనక హెల్త్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయని పక్షంలో వారికి రూ.30,000 వరకు వివిధ చికిత్సలకయ్యే వ్యయానికి మినహాయింపు వర్తింపజేస్తారు. - 80 ఏళ్లు దాటిన వారు కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్స వ్యయాన్ని ప్రస్తుతం రూ.60,000 వరకు మినహాయింపునకు అనుమతిస్తున్నారు. దీన్నిపుడు రూ.80,000కు పెంచారు. - వికలాంగులకు ప్రస్తుతమనున్న మినహాయింపు పరిమితిని మరో రూ. 25,000 పెంచారు. పెన్షన్ ఫండ్ మినహాయింపు పెంపు.. ఆరోగ్య బీమాతో పాటు పెన్షన్ ఫండ్‌లో గానీ, కొత్త పింఛను పథకంలో గానీ ఇన్వెస్ట్ చేస్తే ఇచ్చే మిన హాయింపు మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. ఇది కాక అదనంగా కొత్త పింఛను పథకంలో గనక ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80సీసీడీ కింద మరో రూ.50,000 మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. అదే వృద్ధులకైతే వరిష్ట బీమా యోజన కింద సేవా పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఇక ఇటీవలే బాలికల కోసం ప్రవేశపెట్టిన సుకన్య-సమృద్ధి పథకానికి ఇప్పటికే పన్ను మినహాయింపు ఉంది. అయితే ఇకపై లబ్ధిదారులకు చేసే చెల్లింపులు, సదరు డిపాజిట్లపై వడ్డీకి కూడా మినహాయింపు లభిస్తుంది. మొత్తంగా వివిధ సెక్షన్ల కింద తాను రూ.4,44,200 మినహాయిస్తున్నట్లు తెలియజేశారు. సంపద పన్ను రద్దు... సర్‌చార్జీ వడ్డన సంపద పన్నును (వెల్త్ ట్యాక్స్) జైట్లీ రద్దు చేశారు. నిజానికి ఇదో చిత్రమైన పన్ను. ఏళ్ల తరబడి సవరించకుండా కొనసాగుతున్న అర్థం లేని పన్ను. దీనిప్రకారం ఏ వ్యక్తయినా రూ.30 లక్షలకన్నా ఎక్కువ విలువైన ఆస్తిని కలిగి ఉంటే దానిపై ఒక శాతం సంపద పన్ను చెల్లించాలి. నిజానికిది ఎప్పుడో భూముల విలువలు పాతాళంలో ఉన్నపుడు తెచ్చిన పన్ను. కానీ ఇపుడు పల్లెటూళ్లలో సైతం ఎకరా రూ.30 లక్షలపైనే పలుకుతోంది. మరి రైతులు తమ భూముల విలువలపైనా పన్నులు చెల్లించాలా? చట్ట ప్రకారం నిజానికి చెల్లించాల్సి ఉన్నా... ఇది అర్థం లేని పన్ను కనకనే అధికారులు కూడా మామూలు వ్యక్తుల విషయంలో దీన్ని విధించే సాహసమేదీ చెయ్యలేదు. అందుకే ఈ పన్నును తొలగిస్తున్నట్లు జైట్లీ స్పష్టం చేశారు. దీని బదులు నెలకు రూ.కోటికన్నా ఎక్కువ ఆదాయం ఉండే వ్యక్తులు, హిందూ కుటుంబాలు, సంస్థలు, కో-ఆపరేటివ్ సొసైటీలు, స్థానిక సంస్థల ఆదాయంపై 2 శాతం సర్‌ఛార్జీ విధించారు. ప్రస్తుతం ఈ సర్‌ఛార్జీ 10 శాతంగా ఉంది. నిజానికి రూ.కోటి దాటి ఆదాయం ఉంటోంది కనక వీరు అత్యధిక శాతం... అంటే 30 శాతం శ్లాబ్‌లో ఉంటారు. ఆ 30పై 10 శాతం సర్‌ఛార్జీ చెల్లిస్తున్నారు. ఇపుడది 12 శాతం అయినట్లన్న మాట. -
మేక్ ఇన్ ఇండియాకు ఊతం
- పరిశ్రమే ప్రధానం న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. తద్వారా దేశీ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, మరిన్ని ఉద్యోగాల కల్పనకు తోడ్పాటునందించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కార్పొరేట్ పన్నును ఇతర దేశాలతో పోటీపడేలా 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించడంతో పాటు కొన్నింటిపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గించారు. మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి, దేశీ తయారీ పరిశ్రమకు ఊపుతెచ్చారు. మొబైళ్లు, ట్యాబెట్లను దిగుమతి చేసుకునే బదులు ఇక్కడ ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించేలా సుంకాల్ని సవరించారు. ఇన్సులేటెడ్ వైర్లు..కేబుల్స్, ఫ్రిజ్‌లలో కంప్రెసర్ భాగాలు, ఎరువుల తయారీలో ఉపయోగించే సల్ఫ్యూరిక్ యాసిడ్ మొదలైన వాటిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించారు. ఇక లేథ్ మెషీన్లలో ఉపయోగించే కొన్ని ముడి వస్తువులపై కస్టమ్స్ సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి, మెడికల్ వీడియో ఎండోస్కోప్లపై 5% నుంచి 2.5 శాతానికి తగ్గుతాయి. అలాగే, స్మార్ట్ కార్డులకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మాడ్యూల్స్ తయారీలో ఉపయోగించే వేఫర్లు మొదలైన వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 6 శాతానికి కుదించారు ఆర్థిక మంత్రి. పేస్మేకర్ల తయారీలో ఉపయోగపడే నిర్దిష్ట ముడి వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేశారు. ఇనుము, ఉక్కు, రాగి, అల్యూమినియం మొదలైన మెటల్ స్క్రాప్‌పై ప్రత్యేక అదనపు సుంకాన్ని (ఎస్ఏడీ) 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇక, ఎల్ఈడీ లైట్లు తయారీలో ఉపయోగపడే ముడివస్తువులపై నాలుగు శాతంగా ఉన్న ఎస్ఏడీని పూర్తిగా తొలగించారు. సాంకేతిక అంశాలపరంగా చిన్న తరహా సంస్థలు ఎదుర్కొనే సమస్యలను కూడా పరిష్కరించడంపై జైట్లీ దృష్టి పెట్టారు. టెక్నికల్ సర్వీసులకు సంబంధించిన రాయల్టీపై పన్ను రేటును 25 శాతం నుంచి 10 శాతానికి కుదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 దాకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నోటిఫైడ్ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసే తయారీ యూనిట్లకు అదనంగా 15 శాతం మేర పెట్టుబడిపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు మరో 15 శాతం మేర తరుగుద ల చూపించుకునే వెసులుబాటు కల్పించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ విషయంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్లాంటు, యంత్రాలపై అదనంగా మరో 20 శాతం మేర తరుగుదల చూపించుకునే వీలు కల్పించారు. వీటన్నింటికంటే మించి దేశీయ మౌలిక రంగానికి కేటాయింపులు పెంచడం ద్వారా దేశీయ ఉత్పాదక రంగానికి ఊపుతెచ్చే ప్రయత్నం చేశారు. కాగా.. దేశీయ తయారీ సంస్థలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దిగుమతి చేసుకున్న వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీని పది శాతం నుంచి 40 శాతానికి పెంచారు. -
ప్రణాళికా వ్యయంలో లక్ష కోట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: భారీగా పెరుగుతున్న ద్రవ్యలోటును తగ్గించుకునే దిశగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రణాళికా వ్యయం రూ. 5.75 లక్షల కోట్లలో రూ. 1,07,066 కోట్లకు ప్రభుత్వం కోత పెట్టంది. కోత తర్వాత ఈ వ్యయం రూ. 4,76,934 కోట్లకు చేరింది. సవరించిన బడ్జెట్ అంచనాలను అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2015-16 ప్రణాళికావ్యయ బడ్జెట్ అంచనాను రూ. 4,65,277 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయ బడ్జెట్ అంచనాను రూ. 13,12,200 కోట్లుగా నిర్ధారించారు. 2013-14 వాస్తవ ప్రణాళికావ్యయం రూ. 4,53,327 కోట్లు. ఇది ఆ ఏడాది ప్రణాళికావ్యయ అంచనా రూ. 5,55,322 కోట్లు.. సవరించిన అంచనా రూ. 4,75, 532 కోట్ల కన్నా చాలా తక్కువ. పోర్టుల కార్పొరేటీకరణ ! ప్రభుత్వ రంగంలోని భారీ పోర్టుల కార్పొరేటీకరణకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని జైట్లీ తెలిపారు. పోర్టులు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, వినియోగంలో లేని తమ భూములను నుంచి ఆదాయం పొందాల్సిన అవసరముందని, ఇందుకు వీలుగా కంపెనీల చట్టం కింద కంపెనీలుగా మారేందుకు వాటికి ప్రోత్సాహమివ్వాలని అన్నారు. పోర్టులను కార్పొరేటీకరించే ప్రభుత్వ యత్నాలకు నిరసనగా ఈ నెల 9న నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు పోర్టులకు చెందిన కార్మిక సంఘాలు ప్రకటించాయి. తీర భద్రతకు 710 కోట్లు తీరప్రాంత భద్రతకు ప్రభుత్వం భారీగా నిధుల కేటాయించింది. 7,517 కిలోమీటర్ల తీర ప్రాంతంలో చట్టవిరుద్ధ కార్యక్రమాలను అరికట్టేందుకు సంచార చెక్ పోస్ట్‌ల ఏర్పాటు కోసం రూ.710 కోట్లు కేటాయించినట్లు జైట్లీ తెలిపారు. గత ఏడాది దీని కోసం ఖర్చుపెట్టిన రూ. 39.37 కోట్ల కంటే ఈ మొత్తం 18 రెట్లు ఎక్కువ. -
‘ఆయుష్’మాన్ భవ!
- సంప్రదాయ వైద్య విధానాలకు ప్రోత్సాహం - బడ్జెట్లో రూ.1,214 కోట్ల కేటాయింపు - దేశంలో కొత్తగా ఆరు ఎయిమ్స్‌లు - ఆరోగ్యశాఖకు తగ్గిన నిధులు - కిందటేడాది రూ.35,163 కోట్లు.. ఈసారి రూ.33,150 కోట్లు న్యూఢిల్లీ: ఆరోగ్య శాఖపై బడ్జెట్లో కాస్త చిన్నచూపు చూసిన కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖకు మాత్రం పెద్దపీటే వేసింది! కిందటిసారితో పోలిస్తే ఆరోగ్యశాఖకు కేటాయింపులను స్వల్పంగా(5.7 శాతం) తగ్గించారు. 2014-15 బడ్జెట్లో ఈ రంగానికి రూ.35,163 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.33,150 కోట్లతో సరిపుచ్చారు. ఇక దేశీయ సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించే దిశగా ఆయుష్(ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) శాఖకు రూ.1,214 కోట్లు ప్రతిపాదించారు. ఇన్నాళ్లూ ఆరోగ్య శాఖలో భాగంగా ఉన్న ఆయుష్‌ను మోదీ ప్రభుత్వం కిందటేడాదే ప్రత్యేక శాఖగా విడదీసిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, అస్సాం, తమిళనాడులో కొత్తగా ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)లు, బిహార్‌లో ఎయిమ్స్ తరహా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఆరోగ్య శాఖ పరిధిలోని హెల్త్ రీసెర్చ్ విభాగానికి కిందటేడాదితో పోలిస్తే 9.2 శాతం అధికంగా నిధులు కేటాయించారు. కిందటి బడ్జెట్లో దీనికి రూ.932 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.1,018.17 కోట్లు ప్రతిపాదించారు. ఇక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.29,653 కోట్లు (కిందటిసారి రూ.29,042) కేటాయించారు. ఎయిడ్స్ నియంత్రణ విభాగానికి కిందటిసారితో పోలిస్తే 7.4 శాతం నిధులు పెంచుతూ రూ.1,397 కోట్లు కేటాయించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌కు కింద టిసారి రూ.1,565 కోట్లు కేటాయించగా.. 2015-16కుగాను రూ.1,470 కోట్లు ప్రతిపాదించారు. 2,200కుపైగా పడకల సామర్థ్యం గల ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజూ 8 వేల మంది రోగులకు చికిత్స అందిస్తారు. ఎయిమ్స్ పక్కనే ఉన్న సఫ్దర్‌గంజ్ ఆసుపత్రికి బడ్జెట్లో రూ.520 కోట్లు కేటాయించారు. రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి కిందటిసారి రూ.322.77 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.400 కోట్లు ప్రతిపాదించారు. చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు రూ.650కోట్లు కేటాయించారు. సముచిత కేటాయింపులు: ఆరోగ్య మంత్రి నడ్డా ఆరోగ్యరంగానికి బడ్జెట్లో సమతుల కేటాయింపులు జరిపారని ఆ శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘ఇది ప్రజానుకూల, పురోగమన బడ్జెట్. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఆరోగ్య రంగానికి సముచిత కేటాయింపులు చేశారు’ అని అన్నారు. ‘ఎయిమ్స్‌ల ఏర్పాటుతో ఆయా రాష్ట్రాలు, పొరుగు ప్రాంతాల్లో మరిన్ని ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సంస్థలను మా శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. తాజా బడ్జెట్లో పేర్కొన్నట్టుగా 6 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తే దేశంలో వీటి సంఖ్య 14కు చేరనుంది. కాగా, బడ్జెట్లో ఫార్మా రంగాన్ని విస్మరించారని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. జైట్లీ సమతుల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆరోగ్యరంగం కోణంలో చూస్తే ఆయన చేసిన కేటాయింపులు సరిపోవని అపోలో ఆస్పత్రుల చైర్మన్ పీసీ రెడ్డి పేర్కొన్నారు. -
పీఎఫ్ వాటా చెల్లింపు ఇక ఐచ్ఛికం
- చిరుద్యోగులకు వెసులుబాటు న్యూఢిల్లీ: చిరుద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా నెలవారీ వేతనం పొందుతున్న కార్మికులు ఇకమీదట ఈపీఎఫ్(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కు తమ వంతు పీఎఫ్ వాటాను చెల్లించడం ఐచ్ఛికం కానుంది. అయితే యాజమాన్యాలు మాత్రం ఈ పథకానికి తమ వంతు వాటాను చెల్లించాల్సిందే. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం ప్రకటించారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనల్లో వేతన పరిమితి ఎంతనేది నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రస్తుతం ఉద్యోగులందరూ బేసిక్ శాలరీ, డీఏతోసహా తమ బేసిక్ వేతనంలో 12 శాతాన్ని పీఎఫ్ వాటాగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా యాజమాన్యాలు తమ వంతు వాటాను చెల్లిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకం, కొత్త పెన్షన్ పథకం(ఎన్పీఎఫ్)లలో ఏదో ఒకదానిని ఎంచుకునే సౌలభ్యం సంఘటితరంగ ఉద్యోగులకు లభించనుంది. అదేవిధంగా ఈఎస్ఐ కల్పించే ఆరోగ్య సదుపాయాలు లేదా బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ గుర్తింపు పొందిన ఆరోగ్య బీమాలలో ఏదో ఒకదానిని ఎంచుకునే వెసులుబాటు సైతం వారికి లభించనుంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం సవరిస్తుందని జైట్లీ తెలిపారు. ఈపీఎఫ్‌వో సామాజిక భద్రతా పథకాల కింద ప్రస్తుతం ఐదుకోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. ఈపీఎఫ్, పీపీఎఫ్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని కారణంగా పేరుకుపోయిన రూ.తొమ్మిదివేల కోట్లతో(ఈపీఎఫ్‌లో రూ.6 వేల కోట్లు, పీపీఎఫ్‌లో రూ.3 వేల కోట్లు) వృద్ధుల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తాన్ని వృద్ధాప్య పింఛన్లు పొందేవారు, బీపీఎల్ కార్డుదారులు, చిన్న, సన్నకారు రైతులు, ఇతరు నిమ్నవర్గాలకు చెందినవారికి ప్రీమియం చెల్లింపులకోసం వినియోగిస్తారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టాల్లో సమూల మార్పులను ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ శాలరీని ఏ విధంగా పొందాలో వారే నిర్ణయించుకోవచ్చు. సంబంధితులందరితో చర్చించిన అనంతరం ఈ చట్టాన్ని సవరించనున్నట్టు జైట్లీ తెలిపారు. -
విద్యకు 2 శాతం కోత
- చదువులకు మొత్తం రూ. 69,074 కోట్లు - ఆంధ్రప్రదేశ్‌లో ఐఐఎం ఏర్పాటు - ఉన్నత విద్యకు ఊతం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో విద్యారంగానికి నిధులను గత ఏడాదికంటే 2 శాతం తగ్గించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) సహా పలు రాష్ట్రాల్లో ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇతర కేంద్రీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. తాజా బడ్జెట్లో పాఠశాల, ఉన్నత విద్యకు కలిపి మొత్తం రూ.69,074 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ రంగానికి కేటాయించిన నిధుల సవరించిన మొత్తం రూ.70,505 కోట్ల కంటే ఇది 2.02 శాతం తక్కువ. సవరించని మొత్తంతో పోలిస్తే 16.54 శాతం తక్కువ. తాజా బడ్జెట్(2015-16)లో పాఠశాల విద్యకు గత ఏడాది కంటే 9.79 శాతం నిధులను తగ్గించి రూ. 42,219 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యకు ప్రాధాన్యమిచ్చి గత ఏడాదికంటే 13.31 శాతం పెంచి రూ.26,855 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి పలు రాష్ట్రాల్లో కేంద్ర విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. ప్రతి రాష్ట్రంలో ఒక కేంద్రీయ విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని గత ఏడాది జూలై నాటి బడ్జెట్ ప్రసంగంలోనే సూచనప్రాయంగా చెప్పానని గుర్తు చేశారు. ధన్‌బాద్(జార్ఖండ్)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ స్థాయిని పెంచి పూర్తిస్థాయి ఐఐటీగా మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కేరళలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ స్థాయిని పెంచి యూనివర్సిటీ ఆఫ్ డిజేబిలిటీ స్టడీస్ అండ్ రిహాబిలిటేషన్గా మార్చాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. బిహార్‌లో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) తరహా సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించానన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాలు, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమ్ ద్వారా అమలు చేస్తున్న విద్యా రుణ పథకాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని జైట్లీ ప్రతిపాదించారు. నిధుల కొరత వల్ల ఏ విద్యార్థీ ఉన్నత విద్యకు దూరంగా కాకుండా చూస్తామన్నారు. స్కూలు సర్టిఫికెట్ లేని మైనారిటీ యువత ఉపాధి పొందేందుకు ‘నయీ మంజిల్’ పేరుతో సమగ్ర విద్యా, ఉపాధి పథకాన్ని ఈ ఏడాదిలో ప్రారంభిస్తామన్నారు. ప్రతి విద్యార్థికి 5.కి.మీ. దూరంలో సీనియర్ సెకండరీ స్కూలు అందుబాటులో ఉండేలా 80 వేల సెకండరీ స్కూళ్ల స్థాయిని సీనియర్ సెకండరీ స్థాయికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. జూనియర్/మిడిల్ స్కూళ్ల స్థాయి పెంచడం, కొత్త వాటిని ఏర్పాటు చేయడం ద్వారా మరో 75 వేల సీనియర్ సెకండరీ స్కూళ్లను తేవాలనుకుంటున్నామన్నారు. కాగా, నిధులు తగ్గినప్పటికీ విద్య బడ్జెట్‌పై మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉందని, ఉన్నత విద్యకు నిధుల పెంపు, నవకల్పనలకు ప్రాధాన్యమిచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుపై జైట్లీ ప్రతిపాదనలు.. రాష్ట్రాలు సంస్థలు ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్ ఐఐఎం కర్ణాటక ఐఐటీ జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడు,హిమాచల్ ప్రదేశ్, అస్సాం ఎయిమ్స్ నాగాలాండ్, ఒడిశా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పంజాబ్(అమృత్సర్) పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్, రీసెర్చ్, ఎడ్యుకేషన్ మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అరుణాచల్ ప్రదేశ్(ఈశాన్య రాష్ట్రాల కోసం) సెంటర్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ హరియాణా, ఉత్తరాఖండ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ -
కొనుగోలు శక్తిలో భారత్ ది 3వ స్థానం
న్యూఢిల్లీ: కొనుగోలు శక్తి పరంగా చూస్తే భారత్ ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, జీడీపీ పరంగా చూస్తే 9వ ఆర్థిక వ్యవస్థ. ఆ కొనుగోలు శక్తే ప్రపంచదేశాలను మన వైపు చూసేలా చేస్తోంది. 2030 నాటికి 836 లక్షల కోట్లతో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రపంచబ్యాంకు అంచనా. రోడ్ నెట్వర్క్, ఔషధాల ఉత్పత్తిలోనూ మనది 3వ స్థానం. -
రహదారులకు రూ. 42 వేల కోట్లు
- విజయవాడ - రాంచీ రహదారికి కేటాయింపులు - పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ పన్నులో రూ. 4వరకు రోడ్డు సెస్! న్యూఢిల్లీ: మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తున్న రంగాల్లో ఒకటైన రహదారుల అభివృద్ధికి ఈ బడ్జెట్లో సముచిత నిధులు లభించాయి. గత బడ్జెట్ కేటాయింపుల కన్నా 48% అధికంగా.. రూ. 42,913 కోట్లను ఈ రంగానికి కేటాయించారు. ‘మన అభివృద్ధి లక్ష్యాలకు సరితూగే స్థాయిలో మన మౌలిక వసతులు లేవు. రహదారుల అభివృద్ధికి గత బడ్జెట్ కేటాయింపుల(రూ. 28,881 కోట్లు) కన్నా రూ. 14, 031 కోట్లను అధికంగా కేటాయించాం. స్థూల బడ్జెటరీ మద్దతులో భాగంగా రైల్వేలకు అదనంగా రూ. 10,050 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, జార్ఖండ్‌లోని రాంచీల మధ్య రహదారి అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేటాయింపులు జరిపారు. స్వర్ణ చతుర్భుజి పథకంలో భాగమైన రహదారుల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆరు లేన్ల రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద పలు మార్గాల్లో రెండు లేన్ల నిర్మాణం, జాతీయ రహదారుల అభివృద్ధి, ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం మొదలైనవాటికి కూడా కేటాయింపులు జరిపారు. రోడ్లు, రైళ్లు, సాగునీటి ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం పన్ను రహిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ గురించి ఆలోచిస్తున్నామని జైట్లీ వెల్లడించారు. పెట్రోలు, డీజిల్‌లపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పన్నులో లీటరుకు రూ. 4 వరకు రోడ్డు సెస్‌గా మార్చాలన్న ప్రతిపాదన ఉందని జైట్లీ తెలిపారు. దీనివల్ల ఈ రంగానికి అదనంగా రూ. 40 వేల కోట్లు సమకూరుతాయన్నారు. సరిహద్దుల్లో రహదారుల కోసం భారీ కేటాయింపులు లడఖ్‌లోని కారాకోరం పాయింట్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఫిష్ పాయింట్ వరకు గల 4,056 కి.మీ. ఇండో-చైనా సరిహద్దు వెంబడి రోడ్ల నిర్మాణానికి 2015-16కు గాను రూ. 300 కోట్లను కేటాయించారు. గతేడాది కేటాయించిన మొత్తం(రూ. 156,47 కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు గల 3,323 కి.మీ. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి రోడ్ల నిర్మాణం కోసం రూ. 320 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం రూ. 300 కోట్లు కేటాయించగా రూ. 165.22 కోట్లను వినియోగించారు. ఇండో-భూటాన్ సరిహద్దులో రోడ్ల నిర్మాణం కోసం రూ. 50 కోట్లు(గతేడాది కేవలం రూ. లక్ష) కేటాయించారు. 1,643 కి.మీ. ఇండో- మయన్మార్ సరిహద్దు వెంట రహదారుల నిర్మాణం కోసం రూ. 20 కోట్లను(గతేడాది రూ. 11.12 కోట్లు) సమకూర్చనున్నారు. -
ఎరువుల సబ్సిడీ రూ.2వేల కోట్లు పెంపు
న్యూఢిల్లీ: ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడీని రూ. 2 వేల కోట్లు పెంచారు. దీంతో మొత్తం ఎరువుల సబ్సిడీ రూ.72,968 కోట్లకు చేరుకుంది. రూ.38,200 కోట్లు దేశీయంగా ఉత్పత్తి చేసే యూరియాకు కేటాయించారు. రూ. 12, 300కోట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాకు కేటాయించారు. రూ. 22,468 కోట్లు నియంత్రణ లేని పాస్ఫరస్, పొటాషియం ఎరువుల కోసం కేటాయించారు. -
కార్పొరేట్ల ‘రుణం తీర్చుకునే’ బడ్జెట్: సోనియా
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారు తొలిసారి పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతిచ్చిన బడా కార్పొరేట్ల ‘రుణం తీర్చుకునేలా’ (ధన్వాపసీ) ప్రభుత్వం బడ్జెట్‌ను కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించిందని దుయ్యబట్టారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్‌లు కూడా ఈ బడ్జెట్‌ను ‘ధన్వాపసీ’ కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రభుత్వ ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ వాటి సాధనకు అవసరమైన ‘రోడ్‌మ్యాప్’ బడ్జెట్లో కొరవడిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ విమర్శించారు. బిహార్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం, ఎయిమ్స్ తరహా వైద్య సంస్థను ప్రకటించినందుకు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. -
బడ్జెట్ వండింది వీరే...
న్యూఢిల్లీ : బడ్జెట్ అంటే రెండు గంటల ప్రసంగం కాదు.. దాని వెనుక బుర్రలు బద్దలు కొట్టుకునే నిపుణులు ఉంటారు. రాత్రీపగలు నెలల తరబడి అందులోనే తలమునకలయ్యే అధికారులుంటారు. ఎంతో కసరత్తు.. మరెంతో శ్రమకు ఓర్చి వారు ఈ లెక్కల పద్దుకు ఓ రూపు తెస్తారు. మరి ఈసారి బడ్జెట్ తయారీలో కీలక పాత్ర పోషించినవారి గురించి ఓసారి చూద్దామా..! 1981 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఇంతకుముందు గుజరాత్ ఆర్థిక విభాగంలో అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. బ్యాంకు సంస్కరణల్లో దిట్ట. యోగాలో కూడా నిపుణుడు. హస్కుఖ్ అదియా (కార్యదర్శి, ఆర్థిక సేవల విభాగం) తమిళనాడుకు చెందిన ఈయన ఆర్థికాంశాల్లో నిష్ణాతుడు. ఐఐఎం-అహ్మదాబాద్‌లో చదివిన అరవింద్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకానమిక్స్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల్లో పనిచేశారు. భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలపై మంచి పట్టు ఉంది. అరవింద్ సుబ్రహ్మణ్యన్ (ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు) తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. ఆ రాష్ట్రంలో విజయవంతమైన ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్), పారిశ్రామిక విధానాల రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు. అంతకుముందు ఎరువుల శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ తయారీలో విశేష అనుభవం ఉంది. శక్తికాంత దాస్ (కార్యదర్శి, రెవెన్యూ విభాగం) ఈయన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. యూపీఏ హయాంలో పనిచేసి ఇప్పుడు మోదీ టీంలో కూడా చోటుదక్కించుకున్న ఏకైక అధికారి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి దేశ సరళీకరణ విధానాల్లో కీలక పాత్ర పోషించారు. రతన్ పి వాటల్ (కార్యదర్శి, నిధుల వ్యయం విభాగం) కోల్ ఇండియాలో 10 శాతం ప్రభుత్వ వాటా విక్రయించి ఖజానాకు రూ.22,500 కోట్ల ఆదాయం సమకూర్చడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. వివిధ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు మార్గాలు వేస్తున్నారు. ఓఎన్జీసీలో కూడా 5 శాతం వాటా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరాధన జోహ్రి (కార్యదర్శి, పెట్టుబడుల ఉపసంహరణ విభాగం) రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి. మోదీ సర్కారు ఈయనను ఏరికోరి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమించింది. గతంలో రాజస్థాన్‌లో పలు సంస్కరణలకు బాటలేశారు. రాజీవ్ మెహ్రిశి (కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాలు)