న్యూఢిల్లీ: భారీగా పెరుగుతున్న ద్రవ్యలోటును తగ్గించుకునే దిశగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రణాళికా వ్యయం రూ. 5.75 లక్షల కోట్లలో రూ. 1,07,066 కోట్లకు ప్రభుత్వం కోత పెట్టంది. కోత తర్వాత ఈ వ్యయం రూ. 4,76,934 కోట్లకు చేరింది. సవరించిన బడ్జెట్ అంచనాలను అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2015-16 ప్రణాళికావ్యయ బడ్జెట్ అంచనాను రూ. 4,65,277 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయ బడ్జెట్ అంచనాను రూ. 13,12,200 కోట్లుగా నిర్ధారించారు. 2013-14 వాస్తవ ప్రణాళికావ్యయం రూ. 4,53,327 కోట్లు. ఇది ఆ ఏడాది ప్రణాళికావ్యయ అంచనా రూ. 5,55,322 కోట్లు.. సవరించిన అంచనా రూ. 4,75, 532 కోట్ల కన్నా చాలా తక్కువ.
పోర్టుల కార్పొరేటీకరణ !
ప్రభుత్వ రంగంలోని భారీ పోర్టుల కార్పొరేటీకరణకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని జైట్లీ తెలిపారు. పోర్టులు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, వినియోగంలో లేని తమ భూములను నుంచి ఆదాయం పొందాల్సిన అవసరముందని, ఇందుకు వీలుగా కంపెనీల చట్టం కింద కంపెనీలుగా మారేందుకు వాటికి ప్రోత్సాహమివ్వాలని అన్నారు. పోర్టులను కార్పొరేటీకరించే ప్రభుత్వ యత్నాలకు నిరసనగా ఈ నెల 9న నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు పోర్టులకు చెందిన కార్మిక సంఘాలు ప్రకటించాయి.
తీర భద్రతకు 710 కోట్లు
తీరప్రాంత భద్రతకు ప్రభుత్వం భారీగా నిధుల కేటాయించింది. 7,517 కిలోమీటర్ల తీర ప్రాంతంలో చట్టవిరుద్ధ కార్యక్రమాలను అరికట్టేందుకు సంచార చెక్ పోస్ట్‌ల ఏర్పాటు కోసం రూ.710 కోట్లు కేటాయించినట్లు జైట్లీ తెలిపారు. గత ఏడాది దీని కోసం ఖర్చుపెట్టిన రూ. 39.37 కోట్ల కంటే ఈ మొత్తం 18 రెట్లు ఎక్కువ.
ప్రణాళికా వ్యయంలో లక్ష కోట్ల తగ్గింపు
Published Sun, Mar 1 2015 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement