
తులం బంగారం రూ. 88కే!
అదేంటి.. బంగారం ధర 88 రూపాయలేమిటి అంటారా? నిజమే..!
సాక్షి, బిజినెస్ బ్యూరో: అదేంటి.. బంగారం ధర 88 రూపాయలేమిటి అంటారా? నిజమే..! కానీ అది మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లో. అప్పట్లో పది గ్రాముల బంగారం ధర కేవలం రూ. 88.62 మాత్రమే. ఇప్పుడేమో ఏకంగా రూ. 27,000కు పైనే ఉంది. అంటే 67 ఏళ్లలో 300 రెట్లకుపైగా పెరిగింది. మరో విశేషం ఏమిటంటే.. 2013 ఆగస్టులో బంగారం రూ. 35,574 వరకూ వెళ్లింది.