కార్పొరేట్ల ‘రుణం తీర్చుకునే’ బడ్జెట్: సోనియా
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారు తొలిసారి పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతిచ్చిన బడా కార్పొరేట్ల ‘రుణం తీర్చుకునేలా’ (ధన్‌వాపసీ) ప్రభుత్వం బడ్జెట్‌ను కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించిందని దుయ్యబట్టారు.
లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్‌లు కూడా ఈ బడ్జెట్‌ను ‘ధన్‌వాపసీ’ కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రభుత్వ ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ వాటి సాధనకు అవసరమైన ‘రోడ్‌మ్యాప్’ బడ్జెట్‌లో కొరవడిందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విమర్శించారు. బిహార్‌కు ప్రత్యేక ఆర్థిక సాయం, ఎయిమ్స్ తరహా వైద్య సంస్థను ప్రకటించినందుకు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.